Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆ తర్వాత నాకు ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అనిపించింది.
అదీ ట్రావెల్స్ పెట్టాలి అనుకున్నాను. ఒక కార్ కొన్నాను, అలాగే తర్వాత మూడు నాలుగు కార్లు కొన్నాను.
అవి నేను ING వైశ్యా బ్యాంకు కి అద్దెకిచ్చాను. వాళ్ళు బాగానే వాడుకునేవాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఏడాదికి ఒకసారి కేరళ ట్రిప్ కి వెళతారు.
ఆ ట్రిప్ కి నేను బస్సు ఏరెంజ్ చేస్తాను. ఆ బస్సుకు నేను వాటర్ బాటిల్స్ కూడా ఇస్తుంటాను. అలా కొన్ని నేను చేస్తుంటాను.
ఇవ్వన్నీ బ్యాంకు మేనేజ్ మెంట్ కు తెలుసు. వేరే ట్రావెల్స్ వారికీ డబ్బులు ఇచ్చి బస్సు ఎరేంజ్ చేయించేవాడిని.
ఎందుకంటే నా దగ్గర కార్లు ఉన్నాయి బస్సు లేదు కదా . ఒక సారి ట్రిప్ కి ఎరేంజ్ చేయమన్నారు, బ్యాంకు వాళ్ళు నాకు అడ్వాన్సు ఏం ఇవ్వలేదు.
మా డ్రైవర్ అమర్ నాద్ అన్న అతనికి ఈ విషయం తెలుసు, అతను నాకు చెప్పలేదు.
బ్యాంకు మేనేజర్ నాలుగు రోజుల ముందు నాకు ఫోన్ చేసి ఏమయ్యా! వెహికల్స్ అన్నీ ఎరేంజ్ చేసారా? అని అడిగింది.
ఎలా బుక్ చేస్తాను మేడం నాకు మీరు అడ్వాన్సు ఇవ్వలేదు కదా! అంటే, ఆవిడ నా మీద అంతా ఎత్తున్న ఎగిరింది.
అది ఏంటి? అలా అంటున్నావు నేను మీ డ్రైవర్ కి చెప్పాను, పైగా అక్కడ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయివుంటాయి.
మాకు బోలెడంత లాస్ వస్తుంది. పైగా మా పై వాళ్ళ తోటి మాట వస్తుంది.
నువ్వు ఎరేంజ్ చెయ్యకపోతే నీకు నేను ఇదివరకు ఇవ్వవలసిన 60 వేల రూపాయలు ఇవ్వాలిగా ఆ డబ్బులు ఇంకా నేను ఇవ్వను అంటూ బెదిరించింది. నాకు పిచ్చి ఎక్కిపోయింది.
ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు ఎల్లుండికి బస్సు అదీ వోల్వో బస్సు కావాలంటే కుదరదు అన్నారు.
ఎక్కువ డబ్బులు కావాలంటే తీసుకో బాబూ ఎలాగైనా ఎల్లుండికి బస్సు ఎరేంజ్ చెయ్యవయ్యా అంటే లేదండీ! కుదరదు అంటున్నాడు.
డ్రైవర్ నాకు చెప్పక పోవడం వల్ల ఇది అంతా జరిగింది అతన్ని బాగా తిట్టాను.
ఇంటికి వచ్చాను నాన్నా అంటూ నా కూతురు చుట్టేసింది. దాన్ని ఒక్క విసురు విసిరేసాను.
అది వెళ్లి ఎక్కడ పడిందో. మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆవిడ అందరు సైలెంట్ గా ఉన్నారు. నేనంత ఊగిపోతున్నాను.
చాలా కోపంగా, అసహనంగా, అశాంతిగా ఉన్నాను. నాకు ఏం చెయ్యాలో తోచడం లేదు.
బాబాకి దండం పెట్టుకున్నాను. ”బాబా! నువ్వు గనుక ఈ గండం నుంచి గట్టు ఎక్కిస్తే నీకు దండ వేస్తాను” అని అనుకున్నాను.
ఒక గంటలో ఫోన్ మ్రోగింది. బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసింది. ఏమంటుందో ఏమో ఏవో లాభం కోసం ఈ బిజినెస్ పెడితే ఉన్న డబ్బులు కూడా పోయేటట్టున్నాయి, అనుకుంటూ ఫోన్ ఎత్తాను.
నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ లాంటి వాడు ప్రపంచం మొత్తం లో ఉండరు. ఎందుకంటే మా చైర్మన్ గారు ఈ ట్రిప్ ను క్యాన్సిల్ చేసారు. ఎవరో పోయారట, అందుకని క్యాన్సిల్ అయ్యింది.
రేపు రా వస్తే నీకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చేస్తాను. మళ్ళీ 15 రోజుల తర్వాత బుక్ చెయ్యమని చెప్పింది. మర్నాడు వెళ్లి నాకు రావాల్సిన డబ్బులు తెచ్చుకున్నాను.
రెండు లక్షలు రూపాయలు ఇచ్చారు. వేరే ట్రావెల్స్ కి వెళ్లి మొత్తం డబ్బులు ఇచ్చి 15 రోజులు తర్వాత బుక్ చేసి వచ్చాను.
నేను బాబాకి దండం పెట్టి ఈ ముప్పు తప్పించ మన్నందుకు వీళ్ళు ఎవ్వరు కారని డైరెక్ట్ గా చైర్మన్ గారి దగ్గర నుండి క్యాన్సిల్ వచ్చేటట్టు చేసాడు బాబా.
అదీ బాబా దయ అంటే. That is Baba’s power బాబాకి దండ కొని వేసాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- సొంత ఇంటి కోర్కెను తీర్చిన బాబా వారు.
- బాబా షిర్డీ లో బ్యాంకు మేనేజర్ రూపంలో వచ్చి నను టెస్ట్ చేసి నాకు సహాయం చేసారు
- సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….
- ఆ ఆటోవాని రూపంలో వచ్చినది, నన్ను ఆశీర్వదించింది, సాక్షాత్తు బాబాయే!!
- ఎన్నో ప్రమాదాల నుండి కనిపెట్టుకు కాపాడిన బాబా ;
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుండి నన్ను బయటపడేసిన బాబా వారు …..!”
Raja
October 14, 2020 at 6:07 amనువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి.
జై సాయి రామ్