Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మహిమలు అనంతము. క్రీస్తు మంచి నీటిని ద్రాక్ష రసంగా మార్చెను. సాయిబాబా నీటిచే దీపములు వెలిగించెను.
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారిని హైదరాబాదు పాదుషా గారు ఒక కోరిక కోరారు.
ఇంత వరకు వీరబ్రహ్మేంద్రస్వామి వారి లీలలెన్నో విని యున్నామనియు, ప్రత్యక్షముగా ఒక లీల చూడవలెనని కోరికను వెల్లడించారు. స్వామి “సరే” అన్నారు.
“నీటితో దీపమును తాము వెలిగించవలెను” అని పాదుషా కోరారు. స్వామి ప్రమిదయు, నీటిని తెప్పించారు.
చకుముకి రాయి కొట్టి అగ్గి చేసి, ఆ నీటిని ప్రమిదలో పోసి దీపమును వెలిగించారు. తెరచాటు నుండి రాణి పరివారము కూడా చూచింది ఆ లీలను. అందరూ జయ జయ ధ్వానములు చేసారు.
వీరప్పయ గారు (వీరబ్రహ్మం గారు) పశువుల కాపరిగా కొంత కాలముండిరి.
పశువులను కాచునపుడు ఆయన గిరి గీసెడి వారు. పశువులన్నియు ఆ బరిలోనే ఉండెడివి.
ఇంకా ఆయన యాంగటి కొండా గుహలో తపస్సు చేసుకొనెడి వారు. అయిదు శిరస్సులు గల నాగేంద్రుడు పడగ విప్పుకొని గొడుగు పట్టి నట్లుండెడి వాడు.
ఆయన ఉదయముననే లేచి జుర్రేటిలో స్నానము చేసి అడవి లోనికి పోయేవారు. ఆ సమయమున దారిలో నున్న తాటి చెట్లు వాటంత అవే వంగి నమస్కరించెడివి.
స్వామి అందిన కొన్ని ఆకులను తీసుకొని మఠమునకు వచ్చి గ్రంథమును వ్రాసెడి వారు.
ఇంకను అన్నాజయ్య అను పేరు గల భక్తుడు వీరబ్రహ్మేంద్రస్వామికి ఆ తాటి చెట్ల పత్రములు అందునట్లు చేశాడు. వాటిపైన లిఖించబడినదే కాలజ్ఞాన తత్వము.
ఆ గ్రంధమును ఆయన అన్నాజయ్యకు, అచ్చమ్మ అను భక్తురాలికి కొంత చదివి వినిపించారు.
అచ్చమ్మ గారి ఇంటి ముందొక పాతర చేయించి, అందే ఆ గ్రంథ పత్రములను భద్రపరిచారాయన.
“ఈ గ్రంధమును ఎవరూ చూడరాదు. అటుల జరిగిన ప్రజలు భయ కంపితులగుదురు” అని ఆయన దానిపై చింత చెట్టును మొలిపించెను.
అది మాములు కాయలు కాయదు. “ప్రపంచమునకు ఉత్పాతము సంభవించినపుడు సూచన నిచ్చును. అప్పడు మేళ తాళములతో భజనలు చేయుచు పూజించినచో లోక శాంతి కలుగును” అన్నారాయన .
ఆ వృక్షము నేటికిని ఉన్నది.
వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి చెందారు.
ఆయన జన్మ దినం కార్తీక శుద్ధ ద్వాదశి.
స్వామి పదాలు నేటికిని జనుల నోటిలో పలుకు చున్నవి.
“చిల్లర రాళ్లకు మ్రొక్కుతు నుంటే…”
“చెప్ప లేదంటనక పోయేరు…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- బింబము – ప్రతిబింబము…. మహనీయులు – 2020… జూలై 11
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
- తాతకు తగ్గ మనుమరాలు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments