Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి నేను చిలకలూరి పేట నుండి గుంటూరుకి స్కూటర్ మీద బస్టాండ్ రోడ్డు మీద వెళ్తున్నాను. నాకు బాగా ఆకలి వేస్తుంది. టిఫిన్ తినాలి.
బస్టాండ్ రోడ్డు అవటంవల్ల ఊళ్లన్నీ రోడ్డు కిందగా వెళ్లిపోతున్నాయి టిఫిన్ కోసం చూసుకుంటూ ఇక్కడ కాదు ఇంకొంచం ముందుకు వెళ్ళాక తిందాం అనుకుంటూ వెడుతున్నాను.
నాకు నీరసం వస్తుంది. ఆ నీరసంతో నిద్ర కూడా వస్తుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను.
అంత నిద్రవస్తునప్పుడు బండిని కాసేపు పక్కకి తిప్పి ఉంచాలి. టిఫిన్ తినక పోవడం వల్ల నిద్ర వస్తోంది కాబట్టి ఎదో ఒకటి ముందు తినేయాలి. అదేమీ చేయకుండా స్పీడుగా బండిని పొనిస్తున్నాను.
రోడ్డు మీద ఒక లారీ డ్రైవర్ లారీని ఆపి టీ తాగడానికి దిగాడు. నేను నిద్రపోతూ స్పీడుగా వెళ్లి లారీని గుద్దేశాను. బాబా అంటూ ఒక్క గావు కేక పెట్టాను.
అసలు నేను లారీని గుద్దిన స్పీడుకి నా ప్రాణాలే పోవాల్సింది. నా పీక కోసుకు పోయిండాలి.
బండి ఒక సైడికి నేను ఒక సైడుకి పడ్డాము. బండికేమి కాలేదు నాకు బయటికేమి కనపడటం లేదు. లారీ ఒకంత ముందుకి జరిగింది. ఆ స్థలం నుండి నేను లేవలేకపోయాను.
కాలి తుంటి దగ్గర పట్టుకున్నట్లు అయింది. ఖచ్చితంగా నేనా నిమిషంలో చచ్చిపోయి ఉండాలి. ఆ పక్క ఊరిలోనే మా వాళ్ల అబ్బాయి ఉన్నాడు, అతనికి జరిగిన విషయం ఫోన్చేసి చెప్పాను.
పదినిమిషాలలో వచ్చేసాడు.బండి పక్కకి పడిపోయివుంది. కళ్ళజోడు కూడా దూరంగా పడిపోయివుంది.
అది విరగను కూడా లేదు, నా బండికి ఏం కాలేదు. నెమ్మదిగా ఆ అబ్బాయి సాయం పట్టి లేపించాడు. నేను లేవలేక పొయాను.
ఇంకా ఇద్దరి సాయం తీసుకొని, తీసుకువెళ్లి గుంటూరులో హాస్పిటల్లో చేర్పించారు. ఏ ఒక్క డాక్టర్ కూడా నన్ను పట్టించుకోవడం లేదు.
యాక్సిడెంట్ అంటే ఏ కాలో చెయ్యో విరగడమో, లారీ గుద్దేశానంటే మనిషికి కనీసం ఎక్కడ రక్తపు బొట్టు కనిపించకుండా ఉంటే డాక్టర్స్ ఏం పట్టించుకుంటారు.
నేను బాబా కి దండం పెట్టుకుంటున్నాను ఈ లోపు మా తమ్ముడు కూడా అక్కడికి చేరాడు. అందరూ కలిసి కూడబలుక్కొని హైదరాబాద్ లో ఉన్న మా ఆవిడకి ఫోన్ చేసారు.
యాక్సిడెంట్, లారీ గుద్దేసింది అనగానే మా ఆవిడకి ఫై ప్రాణాలు పైనే పోయాయి.
శోకాలు పెడుతూ బాబా ముందు కూర్చుని ఏమిటీ బాబా ఈ పరీక్షలు? కష్టాలన్నీ మాకేనా? ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన లేకుండా నేను ఎలా బ్రతకాలి? ఆయన మంచంలో ఉన్న నేను తట్టుకోలేను.
ఆయన వొంటిపై నేను ఎక్కడా రక్తం చూడకూడదు, ఏం చేస్తావో నాకు తెలియదు, నేను బయల్దేరి వెళ్తున్నాను.
ఎదో చిన్నగా గీరుకోవాలే కానీ పెద్ద దెబ్బలు తగలకూడదు, అనుకుందట.
పాపం అక్కడ నుండి తిండి తిప్పలు లేకుండా రైలు ఎక్కి మర్నాటికి గుంటూరు చేరుకుంది.
హాస్పిటల్ లో అంత దూరాన నా ఒంటిమీద కట్లు కానీ రక్తం కానీ కనపడక పోయేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం నేను చూసాను.
నాకు ఎప్పటికో డాక్టర్ వచ్చి ఒక్క ఇంజక్షన్ చేసారు .హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నాను.
తుంటి జాయింట్ కొంచెం పక్కకి తప్పుకున్నదట,దానితోనే పోయింది. బాబా దయ వలన, నేను అంత యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను.
అప్పటి నుంచి స్కూటర్ తోలడం మానుకున్నాను. అది ఎప్పుడు నడిపిన నాకు నిద్ర వస్తుంది.
ఆనాడు బాబా మా ఇంటికి కీ చైను రూపంలో ప్రవేశించి మా పనులన్నింటికీ తానే సాయం అయ్యి తానే సర్వం అయ్యి ఉన్నాడు.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari. Sainathuni
Latest Miracles:
- నా మేన కోడలిని పెద్ద ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు.
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
- కలలో కనిపించి పసుపు కుంకుమ ఇచ్చి, భక్తురాలి ఐదవ తనాన్ని కాపాడిన బాబా వారు.
- బాబా వారు చేసిన సహాయంతో పెద్ద ఆక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయట పడిన భక్తురాలి కుటుంబం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments