Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అది ఏప్రిల్ 1, 1918, సోమవారం, రంగ పంచమి పండుగ దినం, అటు షిరిడీలోను, ఇటు విల్లీపార్లేలోను పూజలు, అదే విశేషం.
ఎందుకంటే సాయిబాబా తన తత్వాన్ని గ్రహించిన భక్తులను ఎంతగానో ప్రోత్సహిస్తాడు. నీవు నడిచే మార్గమే సరైనది అని తెలియ చేస్తాడు.
ఆ భక్తునకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సాయి తెలిపిన ఆమోదం, అందరకూ అనుసరణీయమే.
శ్రీ నారాయణ మహాదేవ్ తోసర్ విల్లీపార్లే నివాసి. బాల్యము నుండి ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన వ్యక్తి.
1910లో దాసగణు హరికథలను విన్న తోసర్‌కు సాయి గొప్పదనం తెలిసింది.
”సాయి జీవించే ఉన్నారా?” అని ప్రశ్నించాడు తోసర్. ”అవును” అన్నాడు దాసగణు.
5 రోజుల తర్వాత షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించాడు. 1895లోనే ఆయన మొదిసారిగా తన గురువును స్వప్నంలో దర్శించాడు.
తనను గురు మార్గంలో ప్రభావితం చేసింది సాయిబాబాయేనని తెలుసు కున్నాడు.
అటు తరువాత 6 నెలల్లో తొమ్మిది సార్లు షిరిడీకి వెళ్ళాడయన. ఆయనే స్వయంగా సాయిబాబా తనకు ఎంతగా ఆధ్యాత్మిక పురోగతిని కల్పించాడో మాటలలో తెలుప లేనన్నాడు.
సమస్త జీవులలోని తేడాలన్నీ మిధ్యయే అని, వాటిలో అంతర్లీనంగా ఉండే సత్యాన్ని గ్రహిస్తే, అంతా ఒకటిగానే ఉంటుందని సాయి ఆయనకు బోధించలేదు కాని తెలియ చేశారు. అంతా ఏకమే అని సాయి ద్వారా గ్రహించాడు.
ఆయన మొదటి నుండి హనుమంతుని భక్తుడు. 1918న విల్లీపార్లేలో ఎంతో ఖర్చు పెట్టి పెద్ద మందిరం కట్టించి అందులో హనుమంతుని ప్రతిష్టించాడు.
హనుమాన్ విగ్రహానికి పైన ‘శ్రీ’ అని, ఎడమ వైపు ‘శ్రీ సాయి’ అని, కుడి వైపు ‘హనుమాన్’ అని చెక్కించాడు.
అక్కడ విల్లీపార్లేలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుండగా, అదే సమయంలో షిరిడీలో సాయి తన స్వహస్తాలతో మిఠాయిలు, బర్పీలు పంచిపెట్టారు.
అంతే కాక ద్వారకామాయి మసీదులో సత్యనారాయణ పూజ కూడా వజే అను బ్రాహ్మణునిచే చేయించారు. 25 రూపాయలు వజేకు ఇవ్వమని అదేశించారు సాయి.
ఆ మందిరమే ”శ్రీ సాయి హనుమాన్” మందిరమైంది. హనుమలో సాయిని దర్శించటం ఏకత్వానికి గుర్తు. అటులనే మనమూ గుర్తింతుము గాక!
ఓం శ్రీ సాయి హనుమాన్!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి…..సాయి@366 జూన్ 10…Audio
- ధ్యానంలో దర్శనం …..సాయి@366 మే 21….Audio
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
- నీకు ఇలాంటి బిడ్డనే కలుగుతుందిలే, వేచివుండు కొంచెం, అని చెప్పి వెళ్ళిపోయింది….Audio
- బాబా మళ్లీ మళ్ళీ హనుమాన్ చాలీసా పఠించమన్నారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio”
Madhavi
April 1, 2021 at 9:02 amU r voice is so nice..Baba’s Leela’s r alwayes plesent and happy to listen.