ధ్యానంలో సాయి చేసిన వైద్యం ………….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ గణేశాయ నమః, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.

నా ఇష్ట దైవం సాయి బాబా. శ్రీ సాయిని ప్రార్ధించుట వలన, సాయి అనుజ్ఞ ఇచ్చుట వలన నా అనుభవాలు తెలుపుతున్నాను.

నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి శ్రీ సాయి. శ్రీ సాయి ని నమ్మిన వారు, ఎన్ని కష్టాలు, ఎన్ని వడిదుడుకులు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనగలగతారు.

సకల దేవతా స్వరూపుడు, అన్ని జీవజంతువులలో, ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ బాబా ఉంటాడు.

నన్ను బాబా ఎలా తన అక్కున జేర్చుకున్నాడు అంటే, మా వారు ఉద్యోగ రీత్యా వేరే ఊర్లో ఉంటారు, నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, హైదరాబాద్ వనస్థలిపురం విజయపురికాలనీలో మా నివాసం.

నేను మొదట్లో అంటే బాబా నా జీవితంలోకి రాకముందు ఎదో ఒక గుడికి అంటే సోమవారం ”శివాలయం”, మంగళవారం ”ఆంజనేయస్వామి”, అమ్మవారు, అలా గురువారం సాయిబాబా గుడి, వైదేహీనగర్లో గుడిసెలో బాబా విగ్రహం చిన్నగా ఉండి పూజించేవారు.

ఆ విగ్రహం ప్రతిష్ట చేసిన నాటినుండి ఇంటికి దగ్గరే కాబట్టి గురువారం తప్పకుండా ఆ గుడికి వెళ్లేదాన్ని.

అలా గుడికి వెళ్ళినప్పుడు, ఒకళ్ళ ఇంట్లో ధ్యానం చేస్తున్నాము రమ్మన్నారు. నాకు అప్పటివరకు ధ్యానం అంటే ఏమిటో, ఏం చేస్తారో తెలియదు. మొహమాటం కొద్దీ వాళ్ళింటికి వెళ్ళాను.

నాకు ఏం చెయ్యాలో తెలియదన్నాను. వాళ్ళు చెప్పారు. అలా వాళ్ళింట్లో ధ్యానానికి వెడుతూవుండేదాన్ని. వీలు కుదిరినప్పుడల్లా ఇంట్లో కూడా ధ్యానం చేస్తుండేదాన్ని, బాగానే కుదురుతుండేది.

అలా ఒకరోజు నేను ధ్యానం లో ఎక్కడికో వెడుతున్నాను. చీకటి అయిపోయింది. అలా వెడుతుంటే రెండు దారులు వచ్చాయి.

అప్పుడు నేను ఏ దారిన వెళ్ళాలి? ఎటు వెడితే మా ఇల్లు వస్తుంది. చీకటి అయిపోయింది. తొందరగా వెళ్లకపోతే మా వారు కోప్పడతారు. ఏం చెయ్యాలో పాలుపోక మధ్యలో నిలబడి అటు ఇటు చూస్తున్నాను

ఇంతలో ఒక ముసలాయన, ఎక్కడినుండి వచ్చాడో అక్కడికి వచ్చాడు. ”నువ్వు ఏ దారిన పోతావు అమ్మాయి?” అని అడిగాడు.

నేను ”నాకేమి అర్ధం కావడం లేదు బాబా నేనెటు పోను?” అన్నాను. అతను నాకు ఒక దారి చూపించి, ”అటు పో! త్వరగా ఇల్లు చేరతావు” అన్నాడు.

”సరే కానీ నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకున్నావు?” అన్నాను నేను. ”నేనెవరో తెలియకుండానే నన్ను బాబా అని సంభోదించావా?” అన్నాడు.

నేను ఆ ముసలాయన చూపించిన దారిలోనే పోతున్నాను. అంతా చీకటిగా ఉంది  కొంత దూరం వెళ్ళాక వెలుతురూ, దానితో పాటు అక్కడంతా పూల మొక్కలు కనపడ్డాయి.

అక్కడ ఇందాక కనపడ్డ ముసలాయన ఒక చెట్టు కింద కూర్చొని కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్లి, ”నువ్వు ఇక్కడ ఉన్నవేంటి? ఇంతకీ నువ్వు ఎవరు?” అని అడిగాను.

దానికాయన, ”నేను మీ నాన్నని” అన్నాడు. ”ఛా! నువ్వు మా నాన్నవేంటి? మా నాన్న ఎప్పుడో నా చిన్నప్పుడే చనిపోయాడు. నిజం చెప్పు?  ఎవరు నువ్వు?” అని అడిగాను .

”నేను నిజంగా మీ నాన్ననే అమ్మా! నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను” అన్నాడు.

”నువ్వు మా నాన్నవే అంటే నేనెలా నమ్మను?” అన్నాను. ”అయితే చూడు” అంటూ తను వేసుకున్న తెల్లని లాల్చీని పైకెత్తి, తన పొట్ట పై భాగంలో ఎడమ పక్క చూపించాడు.

నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, మా నాన్న తన చిన్నతనంలో ఎప్పుడో చెట్టు మీద నుంచి కింద పడ్డాడట, అప్పుడు ఎడమ పక్క పొట్ట పైభాగంలో దెబ్బ తగిలి, అది పెద్ద మచ్చలాగా పడింది.

ఇప్పుడీయన, ఆ మచ్చను చూపిస్తున్నాడు. అవును! నిజమే సరిగా మా నాన్నకి ఇలాగే ఇక్కడ మచ్చ ఉంది. అయితే! ఈయన నిజంగా మా నాన్నేనా? అవును మా నాన్నే అయివుంటాడు అనిపించింది.

నాకు ఈ లోపు బాగా ఆకలి వేసింది. ”నాన్నా! నాకు బాగా ఆకలి వేస్తోంది” అని చెప్పనాయనతో. ఆయన ”సరే! అయితే కళ్ళు మూసుకో” అన్నాడు.

నేను కళ్ళుమూసుకున్నాను. కాసేపటి తర్వాత ”కళ్ళు తెరవ” మన్నాడు. నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసాను. నా ఎదురుగ్గా వడ్డించిన అరటి ఆకు విస్తరి వేసి వుంది. అందులో అన్నం, మాంసపు కూరలు ఉన్నాయి.

అది చూసి నేను ”ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి? నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదుగా? మరివి ఎలా వచ్చాయి?” అని అడిగాను.

”నేనలాతెప్పించగలనులే!” అంటూ విషయం మారుస్తూ ”అమ్మా! అల్లుడు బాగున్నాడా? మనుమళ్లు, మనుమరాలు బావున్నారా?” అంటూ వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పి మరీ అడిగారు.

అప్పుడు నేను ”నీకు వాళ్ళెలా తెలుసు? వాళ్ళని నువ్వెప్పుడూ చూడలేదుగా? మరెలా తెలుసు? అన్నాను.

అందుకాయన ”నాకు వాళ్ళ గురించే కాదు, అందరి గురించి తెలుసు. మీ అమ్మ గురించి కూడా తెలుసు. ఆవిడని నేను చూస్తూనే ఉన్నాను. అది సరే గాని అన్నం తిను” అన్నాడు.

నేను అన్నం కలిపి, ”నువ్వు మా నాన్నవిగా, మరి నేను నీకు అన్నం కలిపి పెడతాను.” అంటూ ముద్ద చేసి ఆయన నోటికి అందించాను.

”ముందు నువ్వు తిను” అంటూ తాను అన్నం తీసుకొని, ముద్ద చేసి నా నోటికి అందించాడు. ఇద్దరం ఒక్కళ్ళ నోటికి ఒకళ్ళు ముద్దలు అందించుకుంటూ భోజనం పూర్తి చేసాము.

”నేను ఇంక వెళతాను, చాలా ఆలస్యం అయ్యింది. మీ అల్లుడు నన్ను తిడతాడు” అన్నాను.

”సరే! పద నేను నీతో పాటు కొంత దూరం వస్తాను” అన్నాడు. ఇద్దరమూ నడుస్తున్నాము.

కొంత దూరం వచ్చాక నాకు ఇల్లు దారి తెలుస్తోంది. ఆలస్యం అయిపోయింది, ఈయన అరుస్తాడో ఏమిటో అని అనుకుంటూ, వడి వడి గా అడుగులు వేసి, కొంత దూరం వెళ్ళాక నాన్న కోసం వెనక్కి చూసాను. నాన్న నా వెనుక లేడు.

అప్పుడర్ధమయ్యింది, నాన్న రూపంలో బాబాయే నాకు కనిపించి, నాకు దారి చూపించి, మా ఆయన గురించి, పిల్లల గురించి కుశల ప్రశ్నలు వేసి, నాకు అన్నం తినిపించి, నా చేత్తో తాను అన్నం తిని, నేను చీకటికి భయపడుతూ ఉంటే, తాను కూడా వచ్చి నన్ను ఇక్కడ దాకా దింపిన వాడు సాక్షాత్తు సర్వ జగద్రక్షకుడైన, ”శ్రీ సాయినాథుడే”.

ఇలా నాకు ధ్యానంలో అనుభవమయ్యింది. అప్పటినుండి సాయి నా తండ్రి అయ్యాడు. ఆయన సన్నిధికి తప్ప వేరే గుడులకి వెళ్ళటం మానుకున్నాను.

బాబాకి జరిగే నాలుగు హారతులకి వెళ్లేదాన్ని బాబా గుడి తప్ప, బాబా సేవ తప్ప నాకు వేరే ప్రపంచం లేదని అనిపిస్తుంది.

అప్పటినుండి ఇంట్లో ఏది వండినా నేను ఏది తిన్నా బాబాకి చూపించి ఆయనకీ పెట్టి కాని నేను తినను.

చూసుకుంటూ బాబా గుడిలోనే ఎక్కువ సమయం గడుపుతూ, బాబా సేవ లోనే సమయమంతా గడపాలని అనిపిస్తుంది.

నాకు కాళ్ళ నొప్పులు, పళ్ళ నొప్పులు, తల నెప్పి ఏది వచ్చినా మందేది వేసుకోను, కాసేపు ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుంది.

బాబా ధ్యాస, బాబా నామం తప్ప మరే ప్రపంచం అక్కరలేదు. అప్పుడప్పుడు చేసే ధ్యానం ఇప్పుడు ఎక్కవ సమయం ఇంట్లోనే చేస్తున్నాను.

ఒక రోజు బాబా గుడిలో అభిషేకం అయిన తర్వాత కిందకి దిగి వస్తుంటే, రెండు మెట్లు ఒకేసారి దిగేసాను, పడిపోయాను, నా కాలు బాగా నెప్పి చేసింది, నాకు ఏ నెప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ధ్యానం తోనే తగ్గుతాయి.

ధ్యానం లో తగ్గకపోతే, ”ఊదీ” రాస్తాను. మందులాగా లోపలికి పుచ్చుకుంటాను. అంతే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళను.

మందులు అసలు వాడను. బాబాయే నా వైద్యుడు. కాలు నొప్పితో అసలు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాను. అందరు డాక్టర్ని కలవమన్నారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు.

ఏ మందులు వేసుకోలేదు. ఇంత నొప్పితో కూడా బాబా గుడికి వెళ్లడం మానలేదు. అలాగే కుంటు కుంటూ వెళ్లి దర్శనం చేసుకుని, ఏదైనా సేవ ఉంటే అది కూడా చేసి వచ్చేదాన్ని.

ఆ నెప్పి పది రోజులైనా పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. కాలు బాగా వాచిపోయింది. ఆ నెప్పి తోనే అలాగే కూర్చుని బాబా ధ్యానం చేస్తున్నాను. బాబాని ప్రార్ధిస్తూనే ఉన్నాను.

బాధ భరించలేక ఒక రోజు తల గోడకేసి కొట్టుకున్నాను, ఏడ్చాను. కాసేపు ఆగి నన్ను నేను తమాయించుకుని ధ్యానానికి కూర్చున్నాను.

ఆ ధ్యానం లో బాబా, మరొకాయనతో వచ్చి, (ఆ మరొకరు ఎవరో కాదు నాతో పాటు రోజూ గుడికి వచ్చే మరొక సాయి భక్తురాలి భర్త) నా కాలు బాబా తొడ మీద పెట్టుకుని, (పాదం) వంగి చాలా సేపు మర్దన చేసాడు .

నేను ”బాబా నువ్వు నా కాలు పట్టుకోవడం ఏమిటి” అని అడిగితే, దానికి బాబా ”నేను నీ తండ్రిని, నువ్వు నా కూతురివి, నీ కాలు నేను పట్టుకుంటే తప్పేమిటి అమ్మా?” అని నా మోకాలు నుండి పాదం వరకూ బాగా రాసి కొద్దిసేపు అయ్యాక, బాబా నన్ను ”పడుకో” మన్నాడు.

ఆ ధ్యానంలోనే నేను పడుకున్నాను. నాకు తెలియకుండానే నేను నిజంగానే నిద్ర పోయాను.

తెల్లారాక మెలకువ వచ్చింది. ఒక్కసారిగా నేను మంచం మీదనుంచి కిందకి దిగాను.

కాలు విదిలించాను, నెప్పిలేదు, వాపులేదు. బాబా చెయ్యి పెట్టి (బహుశా కాలు కొంచెం విరిగిందనుకుంటా) మర్దన చేసి నెప్పిని, వాపుని తొలగించేసాడు. నేను మామూలుగానే నడుచుకుంటూ గుడికి వెళ్లాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ధ్యానంలో సాయి చేసిన వైద్యం ………….!

Sai Baba

Definitely the devotees get the Goosebumps when they read this miracle.

When we surrender completely to the Guru, The Guru acts as our guide and will take you straight to your destination.
In fact it is not possible to predict what happens in our life in the next moments. Our life is like a person who searches the path to come out from the deep forest.

The way is difficult. There are tigers and wolves in the jungles on the way.
If Baba with Us, Then he will take you straight to your destination, avoiding wolves, tigers, and ditches etc. on the Way
So in our life every moment, Baba is helping to overcome hardships and finally to reach the destination of our life.
In the above leela, she firmly believes that any health problem of her will be cured by Baba only.
Thus Baba’s grace only reduced her pain completely.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles