Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా భక్తులు తమ పిల్లలకు సాయినాథుని పేరు పెట్టుకుంటారు.
వెంకటరాజు, లక్షమ్మలకు పుట్టిన మూడవ బిడ్డ పేరు వెంకటరాజు. రాజు తదనంతర కాలంలో పుల్లయ్యస్వామి అయ్యారు.
వెంకటరాజరాజు తన తండ్రివద్ద భారత, భాగవత, రామాయణాలను చదివి ఆకళింపు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసాడు.
ఒకనాడు వెంకటరాజరాజు పెండ్లిమఱ్ఱి పుల్లయ్యగారిని దర్శించాడు. అప్పటికే పెండ్లిమఱ్ఱి పుల్లయ్య యోగి.
ఆ యోగి వద్ద శిష్యరికం చేయసాగాడు వెంకటరాజరాజు ఉద్యోగం విషయమే మరచాడు ఆయన.
ఒకసారి పుల్లయ్య గారు తమ గురువు సమాధి చెంత నిద్రించమని ఆయనను చెర్లోపల్లెకు పంపారు.
ఆ రాత్రి పరమ గురువుల (గురువు యొక్క గురువు) సమాధి చెంత ధ్యానించసాగారు. దర్శనం అయింది. బాహ్య స్మృతి కోల్పోయాడు. స్పృహ వచ్చిన తరువాత ఆయన అవధూతగా మారాడు.
గురుదేవుడైన పుల్లయ్యను దర్శించాడు. దిగంబరిగా ఉన్న ఆ అవధూతను చూచి పుల్లయ్య సంతసించాడు. వెంకటరాజరాజు తన నామమును పుల్లయ్యగా మార్చుకొన్నాడు.
జనార్దనుని ముగ్గరు శిష్యులు తమ నామముతో జనార్దన నామమును జోడించుకొనినారు. – వారు రామ్ జనార్దన్, జానీ జనార్దన్, జాన్ జనార్దనులయ్యారు. గురువు బింబము, శిష్యుడు ప్రతిబింబము.
అవధూత పుల్లయ్య అనేక లీలలు చూపాడు, బోధలు చేశాడు.
ఒకసారి ఆయనవద్దకు పోట్లదుర్తి నుండి రైతులు వచ్చారు. వర్షంలేక ఆ రైతులు కట కటలాడుతున్నారు.
అవధూత పుల్లయ్య ఆ ఊరి రచ్చబండ దగ్గర తనను కూర్చుండబెట్టి, ఏటిలోకి స్నానపు నీరు పారేటట్లు తనను స్నానం చేయించాలని, గ్రామోత్సవం చేయాలనీ చెప్పారు. వారు అంగీకరించారు.
అవధూతకు స్నానం చేయించి, ఆ నీరు ఏటిలోకి పారేటట్లు చేసి, రిక్షాపై ఆయనను గ్రామంలో ఊరేగించారు.
వెంటనే ఆ గ్రామంలో మాత్రమే కుంభవృష్టి కురిసింది. ఇటువంటి కరుణను గొలగమూడి వెంకయ్యస్వామి గారు కూడా చూపారు.
ఒక మహిళను మైదుకూరు ఆస్పత్రికి తీసుకుపోతున్నారు ఆమె బంధువులు. ఆమెకు అక్కడ శస్త్ర చికిత్స చేయించాలనే ఉద్దేశ్యంతో,
స్వామి ఆమెను ఆపించాడు. “మా దగ్గర కత్తులున్నాయి. మనమే ఆపరేషన్ చేయగలం” అన్నారాయన.
స్వామి ఆమెకు ఒక గ్లాసులో కొంత నీటిలో తాము పీల్చుకునే నశ్యమువేసి ఆమెకు త్రాగమని ఇచ్చారు. పది నిమిషములలో ఆమెకు నెప్పి తగ్గిపోయింది.
ఆపరేషన్ చేయించవలసిన అవసరమే కలుగలేదు. ఇటువంటి సంఘటన జిల్లేళ్ళమూడి అమ్మ జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు.
ఒకసారి పుల్లయ్యస్వామికి ఫలహారం తెచ్చిద్దామని ఒక భక్తుడు లేచాడు. స్వామి ఆపాడు అతనిని.
కొద్దిసేపటిలో ఇడ్లీలు, వడలు, పూరీలు వచ్చాయి. అవి స్వామికే కాక అందరకూ సరిపోయాయి.
స్వామి జూలై 11, 1983 స్థూలకాయం విడిచారు.
నేడు 11 జూలై. స్వామి వర్థంతి.
ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- “నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- ‘చిత్రం’ భలే విచిత్రం…..సాయి@366 జూలై 11…Audio
- చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు…. …. మహనీయులు – 2020… నవంబర్ 11
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments