Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
భక్తుడు జాగ్రదావస్థలో ఉన్నా, నిద్రావస్తలో ఉన్నా సాయినాథునకు పట్టదు. తన బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటాడు.
ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ ప్రాతః కాలంలో తన నియమానుసారం స్నానం అయ్యాక ధ్యానమగ్నుడై ఉండగా విఠలుని దర్శనమైంది.
తరువాత సాయిని కలువగా ”విఠలుపాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు, వానిని దృఢముగా పట్టుకొనుము. ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోవును” అన్నారు.
వెంటనే కాకాకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఫోటోలను అమ్మేవాడు 25, 30 విఠల్ ఫోటోలు అమ్మకానికి తెచ్చాడు అందులో ఒకటి తన ధ్యానములో చూచిన విఠలునిగా ఉన్నది.
సాయి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే విఠలుని పటం ఒకటి కొని తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఇది సాయి ధ్యాన స్థితిని ఎలా సద్వినియోగ పరుస్తాడో ఈ సంఘటన తెలుపుతుంది.
ఇక సాయి మహా సమాధి అనంతరం కూడా భక్తుని ధ్యానంలో అనేక సందేశాలు, సూచనలు ఇవ్వటం జరుగుతున్న చరిత్ర. ఈ సందేశాలు, సూచనలు ధ్యానమగ్నుడైన ఆ భక్తునికే అని అనుకోరాదు.
పాండ్యా సాయి మహా సమాధి తరువాత భక్తుడైనాడు. భక్తుడు ఎప్పుడు అయ్యాడన్నది ప్రాధాన్యం కాదు సాయికి. భక్తునిలో నీతి నిజాయితీలు ఉన్నవా లేదా అనే చూస్తాడు.
పాండ్యా ఒకసారి షిరిడీ వచ్చాడు. మధ్యాహ్న ఆరతి జరుగుతోంది అది 21 మే, 1952. ఆ ఆరతి సమయంలో పాండ్యా కనులు మూసుకున్నాడు. తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళాడు.
ఆ ధ్యానంలో సాయి తన కుడి చేతిని కొంచెం పైకి ఎత్తాడు. అప్పుడు పాండ్యాకు ఒక కాంతి వలయం కనిపించింది.
ఆ కాంతి వలయంలో శ్రీరామ, హనుమాన్, కృష్ణ, దత్త మూర్తులు దర్శన మిచ్చారు. తనివితీరా పాండ్యా దర్శించుకున్నాడు. ఇక కనులు తెరచాడు. దృశ్యం మాయమైంది.
పాండ్యాకు ఏమీ అర్థం కాలేదు. డొంగ్రే అనే భక్తునికి తనకు కలిగిన అనుభవాన్ని చెప్పాడు.డొంగ్రే సాయి బాబాయే శ్రీరామునిగా, హనుమాన్‌గా, కృష్ణునిగా, దత్తమూర్తిగా దర్శనమిచ్చారని తెలిపాడు. పాండ్యా సంతోషించాడు సాయి కరుణకు.
మనకు కూడా సాయి శ్రీరామునిగా, హనుమాన్‌గా, కృష్ణునిగా, దత్తునిగా ధ్యానంలో కాకున్నను ఎప్పుడైనా దర్శన మిచ్చుగాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిరీక్షణ…..సాయి@366 అక్టోబర్ 21….Audio
- అది నేనే…! …..సాయి@366 డిసెంబర్ 3….Audio
- ధ్యానంలో సాయి చేసిన వైద్యం ………….!
- How I found God …..సాయి@366 అక్టోబర్ 4…Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments