“నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


తూర్పు బెంగాల్ నుండి జ్ఞాన్ అనే యువకుడిని అరూపానంద మాతృదేవి శారదా దేవికి పరిచయం చేశాడు.

అక్కడున్న వాతావరణానికి అతడు ముద్గుడైనాడు. రామకృష్ణులు ఎవరో, శారదా మాత ఎవరో కూడా అతనికి తెలియదు.

మంత్ర దీక్ష తీసుకోవటానికి సిద్దమైనాడు. శారదా దేవి మంత్ర దీక్ష నిచ్చి, రామకృష్ణుల ఫొటోకు నమస్కరింపుమని  అతడిని ఆదేశించింది.

“నే నేందుకు నమస్కారం చేయాలి?” అని ఆ యువకుడు అడిగాడు. “ఆయన ప్రతిచోటా ఉంటారు. ఈ విశ్వానికి గురువు” అంది శారదా మాత.

“ఆయన నాకు ఎలా గురువు అవుతారు. మంత్ర దీక్షను మీరిచ్చారు కాబట్టి మీరే నా గురువవుతారు” అన్నాడు అతడు.

“నేను నే గురువును కాను. ప్రతి ఒక్కరికి తల్లిని” అంది శారదా మాత. జ్ఞాన్ కు జన్మ నిచ్చిన తల్లిగా దర్శన మిచ్చింది.

జ్ఞాన్ వెంటనే ఆమె పాదాలపై పడ్డాడు. “తల్లీ  నీవు నాకు గురువేకాదు, ఈ విశ్వానికే మాతవు” అన్నాడు ఆనంద భాష్పాలతో అతడు.

సరిగ్గా ఇలానే సాయిని సందర్శింప వచ్చిన ఒక వ్యక్తితో ఆతని తండ్రి గోతుకతో పలికి, ఆ సందర్శకుని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.

మొదటిసారిగా శారదా దేవి ఫోటోను చూచిన స్వామి ప్రశాంతానంద ఆశ్చర్యపోయాడు. ఆ ఫొటోలో తన తల్లి కనిపించుటయే కారణం.

అమ్మ  స్పర్శ, అమ్మ దర్శనం, అమ్మ స్మరణలతో కూడా మహాత్మ్యం దాగి ఉంది.

ఐనా రామకృష్ణ పరమహంస సహధర్మచారిణిగా, ఆమె చూపేది మహాత్మ్యం కాదు, మాధుర్యం.

రామకృష్ణులు శారదా దేవిని వివాహమాడిన తరువాత “నీవు నన్ను మాయలో దింపదలచావా?” అని అడిగారు. “అలా ఎందుకు చేస్తాను. మీ ఆధ్యాత్మిక మార్గంలో సాయం చేయటానికే వచ్చాను” అందామె.

1873 అక్టోబరులో శారదా దేవికి షోడశపూజ చేశారు రామకృష్ణులు.

అప్పటివరకు ఆమె రామకృష్ణుని అర్దాంగి, దివ్య శక్తి ప్రకటితమైన తరువాత ఆమె ఆదర్శ సన్యాసిని, ఆదర్శ మాత, ఆదర్శ గురువు అయింది.

ఆమె జూలై 21, 1920 లో రామకృష్ణునిలో ఐక్యమైంది.

నేడు జూలై 21. శారదా మాత వర్థంతి.

ఆమె అంతిమ సందేశమును పాటింతుము గాక!

“మనశ్శాంతి కావాలంటే, ఇతరుల దోషాలను ఎంచటానికి బదులుగా, నీ దోషాలను ఎంచుకో. ఈ సర్వ ప్రపంచము నీదిగా చేసుకో. నీకు పరాయి వారెవరు లేరు.

ఈ సర్వ ప్రపంచం నీదే”!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles