శృంగేరి పీఠం … మహనీయులు @2020 – జనవరి 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మండనమిశ్రునకు, శంకరాచార్యులవారికి మధ్య జరిగిన వాదానికి మధ్యవర్తిగా మండనమిశ్రుని భార్య ఉభయభారతి ఉంది.

ఉభయభారతి ఆదిశంకరుల విజయాన్ని అంగీకరించి, తిరిగి తాను సత్యలోకమునకు వెళ్ళిపోతాను అని శంకరాచార్యులతో చెప్పింది.

అప్పుడు శంకరులు “తల్లీ! అలాగే వెళ్ళిరా, కానీ నేను స్థాపించబోయే పీఠాలలో నువ్వుండి శారదామాతగా పూజలందుకొని, ఇష్టార్థాలు ప్రసాదించాలి” అని ఆమెను ప్రార్ధించారు.

ఆమె సాక్షాత్తు సరస్వతీ దేవియే. ఆమె అందుకు అంగీకరించి సత్యలోకానికి వెళ్ళిపోయింది.

మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహరావుగారు వారి సోదరుని కుమార్తెకు ఏమి పేరు పెట్టమంటారని సాయిబాబాను అడుగగా సాయి “శృంగేరి శారదాదేవి పేరు పెట్టు” అన్నారు. ఆ భక్తుడు అలానే చేశారు.

మండనమిశ్రుడు శంకరుల వద్ద సన్యాసం తీసుకుని సురేశ్వరులు అయ్యారు.

ఆదిశంకరులు శృంగేరిలో ఉండగా తుంగా నదీ తీరంలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూచారు.

ఒక అడ కప్పు ప్రసవ వేదనపడుతుంటే, దానికి ఒక తాచుపాము తన పడగ ఎట్టి ఎండ బాధ కలగకుండా రక్షిస్తున్నది. అది స్థల మహాత్యమని శంకరులు గుర్తించారు.

అచటనే బుష్యశృంగుడు తపస్సు చేసిన భూమిగా తెలుసుకుని, ఆ పవిత్ర స్థలంలో జంతువులకు కూడా పాప బుద్ది, పగవంటివి లేకపోవటం సహజమనుకుని, ఆ ప్రదేశంలో ఒక శారదాపీఠం స్థాపించాలని నిర్ణయించారు.

ఒక రాతి పలకమీద శ్రీ చక్రాన్ని తయారుచేసి, ఆ పలక మీద అంబికను శారదా నామముతో ప్రతిష్టించారు శంకరులు. శారదాదేవిని శంకరులు ప్రార్ధించారు.

గతంలో ఆమె శంకరులకిచ్చిన వాగ్దానం ప్రకారం శృంగేరీలో సుప్రసన్నంగా ఉండి భక్తులకు శుభాలను, శ్రేయస్సును చేకూరుస్తోంది.

ఆ మఠమునకు ప్రధమ అధిపతి సురేశ్వరాచార్యులవారు. శంకరులు శృంగేరీ పీఠాన్ని అంటే శారదా పీఠాన్ని ప్రతిష్టించిన పవిత్రదినం పుష్యమాసంలో పూర్ణిమ(484 బి.సి).

ఈ మఠానికి మహావాక్యం శుక్ల యజుర్వేదంలోని అహంబ్రహ్మాస్మి. విశేషమేమిటంటే ఆదిశంకరుల తల్లిదండ్రులు కృష్ణ యజుర్వేద సంప్రదాయంవారు, సురేశ్వరుల పూర్వాశ్రమంలోని వారు శుక్ల యజుర్వేద సంప్రదాయం వారు.

శృంగేరీ పీఠంలో సరస్వతీ, భారతీ, పురీ అనే నామాలను బ్రహ్మచారులకిస్తారు. శివుడిని శారదా సమేత చంద్రమౌళీశ్వరునిగా ఆరాధిస్తారు.

రామకృష్ణ పరమహంస గురువైన శ్రీ తోతాపురి యతీంద్రులు, హృషీకేశ పరమ గురువులు శ్రీ శివానంద సరస్వతి, చిన్మయాశ్రమాలు దేశమంతటా నెలకొల్పిన చిన్మయానందులు ఈ మఠ సంప్రదాయపు వారే.

ఇంకా ఆదిశంకరులు తాను వ్రాసిన తైత్తరీయ, బృహదారణ్యకోపనిషత్ లకు వార్తికం (టీకా) వ్రాశారు. వీరినే వార్తికాచార్యులంటారు.

పుష్య మాసం సామాన్యంగా జనవరి నెలలో వస్తుంది. సురేశ్వరాచార్యుని స్మరించెదము గాక! విశ్వము మాయమయమని తన ప్రబోధంతో చూపిన విశ్వ స్వరూపుడైన వార్తిచార్యుడైన శ్రీ సురేశ్వరులను నేను ఆశ్రయిస్తున్నాను.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles