Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి చరిత్రలో ప్రతి సంఘటన ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది.
ఒకసారి వర్షం వచ్చినప్పుడు బాబా కూర్చునేందుకు కూడా మసీదులో చోటు లేకపోయింది. దానితో భక్తులు బలవంతం మీద బాబా చావడిలో నిద్రించేందుకు అంగీకరించారు.
నారాయణ్ తేలి అను భక్తుడు సాయిని చావడికి మోసుకు వెళ్ళాడు. నాటి నుండి సాయి రోజు విడచి రోజు చావడిలో నిద్రించే వాడు.
1909 డిసెంబరు 10 నుండి చావడికి సాయి వెళ్ళటం ఒక వేడుకగా జరపటం ప్రారంభమైంది. తరువాత అది పల్లకీ ఉత్సవమైంది.
హర్దా నుండి దుంఢీరాజ్ సాయికి పల్లకి పంపాడు. సాయి వద్ద శ్యామకర్ని అనబడే గుర్రపుపిల్ల వచ్చింది.
ఆ నాడు సాయినాధుడు ద్వారకామాయి నుండి రోజు విడచి రోజు చావడిలో నిద్రించుటకు పోయే సన్నివేశమే అపురూపమైన చావడి ఉత్సవము.
ఆ ఉత్సవంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి – అందులో కొన్ని:
నారాయణుడు కాలి నడకన తన భక్తులతో కొన్ని గంటలపాటు సంచరించే అవకాశం ఈ చావడి ఉత్సవంలో కలుగచేశాడు.
ఆనాడు గోపాల కృష్ణుడు గోప బాలురతో వ్రేపల్లెలో తిరుగాడాడు. ఈనాడు షిరిడీలో సాయి అదే చేశాడు.
ఇంకా చెతన్య మహాప్రభు తన శిష్యగణంతో హరి నామ సంకీర్తనతో వీధుల వెంబడి తిరగటం కనిపిస్తుంది.
అయితే షిరిడీలో జరిగే చావడి ఉత్సవంలో నారాయణ రూపధారి సాయి భక్తులతో తిరిగినా, ఉన్మత్తుని వలె నామ సంకీర్తన చేయడు. భక్తులే ఉన్మత్తులవుతారు.
జగన్నాధ రథ యాత్రలో పురీ జగన్నాథుడు (బలరామ, సుభద్ర)లతో సహా శ్రీ ఫీఠం నుండి కదలిరారటమే.
షిరిడీలో కూడా సాయినాథుడు ద్వారకామాయి నుండి బయటకు వచ్చి చావడి చేరటమే.
రథ యాత్ర అన్నా, పల్లకీ ఉత్సవం అన్నా స్థూలంగా మూలా స్తానం నుండి కదలటమే.
జగన్నాథ రథ యాత్ర ఏడాదికి ఒక్కసారి జరుగుతుంది. నాడు చావడి ఉత్సవం రోజు విడిచి రోజు జరిగేది. నేడు ప్రతి గురువారం జరుగుతొంది.
పల్లకి ఉత్సవంలో తీపి గురుతులు – పల్లకి, శ్యామకర్ణి, పాదుకలు, చిలుం, సటకా, బాబా ఫోటో.
ఆ ఉత్సవములో అనుభూతులు, అనుభవాలు ఎన్నో శ్రీ పెమ్మరాజు పూర్ణచంద్రరావు గారికి ఆ దృశ్యమే ఆనందదాయకము.
“ఆ పరమాత్మ సాక్షాత్తు సద్గురువై, జీవితాంతం ఆలంబనగా తోడు నడచిన అపురూప భావనకి ఈ పల్లకీ యాత్ర ప్రతీక, ఛత్రచామరాల దివ్య ప్రభలతో, మేళ తాళాల మేళవింపుతో, జగజ్జెయమానంగా జైత్రయాత్ర నడచినప్పుడు మానవ జీవితం మనోజ్ఞమైన చిత్రమే”.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
- అంతే ప్రాప్తి ….. సాయి@366 మార్చి 10….Audio
- షిరిడీ లో పాండురంగడు! …..సాయి@366 ఏప్రిల్ 26….Audio
- కదిలింది పల్లకి ….. సాయి@366 మార్చి 2…Audio
- సాయి ఆయుధం …..సాయి@366 డిసెంబర్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments