Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నాకు గురువు తప్ప వేరే ధ్యానం లేదు. వేరే లక్ష్యం లేదు” అంటారు సాయిబాబా.
సాయివలె గురువును ప్రేమించిన వారు అరుదుగా కానవస్తారు. 1829వ సంవత్సరములో ఆగ్రాలో మార్చి 14న జన్మించాడు సాలిగ్రాం రాయ్.
తపాలా శాఖలో గుమస్తాగా చేరి, తన కృషితో పోస్టు మాస్టర్ జనరల్ గా ఎదిగాడు.
బ్రిటీష్ హయాంలో అంతటి అత్యున్నత పదవి పొందిన ప్రథమ వ్యక్తి ఈయనే.
ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. పదవీ విరమణ చేద్దామనుకుంటే, బ్రిటిష్ ప్రభుత్వం వద్దన్నది. అయన గురువు శివదయాల్.
సాలిగ్రాం తాను ఉన్నత పదవిలో ఉన్నా, పదవీ విరమణ చేసినా, గురు సేవలో లోపం ఉండేది కాదు.
రెండు మైళ్ళ దూరంలోనున్న మంచినీటి బావి నుండి నీటిని తోడి కూజాను నీటితో నింపి, చెప్పులు లేకుండా, గతుకుల రోడ్డు మీద, వాన కురుస్తున్నా, ఎండలు మండిపోతున్న, గురూజీకి జలమును సమర్పించేవాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఒకనాటి అర్ధరాత్రి “నాకు హుక్కా ఎవరు తెచ్చి ఇస్తారు?” అని అడిగారు గురువుగారు.
శిష్యులందరూ మెల్లగా, మేడ మెట్లు దిగి బయట నుండి హుక్కాను తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
సాలిగ్రాం గురు సేవకు ఆలస్యం కాకూడదని మేడనుండి ఒక్క గెంతులో దిగి, పరుగెత్తుకొనిపోయి, హుక్కాను తెచ్చి గురువుకు సమ్పరించాడు.
ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది. గురువు మంచినీరు అడిగారు.
ఆ సమయంలో ధోతీతో ఉన్న సాలిగ్రామ్ అక్కడే ఉన్న శాలువాను కప్పుకుని చెప్పులు లేకుండా వడి వడి గా వెళ్ళి నీరు తెచ్చాడు.
గేటు వద్ద ఎవరో ఒక బిచ్చగాడు నీటిని అడిగాడు. సాలిగ్రాం ఆ కూజాను ఇచ్చాడు. బిచ్చగాడు త్రాగి, ఆ కూజాను తిరిగి ఇచ్చాడు సాలిగ్రాంకు.
ఆ నీటిని గురుదేవులకు ఇవ్వటం ఇష్టంలేక మరింత వేగంతో బావి దగ్గరకు పోయాడు. అక్కడ ఆ కూజా పగిలింది.
వెంటనే క్రొత్త కూజాను కొందామని, దుకాణానికి వెళ్ళాడు. “ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. రేపు తెచ్చి ఇస్తాను. ఒక కూజాను అప్పుగా ఇవ్వు” అని అడిగాడు సాలిగ్రాం.
“అప్పు ఇవ్వను రేపే పట్టుకుపో” అన్నాడు దుకాణదారుడు. వెంటనే తన ఒంటిపై నున్న శాలువనుతీసి దుకాణదారుకు ఇచ్చి “నేను డబ్బు (కూజా ఖరీదు) ఇచ్చేదాకా ఉంచుకో” అన్నాడు.
కూజాను ఇచ్చాడు దుకాణదారుడు. వెంటనే నీటిని నింపి కేవలం ధోతీమీదనే, చెప్పులు లేకుండా, భుజాన కూజాను పెట్టుకుని బయలుదేరాడు సాలిగ్రాం.
అప్పుడు ఇంకా పోస్టుమాస్టరు జనరలుగానే ఉన్నాడు. ప్రజలేమనుకున్నా లెక్కచేయలేదు.
సాలిగ్రాం వద్దకు తన బాల్య స్నేహితుడు త్రాగి వచ్చాడు. “కనీసం నా ముందైనా త్రాగుడు మానరా!” అన్నాడు సాలిగ్రాం.
“సరే” అన్నాడు. ఎప్పుడైనా త్రాగుదామని బుడ్డిని తెరచినా వెంటనే సాలిగ్రాం అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. తన స్నేహితుని శక్తి తెలిసి త్రాగుడు మాని మంచి శిష్యుడు కూడా అయ్యాడు.
నేడు మార్చి 14, సాలిగ్రాం జయంతి. రాధాస్వామీజీ సత్సంగ సాంప్రదాయ గురువైన సాలిగ్రాం వంటి గురు భక్తి మనకు అలవాడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రేమ లేని వాడు … మహనీయులు – 2020 – జనవరి 19
- మనసా ఎందుకె నీకింతా తొందర…… మహనీయులు – 2020… ఆగస్టు 2
- చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు…. …. మహనీయులు – 2020… నవంబర్ 11
- గంగార్పణం …. మహనీయులు – 2020… మార్చి 6
- సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments