చూపు కరువైన వారికైనా …. మహనీయులు – 2020… డిసెంబరు 9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


వినోబాభావే సూరదాసును సంగీత మహా సాగరం అంటారు.

రామ సామ్రాజ్యాన్ని తులసీదాసు ఏలినట్లు, కృష్ణ – బాలకృష్ణ మథుర ప్రేమను సూరదాసు నేటికి ఏలుతున్నాడు.

కొందరు ఆయనను పుట్టు గుడ్డి అంటారు, మరి కొందరు కాదంటారు. అయన ఆగ్రా, మథురల మధ్య నున్న (గౌఘాట్), గడ్ ఘట్ (Gad Ghat) లో నివసించారు కొంత కాలం.

ఒకసారి సూరదాసు బావిలో పడ్డాడు. ఆరు రోజులు బావిలోనే ఉన్నాడు. ఏడవ రోజున కృష్ణుడు ఆయన ముందు ప్రత్యక్షమైనాడు.

తన ఇష్టదైవాన్ని తనివితీరా చూచాడు. దైవమును వీక్షించిన చక్షువులతో ప్రపంచాన్ని చూచే కోరిక తనకు లేదని ఆయన కృష్ణునకు విన్నవించుకున్నాడు.

గౌఘాట్ యమునా తీరాన ఉంది. అక్కడకు వల్లభాచార్యులు వచ్చారు, ఒకసారి.

సూరదాసు పాడుతుండగా వినటం జరిగింది. ఆ కంఠ మాధుర్యానికి పరవశులైన వల్లభాచార్యులు సూరదాసుకు ఒక సూచన చేశాడు – “నాయనా! భగవంతుని లీలలను గానం చేయి. శుభం కలుగుతుంది” అన్నారు వల్లభులు.

తన లోపాన్ని విన్నవించుకున్నాడు సూరదాసు. శ్రీవల్లభులు ఆయనను స్పర్శించి, మథుర భక్తిపారవశ్యంతో శ్రీకృష్ణుని రాసలీలల మార్మిక దృశ్యాలను మనో నేత్రంతో దర్శించగలిగాడు.

ఆయన గళం నుండి ఆశువుగా మథుర భక్తి గీతాలు రాగలహరిలా వెలువడసాగాయి.

శ్రీకృష్ణుని పదపల్లవ చుంబనంతో పునీతమైన ఆ బృందావనం, ఆ వ్రజ భూమి సూరదాసును అక్కడ నుండి కదలనీయ లేదు.

ఆ పవిత్ర భూమిలో అంతటా బాలకృష్ణుని అందెల సవ్వడులే వినపింపసాగాయి.

సూరదాసు గీతాలతో లక్షల మంది నేటికి పులకించిపోతున్నారు, భక్తిపారవశ్యంలో మునిగి పోతున్నారు.

ఒకసారి నవనీత ప్రియుడైన శ్రీకృష్ణుని దర్శించాలని కోరిక కలిగి, మందిరానికి వెళ్లాడు.

గోసాయి విఠలనాథునకు సంత్ సూరదాసును పరీక్షించాలని అనిపించింది.

శ్రీకృష్ణునికున్న వస్తాలను తీసివేసి వాటికి బదులుగా ముత్యాల దండలను ధరింపచేశారు.

ఇక శ్రీకృష్ణుని వర్ణించాలి ఆ అంధుడైన సూరదాసు. “ఆ సుందరమూర్తిని చూడండి, దిగంబరియైన ఆ ప్రభువును ముత్యాల మాలలు కప్పివేస్తున్నాయి. ఆయన అందం కోటి మన్మధులను సైతం, తలలు వ్రాల్చేటట్లు చేస్తోంది…” అంటూ ఆ నగ్న కృష్ణుని అంధ సూరదాసు వర్ణించాడు.

సూరదాసుకు లేనివి భౌతిక నేత్రాలు మాత్రమే. దివ్య దృష్టి ఉంది.

దివ్య దృష్టిచే తాను పరవశించి, నేటికి ఎందరినో పరవశులను చేసే సూరదాసు డిసెంబర్ 9. 1484న జన్మించారు.

నేడు డిసెంబర్ 9. సూరదాసు జయంతి.

ఆ బాలకృష్ణ దర్శనం మనకు కలుగు గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles