Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు విజయలక్ష్మి. మేము ప్రస్తుతం హైదరాబాద్, వనస్థలిపురం, NGO’ S కాలనీ లో ఉంటున్నాము.
మా వారు మొదట్లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యి, ఈ మధ్యనే చనిపోయారు.
మా వారు పుట్టుకతోనే అంధులుకావటానా నేను ప్రతిరోజు ఆయన్ని బస్సులో కాలేజీకి తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చి నా పని చేసుకుని తిరిగి కాలేజీ వేళకి మళ్ళీ వెళ్లి తీసుకువచ్చేదానిని.
పిల్లలు కలిగాక వాళ్ళని కూడా స్కూల్ లో దింపి ఇంటికి వస్తుండేదానిని.
అలా ఒక సారి నేను, ఈయన, పిల్లలు బస్సులో కాకుండా ఆ రోజెందుకో ఆటోలో బయలుదేరాము,
పిల్లల్ని మధ్యలో స్కూల్ లో వదిలేసి, నేను మా వారిని కాలేజీలో దింపడానికి వెడుతుంటే మధ్యలో ఆటోవాడు ఒక మందిరం దగ్గర ఆపి అందులోకి వెళ్లి పదినిమిషాల్లో చేతుల నిండా ప్రసాదం తీసుకుని బయటికి వచ్చాడు.
మా వారు ”అదేమిటయ్యా! అలా వెళ్ళిపోయావు? మాకు ఆలస్యం అయిపోతోంది, ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు” అన్నారు.
ఆటో అతను ఇది ”సాయి బాబా గుడి” అమ్మా అని ప్రసాదం ఇవ్వబోయాడు. నేను ఆరోజు ఆలస్యం అయిపోతోందని స్నానం కూడా చేయకుండా బయలుదేరాను అదే మాట ఆటో వాడితో చెప్పాను.
అప్పుడు ఆటో వాడు అన్నాడు ”అమ్మా బాబా గుడిలో అటువంటివి ఏమి ఉండవు స్నానం చేయక పోయినా గాని గుడికి వెళ్లొచ్చు, ప్రసాదం తినొచ్చు” అంటూ మాకు ప్రసాదం పెట్టాడు.
మేము మొదటిసారిగా బాబా గురించి విని, బాబా ప్రసాదం తిన్నాము.
ఆ తర్వాత మాకు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు రాసిన ఒక పుస్తకం ఎక్కడో దొరికింది, ఆ పుస్తకంలో ఆయన ఇంకా ఇతర రచనలు అన్నీ రాసి ఉన్నాయి.
మేము అది చూసి ఉత్తరం రాసి “సాయి లీలామృతం” అనే బాబా గారి జీవిత చరిత్ర పుస్తకం తెప్పించుకున్నాము. నేను ఆ పుస్తకం అంతా చదివేసాను,
ఆ తరువాత మా వారు నువ్వు అలాగ చదివేసుకుంటే నాకు బాబా గారి గురించి ఎలా తెలుస్తుంది? అది పైకి చదివి నాకు వినిపించు అన్నారు.
నేను ఆయన కోసం మరో సారి పైకి చదివాను అంతా విన్నాక మా వారు ఈయనకి ఇన్ని మహత్యాలు ఉన్నాయా! నువ్వు ఈ పుస్తకం చదివేటప్పుడు రికార్డు చేయి అన్నారు.
నేను మా వారి కోసం చదువుతూ రికార్డు చేశాను. ఆ రికార్డు చేసినది ఆయన వినడం, నేను పుస్తకం చదవడమూ చేసేవాళ్ళం.
అలా చదువుతున్నప్పుడే బాబా గారు నాకు ఒక సారి కలలో కనపడి దూరంగా చూపించి అక్కడ ప్రసాదం పెడుతున్నారు రా అన్నారు, నేను వెళ్ళాను, నా దోసిలి నిండా పేలాలు పోశారు.
ఆ పక్కనే బాబాగారి పక్కన ఒకామె లక్ష్మి భాయి షిండే లాగ కూర్చుని ఉంది. బాబా పాదాలు అందుకుందామని నేను నా కాళ్ళను ముందుకు జరిపాను, అక్కడ ఉన్న ఒక పళ్లెం నా కాళ్ళకు తగిలింది.
నేను బాబా పాదాలు అందుకోవటం ఒకటే నా ధ్యేయం అందుకని నా కాళ్ళకు తగిలిన పళ్లాన్ని కాళ్ళతోనే కొంచెం పక్కకి నెట్టాను.
అప్పుడు అక్కడ కూర్చున్న లక్ష్మీభాయి షిండే లాంటి ఆవిడ నా తోటి దెబ్బలాడుతోంది, కాలితో అలా ఎందుకు తంతున్నావ్ అని, నేను తన్న లేదు అది నా కాలికి తగిలింది అంటూ బుకాయించాను.
అబద్దాలు కూడా ఆడుతున్నావా అని నా మీదకి కలబడింది, ఈ లోపు బాబా గారు ఆమెతో ”ఆవిడను ఏమి అనకు, నా మీద భక్తి కుదిరేవరకు అందరూ అలాగే చేస్తారు, కుదిరిందంటే ఇంకెప్పుడూ అలా చెయ్యదు.” అని అన్నారు, అదీ కల.
ఆ తరువాత భరద్వాజ మాస్టారు కూడా నాకు అప్పుడప్పుడు కలలో కనపడుతుండే వారు.
ఒక సారి ఒక రాత్రి పూట నాకు కలలో వస్తే నేను ఆయన్ని చూడడానికి లేచి లైట్ వేయబోయాను, అది చూసి ఆయన ”ఏంటి లైట్ వేస్తే గాని నన్ను నన్నుగా గుర్తించలేవా? అని అడిగారు.
నాకు తరచూ ఫిట్స్ వస్తుండేవి. ఎటువంటి చెడు వార్తలు విన్నా పడిపోతుండేదాన్ని, ఒక సారి మా వారి కాలేజీ లో ఒకాయనకి ఒంట్లో బాగాలేదు, చనిపోతారని మాకు ముందే తెలిసింది.
మేము మరునాడు కాలేజీకి వెళుతుండగా దారిలో కాలేజీలో పనిచేసే మరొకతను మాకు ఎదురువచ్చి ఒంట్లో బాగా లేని మనిషి చనిపోయాడు, అని చెప్పాడు.
అంతే అంతకుముందే ఆ మనిషి చనిపోతాడని తెలిసినా కూడా, నేను ఫిట్స్ వచ్చి రోడ్డు పైనే పడిపోయాను. కాలేజీలో దగ్గర్లోనే ఉండబట్టి నన్ను కాలేజీకి తీసుకువచ్చి కాలేజీలో పడుకోబెట్టారు.
అప్పుడే బాబా నాకు కలలో కనబడి ”ఇది ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఇలా ప్రాణాలు తీసేసుకుంటుంది, దీనికసలు ఈ బాధ లేకుండా చేస్తాను” అని అన్నారు. బాబాతో పాటు భరద్వాజ మాస్టర్, వారి సతీమణి కూడా ఉన్నారు అదీ కల.
ఆ తరువాత నాకు ఫిట్స్ రాలేదు, నాకింక ఎటువంటి చెడు వార్తలు విన్నా, చావులు కళ్ళారా చూసినా కూడా నాకు ఏమి అయ్యేది కాదు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- అవగాహన లేకుండా చేసిన సచ్చరిత్ర పారాయణం, కానీ ఫలితం మాత్రం అమోఘం ……
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- దూరాన్ని పెంచిన అంగ వైకల్యం, నాన్నకి దగ్గర చేసిన సాయి కరుణ ……….!
- ‘‘నా సచ్చరిత్రను పారాయణం చేసిన ఇంట ‘లేదు’ అన్న మాట వినబడదు.
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments