Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
మానవులంతా ఒకటే, అంతే కాదు సత్పురుషులంతా ఒకటే. సత్పురుషులు సజీవంగా ఉన్నా, మహాసమాధి చెందినా వారంతా ఒకటి గానే భాసిస్తారు.
చూడటానికి ఒకటి గానే అనిపిస్తారు కాని గ్రహించ గల్గిన వారికి ఒకటి గానే అనుభవాలనిస్తారు.
మూలే శాస్త్రి ఒకసారి షిరిడీకి వచ్చాడు – సాయిని దర్శించు కోవటం కోసం కాదు, కోటీశ్వరుడైన బుట్టీ ఆ సమయంలో షిరిడీలో ఉన్నాడు కాబట్టి ఆయనను కలుసుకోవాలని వచ్చాడు.
మూలే శాస్త్రి గురువు రామచంద్ర డూంఢీరాజ్ ఘోలప్.
ఘోలప్ స్వామి భౌతిక కాయాన్ని విడచి కొన్ని ఏండ్లయినది. షిరిడీకి వచ్చిన మూలే శాస్త్రి సాయిని దర్శించానికి వెళ్ళాడు.
సాయి స్థానంలో తన గురువైన ఘోలప్ స్వామి కనిపించాడు. అప్పుడు మూలే శాస్త్రికి కనువిప్పు కలిగింది. తన గురువు ఘోలప్, సాయిబాబా ఒకటేనని.
ఇది సాయిబాబా సజీవంగా ఉన్నప్పుడు ద్వారకామాయిలో జరిగిన సంఘటన.
సాయి మహాసమాధి చెందాడు 15 అక్టోబరు, 1918న. లోకంలో సాయితో బాటు ఇతర సద్గురువులు కూడ ఉన్నారు.
వారిలో ఒకరు తిరువణ్ణామలై లోని రమణ మహర్షులు. ఆయన భక్తురాలు శ్రీమతి సుశీలా దేవి.ఆమె తన కుటుంబంతో స్విట్జర్లాండులో ఉంటోంది.
రమణ మహర్షి ఏప్రిల్ 24, 1950న మహాసమాధి చెందారు.
ఆ సమయంలో ఆమె రమణుల భౌతిక కాయాన్ని చూడలేక పోయానని విచారించింది.
కాని రమణులు ఆమెను వ్యాకుల పడనిచ్చునా? సుశీలా దేవి కుటుంబం రమణులు మహాసమాధి చెందిన తరువాత 15 రోజులకు మద్రాసు చేరారు.
మద్రాసులో వారికి శ్రీ సాయిబాబా మందిరం వారు కలసి, తాము తలపెట్టనున్న మందిర నిర్మాణానికి ఆర్థిక సాయం అడిగారు.
ఆమె తన సద్గురువు రమణులని చెప్పింది. ఆ మందిరం వారు సాయిబాబాకు రమణులకు కించెత్తు కూడా తేడా లేదని తెలిపారు.
ఆమె వెంటనే నిర్ధారణ కొరకు షిరిడీకి వెళ్ళింది. సాయి కూడ సమాధి చెందారు.
ఆమె గురుస్థానంలోని నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న సాయిబాబా పటం చూసింది. ఆ పటంలో ఆమెకు కనిపించింది సాయి కాదు, రమణ మహర్షి. సత్యమే.
ఆమెకే కాదు, శ్రీమతి డోంగ్రే అనే మహిళ అటువంటి అనుభవాన్ని పొందిన మరో భక్తురాలు.
సాయి-రమణులు ఒకటే అని ఆమెకు గురుస్థానంలో అనుభవం కల్గిన దినం మార్చి 3, 1953. ఇది సాయినాధుని రమణీయత.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సర్వ దేవతా నిలయం ….. సాయి@366 మార్చి 9….Audio
- సాయిబాబా ఈద్ ముబారక్…..సాయి@366 నవంబర్ 3…Audio
- (అ)ద్వితీయ సాయీ పత్రిక …..సాయి@366 మార్చి 18….Audio
- ఆనాడు ఈనాడూ అదే సాయి ….. సాయి@366 మార్చి 14….Audio
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments