Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అది ఉత్తర భారత దేశంలోని జ్యోతిర్మఠ పీఠం. ఆ దినం పుష్య శుద్ధ పూర్ణిమ (పుష్యమాసం సామాన్యంగా జనవరిలో వస్తుంది).
విశేషమేమిటంటే, ఆదిశంకరులు ఆ పీఠాధిపతిగా తోటకాచార్యుల వారిని ఎంపిక చేయటం తోటకాచార్యులకు ఉన్న ప్రతిభాపాటవాలతో ఆ పీఠాన్ని అధిరోహించలేదు. ఆయనకు ఉన్నది కేవలం గురువుపైనా వెలకట్టలేని ప్రేమాభిమానాలు మాత్రమే.
తోటకాచార్యుల పూర్వ నామం గిరి. కళనాథుడనే మరో పేరుండేది కూడా. ఇతను అగ్నిదేవుని అంశతో జన్మించాడు.
ఉపనయనం జరిగింది. చదువు సరిగా సాగలేదు. ఆ సంగతి గురుదేవులైన ఆదిశంకరులకూ తెలుసు. ఆదిశంకరులు బోధించేటప్పుడు నిశ్చబ్దంగా వినేవాడు.
శంకరుల మేధస్సుకు, విద్వత్తుకు పరవశించిపోయేవాడు. తోటకాచార్యులు గురుబోధల కంటే సద్గురు సేవపైనే తన మనస్సును, తనువును కేంద్రీకరించేవాడు.
ఒకనాడు ఆదిశంకరులు పాఠం మొదలుపెట్టబోగా, తోటకాచార్యులు అక్కడ లేదని గమనించారు. తోటకాచార్యులు ఇక్కడ ఉన్నా గ్రహించగలిగేదేమీ లేదని, పాఠాన్ని ప్రారంభించామని శిష్యులు అన్నారు.
తోటి శిష్యులు అలా ఒక సోదర శిష్యుని కించపరచి మాట్లాడటం సబబుకాదని గ్రహించారు శంకరులు. తోటకాచార్యులను మనసులోనే ఆశీర్వదించారు గురువర్యులు.
గురువు అనుగ్రహంతో నోటి నుండి ధారగా సంస్కృత భాషలో కష్టమైన తోటక వృత్తంతో శ్లోకాలు రాసాగాయి. కృతజ్ఞతాపూర్వకముగా, అతని అశృధారలు ఆదిశంకరుల పాదాలను కడిగాయి.
తోటకాచార్యుల ముఖంలో వ్యక్తమగుచున్న తేజస్సు తోటివారలను ఆశ్చర్యపరచింది. “శిష్యులారా! చూచారా గిరి (తోటకాచార్యులు) ఎంతటివాడో, ఎంత శాస్త్రజ్ఞానం, పాండిత్యము ఉన్నా శ్రద్దా, భక్తులు లేకుంటే వ్యర్థం.
శ్రద్ద వలన చిత్తశుద్ధి, ఏకాగ్రత అలవడతాయి. తద్వారా ఆత్మజ్ఞానము పొందవచ్చు. శుష్క శాస్త్ర జ్ఞానమెంత?” అన్నారు ఆదిశంకరులు.
“గురు నామం, గురువు సహవాసం, గురుకృప, గురుచరణ సేవనం, గురు మంత్రం, గురు గృహ నివాసం అత్యంత ప్రయాసతో లభిస్తాయి” అంటారు సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్. గిరి (తోటకాచార్యులు) వంటివారు మాత్రమే అర్హులవుతారు.
తోటకాచార్య విరచిత అష్టకాన్ని శంకరజయంతి నాడు శిష్యులు ఎనిమిదిసార్లు పఠించి, 8 సార్లు నమస్కరించటం సంప్రదాయం.
ప్రతి పున్నమినాడు గురుకృపచే జ్యోతిర్మఠ పీఠం అధిరోహించిన తోటకాచార్యుల అష్టకం పఠించెదము గాక!
శంకర కృప లభించు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శృంగేరి పీఠం … మహనీయులు @2020 – జనవరి 8
- సద్గురు దర్శనం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 3
- జీవించు – జీవించనీయి…. మహనీయులు – 2020… మే 10
- శ్రీ దత్త శరణం మమ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 27
- చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు…. …. మహనీయులు – 2020… నవంబర్ 11
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments