ఇసుక రేణువంత దయ…. మహనీయులు – 2020… అక్టోబరు 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాను అందగాడిగా సాయి సచ్చరిత్ర, సాయి భక్తులు తెలిపే వారు.

బస్రా వాసి హాసన్ కూడా అందగాడే. పండుగ దినాన ఏ మహిళనైనా మీ కంటికి కనబడిన అందగాడు ఎవరంటే నల్లటి టోపీని ధరించిన వ్యక్తి అనేవారు. ఆయనే హాసన్.

మహమ్మద్ ప్రవక్త కూడా అందంగానే ఉండేవాడు. హాసన్ భావం ఏమిటంటే బాహ్య సోదర్యంతో పాటు మానసిక సౌందర్యము కూడా ఉండాలనే వారు.

హాసన్ ఒక తెల్లటి అంగీని వేసవి, శీతాకాలము అనే తేడా లేకుండా, 20 సంవత్సరాలు ధరించాడు.

అయన మరణించే సమయంలో కూడా అది అత్యంత శుభ్రంగాను, మెరుస్తూ ఉంది.

ఈయన స్వచ్ఛమైన జీవితాన్ని గడిపాడు. బస్రాలోని ప్రజలందరూ శ్లాఘించారు.

ప్రజల మన్ననలను ఎంత పొందగలిగాడంటే, ఈయన మరణించిన తరువాత జరిగే అంత్య క్రియలకు బస్రా యావత్తు కదలి వచ్చింది. మసీదు ప్రార్థనలు జరిగే సమయానికి ఎవరూ లేరు!

ఆయన భగవంతునికై ప్రార్ధించేవాడు. భగవంతుని కోసం పరితపించే సమయంలో ఆయన కళ్ల నుండి కారేది కన్నీరు కాదు, వర్షమే అనవచ్చు.

ఒకనాడు అబు అమీర్ అనే వ్యక్తి హాసన్ ను సమీపించి తనకు కంఠస్తమైన పవిత్ర గ్రంథంలోని ఏ అక్షరము జ్ఞప్తికి రావటం లేదని విలపించాడు.

“సరే, నీవు ఖైఫ్ మసీదు వద్ద ఉండే ఒక ముదుసలి వద్దకు పో. ఆయన వద్ద ఎవరూ లేని సమయంలో నీ బాధను చెప్పు. ఆయన సాయం చేస్తాడు” అని హామీ ఇచ్చాడు.

అబు అమీర్ ఖైఫ్ మసీదు వద్ద గల ముసలి వ్యక్తిని చూచాడు. ఆయన చుట్టూ ఎందరో ఉన్నారు.

ఇది సమయం కాదని అబూ అమీర్ ఒక మూల కూర్చున్నాడు. ఇంతలో తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు.

ఆయనను చూడగానే అందరూ వందనాలు చేసి, దారి ఇచ్చారు. తెల్లటి వస్త్రధారి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు.

ప్రార్థన సమయం అవుతోంది. అందరూ ఆ ముసలి వ్యక్తి నుండి సెలవు తీసుకుని వెళ్లిపోయారు.

ఎవరూ లేకుండా ఉండటం చూసి తన గోడును వెళ్లబోసుకున్నారు అబూ అమీర్. ముసలి వ్యక్తి  అల్లాను ప్రార్ధించాడు. తిరిగి జ్ఞాపక శక్తిని పొందిన అమీర్ ముసలి వ్యక్తి పాదాలపై పడ్డాడు.

“సరే, నిన్ను నా వద్దకు ఎవరు పంపారు?” అడిగాడు ఆ ముసలి వ్యక్తి. “బస్రాకు చెందిన హాసన్” అన్నాడు అమీర్.

” హాసనే ఈ పని చేసి ఉండవచ్చు గదా” అని అన్నారు ఆ ముసలి వ్యక్తి ఇంకా “ఇప్పుడు తెల్లటి బట్టలతో వచ్చాడే ఆయనే హాసన్” అన్నాడు.

తాము సిద్దులైనా, ఇతరులను గౌరవిస్తారు. హాసన్ లాంటి మహాత్ములు. ఆయన అక్టోబర్ 728లో దేహాన్ని విడిచాడు.

“ఇసుక రేణువంత దయా దాక్షిణ్యాలు కొన్ని వేల ఉపవాసాలు, ప్రార్ద్ర నల  కన్నా మిన్న”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles