Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాగమణి గారి అనుభవములు ఐదవ భాగం:
ఒకసారి మేమందరం కలసి ముక్తి నాధ్ కి బస్సులో వెళుతున్నాము. మా వారికి ఎందుకో మరి నీళ్ళ తేడానో లేక తిన్నదేదైనా పడలేదో తెలియదు కానీ, వాంతులు మొదలయ్యాయి.
బస్సులో అయితే బస్సు పాడవుతుందని దిగి వాంతి చేసుకొమ్మని బుస్సువాడు బస్సు దింపాడాయన్ని. ఆయనలా వాంతి చేసుకోవడం బస్సు ఎక్కడం జరుగుతుంది.
అలా నాలుగు సార్లు జరిగిన తరువాత మళ్ళీ వాంతి వస్తుంటే బస్సు దిగి వాంతి చేసుకుంటూ, పక్కనే ఉన్న లోయలో పడిపోయారు.
రాత్రి సమయం, చీకటి ఆ లోయ ఎంత లోతుందంటే పడితే ఒక ఎముక కూడా దొరకదు, అంతత లోతున్నాయి అవి.
ఆయన ఆలా పడిపోయినట్లు ఆయనకే తెలియదు కళ్ళు తిరిగాయట. మనిషి లోయలో పడిపోయాడంటూ బస్సు వాళ్ళు అంటున్నారు నన్ను చూసి, మా వారు కాబట్టి నేనేమైనా హడావుడి చేస్తాననేమో నువ్వు దిగొద్దు అంటున్నారు.
నేను కిందకి దిగలేదు. కదలలేదు, ఏం అనటం లేదు. ఎందుకంటే ‘మేము బాబా ఆజ్ఞ తీసుకుని బయలుదేరాము’. “బాబా! నువ్వు ఎం ఇస్తావో! నీ ఇష్టం ఆయన్ని లోయలో నుండి బయటకు తీసుకువస్తావో లేదంటే కిందకి తీసుకుపోతావో నీ ఇష్టం” అనుకుంటూ అలాగే కూర్చున్నాను.
‘బాబా’ నామస్మరణ చేస్తున్నాను. వాళ్ళకి తాడు దొరకడం లేదు. మా వారు పడింది ఆయనకీ తెలియదు.
కొంత దూరం వెళ్ళాక ఆయనకు తెలివి వచ్చింది. ఆయనకీ ఒక కొమ్మ దొరికిందట. అది పట్టుకున్నారట.
పైనుండి మా వాళ్లంతా సత్యా! నువ్వేమి కంగారు పడవద్దు. భయపడవద్దు అంటూ అరుస్తూంటే వీళ్ళంతా నన్నిలా అంటున్నారు అసలు నేను ఎక్కడ ఉన్నాను అని ధ్యాస వచ్చింది.
చూస్తే ఆయన పట్టుకుంది ఎండుది చిన్న కొమ్మ. కాలి బ్రొటన వ్రేలు ఆనించేటంత గోడ ఆధారంగా దొరికిందట.
ఆ కొమ్మ కూడా ఆయన బరువుని మోసేటంత ఏమి లేదు. ఒక తాడు లేదు, ఎవరికీ ఏమి చేయాలో తోచడం లేదు.
అంత లోపల వేరే బండి వచ్చి ఈ బండి వెనకాల ఆగింది.విషయం తెలుసుకొని బండి వాళ్ళు ఆ లోయలోకి ఫోకస్ లైట్స్ వేశారు.
వెలుతురు పూర్తిగా లోపలికి ఏమి పోవడం లేదు. చివరకి మా ఆడపడుచుకి ‘బాబా’ దయతో ఒక ఐడియా వచ్చింది.
ఆడ వాళ్ళంతా చీరలు విప్పి వాటిని ఒక దానికి ఒకటి ముడులు వేసి లోయలోకి వదులుదాము అంది. అందరం చీరలు విప్పి ఇచ్చాము.
అన్ని చీరలు ఒక దానికి ఒకటి ముడులు వేసి లోపలి వదిలారు. కొంత దూరం వదిలాక మా వారికి చీర కొంగు దొరికింది.
ఆయన దానిని పట్టుకోగానే అప్పటి దాకా ఆయన పట్టుకున్న కొమ్మ విరిగి పడిపోయింది.
ఆ చీర ఆయన అందుకున్నాక అందరం కలసి నెమ్మదిగా ఆయన్ని బయటకు లాగారు. అతి కష్టం మీద ఆయన లోయలొంచి బయటకు వచ్చారు.
మా బస్సు వాళ్లకి ఈయన దొరుకుతాడా! దొరికాడా! అని వాళ్ళు కంగారు పడిపోయారు.
పిలుస్తుంటే మా వారు సమాధానం ఇస్తున్నారు కాబట్టి, కొంత వాళ్ళు మేము కూడా కుదుట పడ్డాము. మొత్తానికి బయటకు వచ్చారు.
బయటకు వచ్చాక కూడా ఆయన మనలో లేరు. కొంచెం సేపు అయ్యాక మా వాళ్ళు భయపడవద్దు పరవాలేదు, అంటుంటే కొంచెంగా సర్దుకున్నాను.
నేను బాబా మీద పూర్తిగా భారం వేసినందుకు ఆయన్ని నాకు దక్కించారు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
నాగమణి గారి అనుభవములు ఆరవ భాగం తరువాయి….
Latest Miracles:
- అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుండి నన్ను బయటపడేసిన బాబా వారు …..!
- నా మేన కోడలిని పెద్ద ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు.
- యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments