రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పీరోజి మహర్షి పూర్వీకులు మహారాష్ట్ర నుండి వచ్చి సత్తెనపల్లిలో స్థిరపడ్డారు. ఈయన మాణిక్య ప్రభువు సమకాలికుడు.

ఒకసారి లాల్ సాహెబ్ మాణిక్య ప్రభువును మోక్షమార్గం చూపమని ప్రార్ధించాడు. అయన తారక మంత్రం ఉపదేశించి, సత్తెనపల్లిలో ఉన్న పులహరి పీరోజీ వద్ద పరిపూర్ణాచల బ్రమ్మోపదేశం పొందమని ఆదేశించారు.

ఒక్కొక్కసారి మహర్షి తన భోజన సమయంలో మరొక విస్తరి వేసి వడ్డింపుడని ఆదేశించేవారు. ఎందుకు అని అడిగితే గుంటూరు కాలేషా మస్తాన్ వస్తారనే వారు. వడ్డించిన విస్తరి ఖాళీ అయ్యేది.

ఒకసారి అయన (మహర్షి) శిష్యగణంతో భద్రాచల యాత్ర చేస్తున్నారు. ఒక చోట బండ్లను ఆపి వంట ప్రారంభించారు. వంటకు బియ్యపు మూట ఎక్కడో జారిపోయింది బండి నుండి అని తెలుసుకున్నారు.

అందరుకూ ఆకలి వేయుచున్నది. మహర్షి ఒక చెట్టు క్రింద నిలబడి “ఎంత నిర్దయ మనసుడవు రామా నేనెంత వేడిన కనులబడవు…” అంటూ ప్రార్దింపసాగారు.

ఈలోగా ఒక వ్యక్తి బియ్యపు మూటతో వచ్చి, ఇది మీదా? దారిలో పడిపోయినదా అని బండితోలువాని  నడిగి, దానిని ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఈ సంగతి బండివాడు మహర్షికి చెప్పినాడు.

మహర్షి రామ కృపకు సంతసించాడు, పరవశించాడు, భక్తులంతా మహర్షి రామ భక్తిని శ్లాఘించారు.

ఇంకా మహర్షి బండివానితో “నీవు అదృష్టవంతుడివి. ఆ మూట తెచ్చి ఇచ్చినది రాముడే” అని చెప్పారు.

ఒకసారి మహర్షి చిలకలూరిపేటలో ఉన్నారు. ఆ సమయంలో తన భార్యకు, పసి బిడ్డడికి అనారోగ్యంగా ఉందని, తక్షణం రమ్మని కబురు అందింది.

అయన అడ్డదారి దగ్గరి దారికదా అని అడవి మార్గంలో పయనిస్తున్నారు. దారిలో నలుగురు దొంగలు అటకాయించారు.

అయన బెదిరిపోలేదు, పారిపోవుటకు ప్రయత్నించలేదు. ఆ వచ్చినవారు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులని భావించి “ఎంతో బ్రహ్మానందమాయెను. మన చింతలన్నీ విడిపోయెను” అని కీర్తనను పాడారు.

ఈయనయే మహర్షి పీరోజి అని దొంగలు గ్రహించి, అయన పాదములపై పడి క్షమాభిక్షను వేడి సన్మార్గులైనారు.

సత్తెనపల్లి లోనికి వస్తున్న మహర్షికి ఆ ఊరిలో కలరా విపరీతంగా ఉందని తెలిసింది.

ఇక ఇంటికి పోకుండా బావి వద్ద స్నానం చేసి, తడి బట్టలతో మహాలక్షమ్మ వేపచెట్టు అరుగువద్ద కూర్చుండి, అమ్మవారిపై ఆశువుగా కీర్తనలు పాడారాయన, మంగళహారతులు ఇచ్చి సాయంకాలం ఇంటికి చేరారు.

ఆయన భార్యకు, శిశువుకు, ఇంకా ఊరివారికి కలరా గండం తప్పింది. ఊరి వారంతా ఆయనను పొగిడారు. ఇది దైవ కృపయే అంటారాయన.

ఆయన 9 . 7 . 1869 హర హర హర అని మూడుసార్లు ఉచ్చరించి, శ్రీరామార్పణం అంటూ బ్రహ్మరంద్రం గుండా ప్రాణాలు విడిచారు.

నేడు 9 జూలై, మహర్షి పీరోజి వర్థంతి దినం. ఆయనను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles