Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అది మార్చి 1923, 18వ తారీకు, ఆదివారం, చైత్ర మాసం శుక్ల పక్ష పాడ్యమి – అంటే ఆ దినం ఉగాది. ఆ శుభ దినాన శ్రీ సాయి లీల మ్యాగజైన్ ప్రారంభమైంది. ఇది సాయి పరంగా రెండవ మ్యాగజైన్.
మొదటి మ్యాగజైన్‌ను పూనా నుండి విడుదల చేశారు సాయి భక్తుడైన హరి వినాయక్ సాఠే తదితరులు. అయితే మొదటి మ్యాగజైన్‌ను కొద్ది కాలంలోనే మూసి వేశారు.ఈ శ్రీ సాయి లీల 2018 నాటికి 95 వసంతాలు పూర్తి చేసుకుంది.
శ్రీ సాయి లీలా మ్యాగజైన్‌కు మొదటి సంపాదకుడు శ్రీ గణేశ్ లక్ష్మణ్ మహాజని. ఆయనను అందరూ ‘కాకా మహాజని’ అని పిలుస్తారు.
పత్రిక మరాఠీ భాషలో ఉండటం వల్ల, సంపాదకీయం మరాఠీలోనే ఉండేది.
మొదటి పత్రిక మాదిరి లేదా నమూనాగా విడుదల చేశారు. సాయి భక్తులకు ఉచితంగా ఒక కాపీ పంపి వారిని చందాదారులుగా చేరి పత్రికను ప్రోత్సహించండి అని మనవి చేశారు సంపాదకులు.
పత్రిక స్థాపనకు ముఖ్యమైన రెండు ఉద్దేశాలు ఇలా ఉన్నవి:
సాయి లీలలను అన్నింటిని పోగుచేసి, ప్రచురించటం కష్టం. కనుక వీలయినన్ని సాయి లీలలను పోగుచేసి, ప్రచురించటం – ఇంకా భక్తుల అనుభవాలను భక్తుల శీర్షిక కిందను, శ్రీ సాయి సచ్చరితను ధారావాహికంగా ప్రచురించటం –
అలా మొదలైన ఈ పత్రిక ఇంతింతై వటుడింతైనట్లు, అనేక వేల కాపీలతో, అనేక భాషలలో, దేశ, విదేశీ సాయి భక్తుల, ఇతరుల ఆదరాభిమానాలు పొందింది.
ఆనాడు హేమాడ్‌పంత్ ప్రారంభించిన సాయి సచ్చరిత్ర తరువాత ఆంగ్లంలో కూడ అనువాదమై ప్రచురితమైంది.
సాయిలీల సాయీసరస్వతి నుదిటి తిలకం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సాయీ రమణీయం….. సాయి@366 మార్చి 3….Audio
- సాయీ భాగవతము…..సాయి@366 జూన్ 28….Audio
- ఇంటింటికి సాయి పత్రిక…..సాయి@366 జూన్ 1….Audio
- శ్రీ దస్తూర్జీని బాబా అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదం నుండి రక్షించారు
- ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments