బాబా వారు చేసిన సహాయంతో పెద్ద ఆక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయట పడిన భక్తురాలి కుటుంబం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


2013 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, అది ఏంటంటే మా వారు నన్ను చాలా అపురూపంగా చూసుకుంటారు.

నన్ను ఎక్కడికైనా తానే స్వయంగా తీసుకొనివెళ్తారు కానీ వేరే వారితో నన్ను ఎక్కడికి పంపరు.

ఒకసారి మా ఆడపడుచు గారి అమ్మాయి హైదరాబాద్ లో వుంది, తనకేదో అత్యవసరంగా వాళ్ళ అమ్మ రావాల్సిన పరిస్థితి ఎదురైంది అందుకని మా ఆడపడుచు గారొక్కరే బయలుదేరటానికి సిద్ధమయ్యారు.

ఆవిడ మావారి కంటే చాలా పెద్దది. ఒక్కతే ఎందుకంత దూరం ప్రయాణం చేయడం అక్కా! మీరు ఒక్కరే వెళ్ళవద్దు నేను కూడా మీతోటి వస్తాను అని ఆవిడకి చెప్పి, మావారి తోటి ఈ విషయం చెప్పాను.

మా వారు వెంటనే నువ్వు వెళ్ళవద్దు అన్నారు. నేను వస్తాను అని ఆవిడకి ముందే చెప్పాను. ఇప్పుడు కాదంటే ఆవిడ ఫీల్ అవుతుంది. రేపు సాయంత్రానికి తిరిగి వస్తాము నువ్వు అడ్డు చెప్పకు అని అంటూ మా వారికి నచ్చ చెప్పాను.

తను అయిష్టంగానే ఒప్పుకున్నారు. సాయంత్రానికి మా మరిదికి ఈ విషయం తెలిసి అది ఏమిటి ఆడ వాళ్ళు ఇద్దరూ వెళ్ళటం ఏమిటి? నా కారులో నేను తెసుకువెళ్తాను అంటూ తాను వాళ్ళావిడ తోటి బయలుదేరాడు.

మా వారు నన్ను ఆ రాత్రి వాళ్ళ అక్క వాళ్ళింట్లో దింపేసాక కూడా ఇంకా, ” అక్కా నువ్వు వెళ్లకుండా ఇక్కడి నుండి మెసేజ్ చేయకూడదా? నువ్వు బయలుదేరితే నీతో కూడా వీళ్ళందరూ బయలుదేరుతున్నారు ” అన్నారు మొహం ఎలాగో పెట్టుకొని,

మా ” ఆడపడుచు లేదురా నేను తప్పనిసరిగా వెళ్ళాలి, రేపు సాయంత్రం తిరిగి మళ్ళీ బయలుదేరుతాము ” అని అన్నారు.

నన్ను వాళ్ళింట్లో దింపేసి వెళ్లిపోయారు. రాత్రి 11:30 గంటలకు మేమందరం బయలుదేరాము. డ్రైవింగ్ సీట్లో మా మరిది , ప్రక్కన మా తోడికోడలు, ఆవిడ వెనుక మా ఆడపడుచు మా మరిది వెనుక నేను కూర్చున్నాను.

మేమంతా సరదాగా మాట్లాడుతూనే వున్నాము. తెల్లవారితే గురువారం. నేను బయలుదేరే ముందే బాబాకి హారతికి అన్ని రెడీ చేసేసి ఉదయం లేవగానే మా వారిని హారతి ఇవ్వమని చెప్పి మరీ వచ్చాను.

ఉదయం 6 గంటలకి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. నా మొబైల్ లో బాబా ఫోటో వుంటుంది. అది ఆన్ చేసి నేను బాబాను చూసుకొని దండం పెట్టుకున్నాను.

మా ఆడపడుచు అప్పుడే నిద్రలోకి జారుకుంటుంది. ఆవిడ కూడా బాబా భక్తురాలు. ఆవిడనీ తట్టి లేపి, అక్కా! ఈ రోజు గురువారం ఇదుగో బాబాకు దండం పెట్టుకో అని అన్నాను.

ఆవిడ కళ్ళు తెరిచి దండం పెట్టుకున్నారు. నాలుగైదు నిమిషాలు అయిందో లేదో పెద్ద ఆక్సిడెంట్ అయింది.

నేను మా మరిదితోటి కబుర్లు చెబుతూనే ముందుకు వంగి కూర్చొని వున్నాను. రైట్ లో బస్సు అడ్డంగా వుంది. వాడు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సిగ్నల్ వేసుండంగా రైట్ నుండి లారీ వాడు వస్తున్నాడు,

నేను ముందుకు ఉండటం మూలాన అది నాకు ‘ బాబా ‘ మిర్రర్ లో చూపించారు. మా మరిది హైదరాబాద్ రోడ్లు చాలా బాగుంటాయి డ్రైవింగ్ కి అంటూ తను సరదా పడుతున్నాడు.

నేను ఆ లారీని గమనించి వెంటనే మా మరిదికి చెప్పి తను నేనేమిచెప్తున్నానో విని దానికి తన బ్రెయిన్ రియాక్ట్ అయ్యేలోపలే ఘోరం జరిగిపోయింది చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపొయింది.

‘ జర్నీ ‘ అనే సినిమాలో అచ్చంగా ఇలాగే జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అన్నది ఆ సినిమా చుసిన వారికి అర్థం అవుతుంది.

ఆ నాటి సౌండ్స్ ఇంకా ఇన్నిరోజులైనా నా చెవులకి వినపడుతూనే వున్నాయి. అంతే మాకింక స్పృహ లేదు. అసలు నిజానికి కారు మధ్యలోకి వెళ్ళివుంటే నలుగురం చనిపోయి వుండేవాళ్ళం.

లెఫ్ట్ కి వెళ్లి వుంటే ఇటువైపు వున్న ఇద్దరు పోయివుండేవారు, రైట్ కి పోయివుంటే అటువైపున్న మేమిద్దరం పోయివుండేవాళ్ళం.

ఆలా కాకుండా జస్ట్ టైర్ మాత్రమే తగిలింది. మమ్మల్ని చూసిన పోలీసులు చెప్పారు. P .V .NARASIMHA RAO ఫ్లై ఓవర్ లో అది యాక్సిడెంట్ జోన్ అంట.

మా కారు టైర్ పట్టుకొని ఎవరో వెనక్కి మూడు అడుగులు ఎత్తు ఎత్తినట్లుగా వెనక్కి త్రోసేసినట్లు గా అయిందట. అది అక్కడ వున్న పోలీసులు స్పష్టంగా చూసారట.

AC కోసం డోర్స్ వేసేసి వున్నాయి అవి బాగా జామ్ అయిపోయాయి. మా నలుగురికి బాగా దెబ్బలు తగిలాయి. అందరికంటే నాకే ఎక్కువగా దెబ్బలు తగిలాయి.

నాకు స్పృహా వచ్చేటప్పటికి నా చెయ్యి విరిగి బోన్ బయటకి వచ్చేసింది, మా ఆడపడుచుకి నడుం విరిగిపోయింది, మా మరిదికి రిబ్స్ ఎముకలన్నీ విరిగిపోయాయి, అద్దాలన్నీ మా తోడి కోడలికి మోకాలిలో దిగిపోయాయి.

నాకు పూర్తిగా స్పృహ వచ్చేటప్పటికి వేల మంది జనాలు చుట్టూతా వున్నారు. ఒక 10 , 20 అంబులెన్సులు చుట్టూతా వున్నాయి.

కారులో ఎంతమంది వున్నారో, వాళ్లే కండిషన్ లో వున్నారో బయటకి తెలియటం లేదు. అసలు వున్నారో లేదో కూడా వారికి తెలియటం లేదు, అద్దాలు పగలగొట్టి మమ్మల్ని క్రేన్ల సహాయంతో తో అతి కష్టం మీద బయటకి లాగారు.

శంషాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ వుంది. అందులో మమ్మల్ని జాయిన్ చేసారు. వాళ్ళు అక్కడ నుండి వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసారు.

అప్పుడు చూసుకున్నాను నేను నా బ్లౌస్ హుక్స్ అన్ని ఊడిపోయి వున్నాయి. ఒకతను అక్కడ నిలబడి వున్నాడు. అతన్ని పిలిచి అన్నా ఎవరైనా లేడీస్ వుంటే పంపిస్తారా? అని అడిగాను. ఒకావిడను పంపించారు.

ఆవిడ నాకు హెల్ప్ చేసింది. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నేను గమనించాను అతను ఐ విట్నెస్ గా ఆలా చెబుతున్నాడు అందరికి. సాయంత్రానికి మా వాళ్ళు అందరు వచ్చేసారు.

4 గంటలు దాకా అతను మా కూడానే వున్నాడు. మా మొబైల్స్, బ్యాగ్స్, మా ఆడపడుచు బ్యాగులో 60,000 రూపాయలు డబ్బు ఉంది. ఇంకా మా బ్యాగు లో కూడా కొంత డబ్బు ఉంది.

ఇంకా మా వొంటి మీద బంగారాలు అన్నీ అతని దగ్గరే వున్నాయి. 4 గంటలకి అతనికేదో ఫోన్ వచ్చింది. ” అమ్మా నా నెంబర్ మీ మొబైల్ లో ఫీడ్ చేశాను.

మీది ఈ స్టేట్ కాదు కదా! మీకెటువంటి హెల్ప్ అంటే ఫైనాన్స్ గాని ఫీజికల్ గా కాని ఎటువంటి హెల్ప్ కావాలంటే కూడా నా మొబైల్ కి కాల్ చెయ్యమ్మా! నేను చూస్తాను ” అని చెప్పి వెళ్లిపోయాడాయన.

మా ఫోన్స్, బ్యాగులు అన్నీ పోలీసుల చేతుల్లో వున్నాయి. నాకు ఫోన్ కావాల్సి వచ్చి ఆయన్ని మా ఫోన్ అడిగితే ” అమ్మా మీ ఫోన్లు అన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి ” అన్నారు.

” ఎలాగా, విషయం మా వాళ్లకి తెలియ చేయాలిగా నాకు ఫోన్ కావాలి ” అంటే, ఆయనే వెళ్లి పోలీసుల దగ్గర నుండి వాళ్లకేం చెప్పాడో ఏమో! నా ఒక్క మొబైల్ తీసుకుని వచ్చాడు. దాని నిండా రక్తం వుంది.

ఆ తర్వాత ఆయన తన ఫోన్ నెంబర్ నా ఫోన్ లో వేసాను అన్నాడుగా కొన్ని రోజుల తరువాత దాని కోసం నా మొబైల్ లో ఎంత వెతికినా నాకు అయన నెంబర్ దొరకలేదు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles