Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మాపాపకి ఒకసారి పైల్స్ తో చాలా అవస్థపడింది. పరీక్షలు కూడా రాయలేక పోయింది. స్కూలుకి వెళ్లలేకపోయింది. నేను బాబాకి మొక్కుకున్నాను.
బాబా ఊధి పాలల్లో వేసి ఇస్తుండేదాన్ని, దీనికి తగ్గి కులాసాగా ఉంటే శిరిడి వస్తానని అనుకున్నాను. మాపాపకి తొందరలోనే నయం అయిపోయింది.
మా తమ్ముడి కూతురికి ఎప్పుడు ఎదో ఒకటి జలుబో, దగ్గో, జ్వరమో, విరేచనాలతో బాధపడుతుండేది.
అస్తమానం ఆసుపత్రిలో జాయిన్ చేయటం, లాభం లేదంటూ చెప్పటం జరుగుతుండేది. పాపకి అయిదు సంవత్సరాలు వచ్చేదాకా ఇలాగె కొనసాగుతుందేది.
నేను బాబాతో మొర పెట్టుకున్నాను. బాబా మా తమ్ముడు కూతురిని నువ్వే ఎదో ఒకటి చేసి, ఆ పిల్లని మా వాడికి, మా తమ్ముడుని నాకూ దక్కించు అని అనుకున్నాను.
నేను ఇలా బాబా తో అనుకున్నాక నాకు కలవచ్చింది. ఆ కలలో బాబా నాతో “వనస్థలిపురంలో బాబా ఉపాసకులు ఒకాయన వున్నారని, తమ్ముడ్ని ఆయన దగ్గరికి పంపించమని” చెప్పాడు.
తమ్ముడికి మర్నాడు ఈ విషయం చెప్పాను. మాతమ్ముడు ఇలాంటివి పెద్దగా నమ్మడు. సరేలే అన్నాడు తేలికగా,
సరేకాదు, నేను గంటలో ఫోన్ చేస్తాను, అప్పటికి నువ్వు అక్కడికి వెళ్లి టోకెను తీసుకొని ఆనెంబర్ నాకు చెప్పాలి అన్నాను.
ఇంక తప్పదనుకొని మాతమ్ముడు వెళ్ళాడు. నాకు నెంబర్చెప్పాడు, వీడు వెళ్ళాక ఆయన ఊది ఇచ్చి, తాయత్తు కట్టి
“మీ బావే నీకీ విధంగా బాగా చెడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే నీకు ఊరికే ఇలా జరుగుతోంది, ఇంక భయం లేదులే, బాబా ఊధి నీకు సర్వజగద్రక్ష వెళ్ళి రా అన్నాడట”.
ఆతర్వాత క్రమంగా మా మేనకోడలు ఆరోగ్యవంతురాలు అయింది, బాబాదయవల్ల.
మాఆయనలో కూడా బాబా దయవల్ల క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నా సహనాన్ని అర్ధం చేసుకుంటున్నాడు.
మాపాపకి ఇల్లు బాబా ఇప్పించేస్తే చాలు, నేనేమీ ఆయన్ని ఆశించటంలేదు.
పాప బాగా చదువుకొని, వృద్ధిలోకి వచ్చి మంచి సంబంధంకుదిరి, దాని జీవితం సాఫీగా బాబా దయతో సాగిపోతే నాకదే పదివేలు.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా పంపిన ఊదీ
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
- సమయానికి అందిన బాబా ఊదీ–Audio
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments