Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై
సాయి బాబా …. సాయి బాబా …. సాయి బాబా …. సాయి బాబా
నా పేరు మారుతి.
వెలకట్టలేని, చెప్పనలవి కాని ప్రేమ బాబా, గురువుగారిది..
ఆరోజు అనగా జూన్ 1వ తేదీన నాకు బాబా గారు ప్రసాదించిన అనుభవాన్ని తెలియజేస్తున్నాను. పొద్దున్నే మా చిన్నపాప ఏడవడం విని నాకు మెలుకువ వచ్చింది.
చిన్న పాపని జో కొట్టగానే వెంటనే నిద్ర పోయింది.
నాకు మాత్రం వీపు పై భాగమున ఒత్తిడి తగిలింది ఏమిటా అని చూస్తే నా చెవి కమ్మ. సీల నా చెవికే వుంది. జోకా మాత్రం కనబడలేదు.
వెతుకుతున్నాను. వెతుకుతూ ఇలా అనుకున్నాను. చిన్నపాప ఏమైనా నోట్లో వేసుకుందా లేదా ఎక్కడ వుంది అనుకుంటున్నా..
కాసేపు వెతికినా దొరకలేదు ఇక టైమ్ చూస్తే 5.50 AM దాటినట్లుంది. సత్సంగం 6.00 AM కి వుంది.
ఇంక ఇలా అనుకున్నాను 6 లోపు జోకా దొరికేలా చేయండి గురువుగారు, బాబా అని.
మరల ఇలా అనుకున్నాను ఒకవేళ కనపడలేదు అంటే అలా ఎందుకు జరిగిందో మన మంచికే కావచ్చు నేను అలా గట్టిగా కనపడాలి అని అనోద్దేమో అనుకుని దొరికినా దొరకకపోయినా పరవాలేదు అనుకుంటూ దొరికితే 6 (సత్సంగం మొదలయ్యే టైమ్) లోపు దొరకేలా చేయండి గురువుగారు, బాబా అని అనుకున్నాను.
వెతుకుతున్నాను. జోకా పెద పాప దుప్పటి పై కనపడింది. టైమ్ చూస్తే 5.57 అయింది.… ఆనందం అనిపించింది.
అడగగానే గురువుగారు, బాబా నేను అడిగిన టైమ్ లో దొరికేలా చేశారు.
అంతేకాకుండా 6 అయ్యాక టైమ్ అంటే 6:01 లోపే సత్సంగం లింక్ క్లిక్ చేసి వింటున్నా నేను ఆన్ చేసాక మొదలయింది, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై, సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై అని.
బాబా, గురువుగారి ప్రేమ ఎలా ఉంటది అనేది అర్థమవుతుంది.
Thank you బాబా, గురువుగారు
సాయి బాబా …. సాయి బాబా …. సాయి బాబా …. సాయి బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై
Latest Miracles:
- నా ప్రశ్నకి గురువుగారు ఫోన్ లో సమాధానమిచ్చారు.
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- అడగగానే సందేశమిచ్చిన గురువుగారు.
- నా కోరిక ప్రకారం బాబా వారి వెన్నముద్ద ప్రసాదాన్ని గురువుగారు నాకు ప్రసాదించారు.
- నేను అడగగానే నాకు సహాయం చేసారు గురువుగారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments