నా మేన కోడలిని పెద్ద ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇస్మాయిల్ గారి అనుభవములు మూడవ భాగం

నాకు సాయి అన్నా, సాయి భజనలన్నా సాయి నామం అన్నా కూడా ప్రాణం.

ఒక చోట సాయి నామం ఏకాహం అంటే “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అనే నామాన్ని ఆపకుండా 24 గంటలు చెపుతారు. అందులో నాకు పాలు పంచుకునే అదృష్టం లభించింది.

రాత్రి నుంచి తెల్ల వారేవరకూ నేను కూర్చున్నాను. తెల్లవారుఝామున నామం చాలా వేగంగా జరుగుతుంది.

తాళాలు చాలా వేగంగా ఆడిస్తున్నారు. మనసంతా సాయి నిండి ఉన్నారు. తాళాలు మ్రోగిస్తూ నామం అంటూ నాకేదో అయిపొయింది. పక్కకి పడిపోయాను. స్పృహ తెలుస్తోంది.

ఒక పూజారి నాకు హారతినిస్తున్నాడు. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. ఇంతలో నా కళ్ళ ముందు నుండి ఆకాశం నుండి ఒక నక్షత్రంలాగా నా ముందుకు రావటం మొదలు పెట్టింది.

అది నా దగ్గరకి వస్తూన్న కొద్ది నాకు భయం వేస్తోంది. ఇది ఏంటని నేను అనుకుంటున్నాను. అది కొంత దగ్గరకి రాగానే నక్షత్రం ఒక అర చెయ్యి లాగా మారి నా కాళ్ళ ముందు ఒక 20 సెకండ్లు అలా దర్శనమిచ్చింది.

నా ఆనందానికి హద్దులు లేవు. ఎవరిదీ అభయ హస్తం? ఒక వేళ జాన్ పహాడ్ సైదులు దర్గా దగ్గర గుర్రం పైన ఉన్న చెయ్యా? అని అనుకున్నాను.

కానీ అప్పుడే తెలుస్తుంది ఆ అభయ హస్తం నా తండ్రి శ్రీ సాయినాథుడే అని. చాలు ఈ జన్మకి ఇంత అదృష్టం.

సాయిబాబా మన అందరిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. ఈ విషయం గ్రహించలేక పోతున్నాము. ఇంకా సాయి పైన వెయ్యి రెట్లు నమ్మకం పెరిగింది.

బాబా ఈ రోజు వరకూ ఏ ఆపద రాకుండా కాపాడుతున్నాడు. ఎన్ని జన్మలు సేవ చేసుకున్నా సాయి ఋణం తీర్చుకోలేము అనిపిస్తోంది. త్రికరణ శుద్ధిగా నమ్మిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు ఎన్నో చూపిస్తూనే ఉన్నాడు. ఇది నిజం.

ఒక రోజు సాయంత్రం ఇంటి ముందు చల్లని గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్నాము.

మా అక్కయ్య కూతురు చిన్నపిల్ల మోకాళ్ళ మీద పాకుతోంది. అందరం కబురులు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఆ పాప వాళ్ళమ్మ దగ్గరనుండి కిందకు జారీ పాకుతూ పోతుంది.

ఆ ఆవరణలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. పాప పాకుతూ కిందకు జారుతూ వెడుతోంది. చెట్టు పైనుండి మట్ట పడటానికి సిద్ధంగా ఉంది. చప్పుడు అయింది.

రెప్పపాటులో ఆ మట్ట క్రింద ఉంటుంది. మట్ట క్రింద పాప తల ఉంటుంది. ఆ ప్రమాదాన్ని అందరం గుర్తించాము కాని ఏం చేయాలో తోచే వ్యవధి లేదు.

‘బాబా’ అని అనుకున్నాను. అంతే పాప వజ్రాసనంలో వెనక్కి తిరిగి ఎవరో పలకరిస్తున్నట్టుగా కిల కిలా నవ్వుతోంది.

ఆ మట్ట పడింది., పాపకి మట్టకి అడుగు దూరం కూడా లేదు.

ఆ పాపని పిలిచి ప్రమాదం నుండి కాపాడిన వారెవ్వరూ. ఇంకెవ్వరు శ్రీ సాయియే , మేమెవ్వరం ఏమీ చేయలేమని తానూ ఆ పాపని పిలిచి వెనక్కి తిరిగే టట్టు చేసి ముందుకు పోకుండా ఆపాడు.

ఎంతైనా మన కన్నా తండ్రి కదా! మనల్ని ఆయన కాపాడకపోతే ఎలా!

నేను ఒకసారి షిరిడీ వెళ్ళాను. అప్పుడు కొన్ని రోజులుండి ‘శ్రీ సాయి సచ్చరిత్ర’ పారాయణ చేసాను.

ఒకరోజు కాకడ హారతి చూద్దాం అని బయలుదేరాను. హారతి అయిపోయింది. గురుస్థానం దగ్గర కూర్చుని దేశకాలమాన పరిస్థితుల గురించి బాబాని ప్రశ్నించడం మొదలు పెట్టాను.

ఆలా చాలా మాట్లాడుకున్నాను. ఆ తరువాత షిరిడీ నుండి ఇంటికి వచ్చాను. మరల నా మామూలు జీవితం లో బిజీగా ఉన్నాను.

ఆ తరువాత కొన్ని రోజులకి నాకు ఒంట్లో బాగోలేదు. వంతులు, విరేచనాలు అయ్యేవి. నిద్ర పట్టేది కాదు.

నా పడక చుట్టూ విభూది వేసుకున్నాను. చుట్టూ దీపాలు పెట్టుకున్నాను. ఏం చేసినా నా బాధ పోలేదు.

ఒక రోజు కోదాడ లో ఒకాయన దగ్గరకి వెళ్లాను. ఆయన ఒంటి మీదకు బాబా వస్తారని ఎవరో చెప్పారు. నేను చూద్దామని వెళ్ళాను.

బయట చాలామంది గుంపుగా కూర్చున్నారు. నేను కూడా అందులో సర్దుకుని కూర్చున్నాను.

ఆయన లోపలనుండి ఓ తురకాయన అని పిలిచాడు. నేను కాక ఇంకా ముస్లింలు ఉన్నారనుకుని చూస్తున్నాను. ఓ బాబా భక్తుడా అని పిలిచాడు.

బాబా భక్తులున్నారు అనుకుని చూసాను. చివరికాయన ఓ కుంటాయనా అన్నాడు. అప్పటికి నా కుడికాలు సరిగా లేక కుంటుతున్నాను. అందుకు ఆయన అలా అన్నాడు.

ఆయనకీ నేను కనపడటం లేదు. చూడకుండానే లోపలనుండి అరుస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళాను.

ఆ రోజు నేను షిరిడీలో గురుస్థానం దగ్గర బాబాని నేను అడిగిన ప్రశ్నలన్నీ తానూ చెపుతున్నాడు. నీకు శక్తి సరిపోవటం లేదు.

నీకు నజర్ పడుతోంది. భజనలతో తారాస్థాయికి వెళ్ళిపోకు పడిపోతావు. తట్టుకోలేవు, అని చిన్న చిట్కా చెప్పాడు.

ఒక కోడిగుడ్డు, కొబ్బరికాయ,జీడిగింజలు, నిమ్మకాయలు కొని తీసుకుపోయి ఒక పొలం గట్టున నిలబడి వెనక్కి అన్నీ వేసేసి తిరిగి చూడకుండా వచ్చేసి స్నానంచేసి పూజ చేసుకో మన్నాడు. పూజ చేస్తూ కళ్ళు కూడా మూసుకోమన్నాడు.

నేనలాగే చేసాను. అప్పుడు నాకళ్ళ ముందు ఒక తెల్ల కాగితం వచ్చింది. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. నా కళ్ళముందే ఆ కాగితం చిన్న చిన్న ముక్కలుగా అయి పడిపోతోంది.

ఏం జరుగుతోందా అని ఆ పేపర్ ఇంకా 15 % ఉండగానే కళ్ళు తెరిచాను.

ఆ కాస్త కూడా ముక్కలుగా అయివుంటే నా ఒంట్లో నెప్పులు పోట్లు తగ్గిపోయి ఉండేది.

అలా కాకుండా అప్పుడే కళ్ళు తెరిచినందుకు కొన్ని రోజులు నెప్పులు, పోట్లతో నేను బాధ పడ్డాను. కొద్ది రోజుల తర్వాత తగ్గాయి.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

ఇస్మాయిల్ గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles