నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …      సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

సమాధానమిచ్చే సమాధి…!!

పూజ్యులు గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ వారు ప్రసాదించిన ప్రసాదమును మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందముగా ఉంది.

నా పేరు మల్లినేని కోటయ్య,నా భార్య పేరు రాణి.మా స్వగ్రామము కట్టుబడి పాలెం.మాకు వివాహము అయిన తరువాత పిల్లలకోసం ఎన్నో  గుళ్ళు,గోపురాలు తిరిగి తిరిగి అలసిపోయాము.

ఎందరో డాక్టర్లు చుట్టు తిరిగి తిరిగి అలసిపోయి ఎంతో ఖర్చుపెట్టుకున్నాము.మా ఆశ నిరాశ అయినది.

మేము సాయిబాబా సత్సంగానికి పోతూ,పూజ్యశ్రీసాయినాథుని శరత్ బాబూజీ వారికి మా కోరికను 2010లో విన్నవించుకోవడం జరిగింది.

గురూజీ అనుగ్రహముతో 17-11-2011వ తేదీ (గురూజీ పార్థివ శరీరాన్ని సమాధి చేసిన రోజు)నాభార్యకు ప్రసవము అయినది.పండంటి మగబిడ్డను ప్రసాదించారు.

బాబుకు ఏ పేరు నామకరణం చేయాలి అనుకొంటుండగా గురూజీ స్వప్నములో కనిపించి “సాయి శరత్” బాగున్నాడా? అని అడిగారు.

మా బాబుకి ఏపేరు పెట్టాలి అనుకున్న మా ప్రశ్నకు సమాధానంగా గురూజీ సమాధి నుండి సమాధాన మిచ్చారని మాకు అనుభవమైoది.

మాకు పిల్లలు లేక లేక కలిగినది చూసి ఊరుఊరంతా సత్సంగానికి రావడం మొదలైంది.

నా మట్టి సమాధానమిస్తుంది.నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.

వారు ప్రసాదించిన సాయివరప్రసాదముతో జీవితాంతం వారి సేవ చేసుకుంటూ బాబా ఊసూ-ధ్యాసలతో గడిపేందుకు ఆశీస్సులు కోరుకుంటూ మీ పాదరేణువు…

మల్లినేని కోటయ్య,కట్టుబడిపాలెం,ప్రకాశం జిల్లా.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …      సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles