ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా బాల్యం గురించి, తల్లిదండ్రుల గురించి, జన్మస్థానం గురించి, ఎవ్వరికి ఏమీ తెలియదు.

భోలానాథ్ చటోపాధ్యాయకు పదమూడు ఏండ్ల వయసులో కుక్క కరిచింది. ఎన్ని రోజులకూ  బాధ తగ్గలేదు. ఆత్మహత్య చేసుకుందామని గంగ ఒడ్డుకు పోయాడు.

అక్కడ ఒక సన్యాసి స్నానం చేస్తున్నాడు. ఆ సన్యాసి నదిలోని కదలికలు అనువుగానే నీటిమట్టం  ఉంటోంది. ఇది చూచిన బోలానాథ్ కు ఆశ్చర్యం కలిగింది.

ఆ సన్యాసి నది ఒడ్డుకు వచ్చి ఆత్మహత్య మహాపాతకమని, అతని తల నిమిరి, నది ఒడ్డున ఉన్న ఒక మూలికను ఇచ్చి తినమని, మరునాటికి విషమంతా మూత్రం ద్వారా బయటకు పోవునని భోలానాథ్ కు చెప్పారు.

ఒక యోగ భంగిమను, మంత్రాన్ని తెలిపి “నిరంతర సాధనచెయ్యి. ఒక గొప్ప యోగివవుతావు. ఇంటికి వేళ్ళు” అన్నాడు ఆ సన్యాసి.

భోలానాథ్ మాములు మనిషి అయ్యాడు. సాధన చేయసాగాడు.

టిబెట్ లోని జ్ఞానగంజ్ లో ఉన్న మహాతపని గురువుగా స్వీకరించి, 12 సంవత్సరములు ఆయనను సేవించారు. ఆ గురువు భోలానాథ్ కు సౌర శాస్త్రాన్ని నేర్పారు.

భోలానాథ్ భారత దేశం తిరిగి వచ్చి విశుద్ధానంద పరమహంస అయ్యాడు. ఈయననే గంథం బాబా అని కూడా అంటారు. కాశి నివాసి అయ్యారు.

పరమహంస యోగానంద ఈయనను దర్శించాడు. “నీకు ఏ వాసన కావాలి?” అని అడిగారు విశుద్ధానందులు.

“గులాబీ అన్నారు యోగానంద. “అదే వచ్చు గాక!” అన్నారు విశుద్ధానందులు యోగానందుని అరచేతి నుండి గులాబీ వాసన వచ్చింది. ఆశ్చర్యపోయాడు యోగానందులు. ఇది యోగ మహిమా?

పాల్ బ్రంటన్ విశుద్ధానందుల వారు అనేక అద్భుతాలు చేయటం కనులారా చూచాడు.

విశుద్ధానందుల వారు ఒక పిచ్చుకను పట్టుకుని దాని గొంతు నులిమి చంపారు. ఒక గంట తరువాత అది చనిపోయింది అని నిర్దారించారు.

విశుద్ధానందులు ఒక భూతద్దం తీసుకుని, దాని ద్వారా సూర్యకాంతిని చనిపోయిన ఆ పిచ్చుక కళ్ళలో పడేటట్లు చేశారు, మంత్రాలను ఉచ్చరించారు. మరణించిన ఆ పక్షి మరల జీవం తెచ్చుకుని ఎగిరిపోయింది.

ఇదంతా తన గురువు మహాతపుడు నేర్పిన విద్యయే అన్నారు విశుద్ధానందులు. తన గురువు వయసు 1400 సంవత్సరాలు అన్నారు.

సూర్యకాంతితో అనేక అద్భుత ప్రక్రియలు చేయవచ్చును అని ఆ సౌరశాస్త్రం చెబుతుందంటారు విశుద్ధానందులు.

మార్చి 13, 1853 విశుద్ధానందులు జన్మదినం, యోగ, సౌర శక్తుల పరిమళాలకు మరో నూతన అధ్యాయం మొదలైంది.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles