బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా బాబుకి పళ్ళు వచ్చేటప్పుడు విరేచనాలు అవుతూ ఉంటే మందులు వేసినా తగ్గడం లేదు.

మా అమ్మ కంగారు పడాల్సింది ఏమి లేదు, పిల్లలకి ఇలా పళ్ళు వచ్చేటప్పుడు అలాగే విరేచనాలు అవుతాయి, అని మాకు చెబుతున్నా బాబు నిరసించి పోతున్నాడని బాబాతో మళ్ళీ ఛాలెంజ్ చేశాను.

”ఇప్పుడు రాత్రి అయింది బాబా! తెల్లారేసరికల్లా మా బాబుకీ ఈ విరేచనాలు తగ్గక పోతే నేను నీ గుడికి రాను బాబా” అని అన్నాను.

షిరిడీ నుండి తెచ్చిన విభూది వాడి నుదుటున పెట్టి పొట్టకి రాసాను. వెంటనే విరేచనాలు ఆగిపోయాయి.

మా ఆవిడ నేను, మా అమ్మ పూజ చేస్తుంటే ఏమో అనుకునేది. ఈ సంఘటన జరిగాక బాబా మీద మా ఆవిడకి పూర్తి నమ్మకం కుదిరింది. ఊదీ మహత్యం తెలుసుకుంది.

నేను డబ్బుకి ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. నేను పరిస్థితిని బాబాకు చెప్పుకున్నాను. అప్పుడే మావాళ్ళు భజన పెట్టారు. ప్రతి ఆదివారం నాడు కొందరి భక్తుల ఇళ్ళల్లో మేము భజన చేస్తుంటాము.

గురువారం గుడిలో పల్లకి సేవ ఉంటాయి. అలాగే ఆ రోజు కూడా ఒకరింట్లో భజన ఉంది రమ్మన్నారు.

మేమందరమూ సొంత అన్నదమ్ములం కాకపోయినా బాబా కలిపిన బంధం వలన ”అన్నా! అక్కా!” అని పిలుచుకుంటాం.

”నేను రాను అన్నా నాకు చాలా ఇబ్బంది ఉంది, నా మనసేమీ బాగాలేదు” అన్నాను.

”బాబా ఉన్నాడుగా చూసుకుంటారు. నువ్వెందుకు బాధ పడతావు” అన్నారు మా వాళ్ళు. ”నేను రాను అన్నా” అన్నాను.

”లేదు, లేదు నువ్వు రావాలి, రాకుంటే చూడు” అన్నారు వాళ్ళు. రేపు కదా చూద్దాంలే అన్నాను.వాళ్ళు వెళ్లి పోయారు.

ఆ రాత్రి బాబా నన్ను నిద్రపోనియ్యలేదు. ”ఏం బిడ్డా! భజనకి పోవా నువ్వు, నడ్డి మీద తంతాను పోవా ఏంటి? అన్నాడు. ”ఓ బాబా నేను భజనకి వెళతాను కానీ నన్ను నిద్ర పోనివ్వు” అన్నాను, వెంటనే నిద్ర పట్టింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles