Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
”ఇది మేఘుడి చివరి ఆరతి” అన్నారు సాయి. ఆ విషయాన్ని చాలామంది గ్రహించలేక పోయారు.
సాయి భక్తుడు నార్కే, కాకా సాహెబ్ దీక్షిత్‌కు మార్చి 2, 1918 రాత్రి జరిగిన చావడి ఉత్సవం గురించి, ఆ నాటి కొన్ని సంఘటనలను గురించి వ్రాశాడు.
ఆ దినం ఫాల్గుణ షష్టి. ఆనాడే ‘పైఠాన్ బ్రాహ్మణుడు’ అని సాయిబాబా పిలిచే ఏకనాథ్ మహారాజ్ పుణ్యదినం.
ఏకనాధుల వారి మహాసమాధి ఉత్సవాలు మూడు దినాలపాటు ఎంతో వైభవంగా జరుగుతాయి.
ఆనాడు ఆజీబాయిని పురాణం చెప్పమని సాయి పంపారు. ఆమె తన మధురమైన కంఠస్వరంతో ఏకనాధుల వారి జీవితాన్ని గూర్చి గానం చేసింది.
ఇక సాయంకాలమైంది. ఆ నాడు సాయిబాబా చావడిలో పడుకునే దినం కనుక పల్లకి ఉత్సవం జరుగుతుంది.
సాయి ఆ సాయంత్రం తన ఉగ్రరూపాన్ని చూపారు. అడ్డు వచ్చిన తాత్యాపై కోపగించు కున్నారు.
అతనిని కొట్టటానికి రెండు రాళ్లు తీసాడు సాయి. తాత్యాకు కూడా కోపం వచ్చింది. చావడి ఉత్సవం జరగటం లేదు.
సాయి చాలాసేపటికి శాంతించారు. ఈలోగా భజనతో ఆ ప్రదేశమంతా మారుమోగింది.
అయినా సాయిబాబా ”నేను రాను” అంటు మొండికేసారు. కాసేపయినాక మహల్సాపతితో సాయి ”మనం తకియాకి వెళదాం” అన్నారు.
తాత్యా భక్తులందరినీ పిలచాడు రారండని. ద్వారకామాయిలో గంట కొట్టారు అందరిని ఆహ్వానిస్తూ. అప్పటికి రాత్రి 12 గంటలైంది. ఇక అందరూ వచ్చారు.
యథాప్రకారం చావడి ఉత్సవంలో పల్లకి చావడి చేరింది. ఏకనాధుని మహాసమాధి (రాత్రి) 12 గంటల తర్వాత పల్లకి గోదావరిన బయలు దేరుతుంది. తెల్లవారిని తరువాత తిరిగి ఏకనాధుని మందిరం చేరుతుంది.
ఇప్పుడు కూడా పల్లకి 12 గం||ల తర్వాత చావడి చేరింది. ఉదయాన ద్వారకామాయి చేరింది.
ఈ సామ్యాన్ని (పోలికను) కొందరు గుర్తించారు. సాయి తన పల్లకిని, అక్కడ ఏకనాధుని పల్లకి కదిలేవరకు లేవనీయ లేదని కొందరు గ్రహించారు.
మరుసటి రోజు సాయి ”నిన్నెందుకు ఉత్సవం ఆలస్యం అయింది!” అన్నాడు. అప్పుడు గ్రహించారు చాలమంది అసలు విషయాన్ని. అంతవరకే తెలుసు!
అదే సాయినాధుడు ఫాల్గుణ బహుళ షష్టినాడు ఏకనాధునికి ఇచ్చే చివరి నివాళి అని ఎవరికీ తెలియదు అప్పుడు!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- పల్లకీ సేవ
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
- మహిమలు కోరని మమతలు….. సాయి@366 మార్చి 12….Audio
- షిరిడీ మసీదులో శ్రీరామనవమి…..సాయి@366 మార్చి 27…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments