Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయినాధాయ నమః
నేను స్కూల్ డేస్ లో ఉన్నపుడు మా ఇంటి దగ్గర ఉండే ఒక ఆంటీ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది. నాకు బాబా సచ్చరిత్ర బుక్ ఇస్తాను అని.
ఆ బుక్ ని కుదిరితే చదవమని చెప్పింది. అపుడు ఎక్కువగా నాకు బాబా గురించి తెలియదు. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు బుక్ తెచ్చుకోలేదు.
కాలేజీ తర్వాత నేను హైదరాబాద్ కి వెళ్లి అక్కడ హాస్టల్ లో ఉన్నాను. హాస్టల్ లో ఉన్న రూమ్మేట్ కావ్య, సుజాత ఎక్కువగా బాబా భక్తులు.వాళ్ళు రోజు సాయి లీలామృతం బుక్ ని చదివేవారు.
ఒక అమ్మాయి నన్ను కూడా బుక్ ని చదవమని మంచి జరుగుతుందని చెప్పేది. మా అమ్మ కూడా చెప్తూ ఉండేది.ఆలా నేను కూడా బాబా భక్తురాలిని అయ్యాను.
కరోనా ఎఫెక్ట్ కి అందరమూ హాస్టల్ నుండి ఇంటికి వచ్చేసాము. లాక్ డౌన్ తరువాత నాకు సాయి సచ్చరిత్ర బుక్ చదవాలని అనిపించింది కానీ నా దగ్గర బుక్ లేదు.ఆన్లైన్ లో బుక్ ఆర్డర్ పెడదాం అని చూసా కానీ బుక్ స్టాక్ లేదు.
మొబైల్ చూస్తూ చదువుదాం అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను.కానీ మొబైల్ లో చూస్తూ చదవడం నాకు చాలా కష్టముగా అనిపించింది.
పారాయణం స్టార్ట్ చేశాను మధ్యలో ఆపేయలేను.తెలిసిన వాళ్ళ దగ్గర నుండి బుక్ తెచ్చుకుందాం అనుకున్న అపుడు నాకు గుర్తుకు వచ్చింది.స్కూల్ డేస్ లో ఉన్నపుడు బుక్ ఇస్తాను అని చెప్పిన ఆంటీ వాళ్ళ ఇంట్లో బుక్ ఉంటుంది.
నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లి సచ్చరిత్ర పారాయణం చేస్తాను.నా దగ్గర బుక్ లేదు నాకు మీ బుక్ కావాలి చదివిన తరువాత మల్లి బుక్ తీసుకుని వచ్చి ఇస్తాను అని ఆంటీని అడిగి బుక్ తెచ్చుకున్న.పారాయణం కంప్లీట్ ఐపోయాక బుక్ ఇచ్చేసి వచ్చా.
మనము ఎక్కడ ఉన్న బాబా దగ్గరికి రప్పించుకుంటారు. నేను ఏ ఆంటీ దగ్గరకి వెళ్లి బుక్ తెచ్చుకోలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మల్లి అదే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లి బుక్ అడిగి తెచ్చుకునేలా చేసారు.
ఇదే నాకు జరిగిన చిన్న లీల.మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది అందుకే ఈ చిన్న లీలని రాస్తూన్నాను.
సర్వము శ్రీసాయినాధార్పణమస్తు.
శ్రీవిద్య రెడ్డి
Latest Miracles:
- అవగాహన లేకుండా చేసిన సచ్చరిత్ర పారాయణం, కానీ ఫలితం మాత్రం అమోఘం ……
- సచ్చరిత్ర పారాయణం సకల శుభ ప్రదాయం ….!
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- బాబా స్వప్న దర్శనం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments