Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
నా పేరు కుర్ర భాస్కర్ రెడ్డి, నివాసము శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా.
2006 సంవత్సరములో శ్రీ కాళహస్తిలో శంకర్రెడ్డి గారి ఇంట్లో వెంకటగిరి సంత్సంగ సభ్యులతో భజన ఏర్పాటుచేయబడినది.
సాయి ప్రసాద్ గారి సంత్సంగము విన్న తరువాత నా మనస్సు పులకించింది.
వారం తరువాత శంకర్ రెడ్డి గారి ఇంటికి పోయాను.
శంకర్ రెడ్డి గారు మా ఇంట్లో భజన జరిగినట్లు కావచ్చింది అని చెప్పినారు.
ఆరోజే మా ఇంటిలో ఒక గురువారం భజన చేయాలని నిర్ణయించుకున్నాను.
మళ్ళీ రెండవసారి వారం రోజులతర్వాత శంకర్ రెడ్డి గారి ఇంటికి పోయాను.
షిర్డీ కి పోతున్నాను, షిర్డీ వస్తావా అని అడిగారు.
షిర్డీ కి పోయి బాబా దర్శనము చేసూకోని సాయిసత్సంగములో పాల్గొని ఆనందముతో తిరిగి వచ్చాను.
వచ్చిన తరువాత ఒక గురువారం రోజున భజన, సంత్సంగము ఏర్పాటు చేసుకొన్నాము.
మంగళవారం రోజు పొలములో రాత్రి శనగకాయలకు కావాలి పడుకొని బుధవారం 5 గంటలకి వస్తుంటే పాము కరిచింది.
ఏ పాము అయినది తెలియదు.
రేణిగుంట బషీర్ హాస్పిటల్ కి వెళ్ళినాను.
అయన వైద్యము చేసి నా కుటంబసభ్యలకు నాకు ప్రాణాపాయము లేదు పాము విషము ఎక్కలేదు అని చెప్పినాడు. పాము కరిచిందే భజన ఆగిపోతుంది అని బాధపడ్డాను.
కానీ అన్ని ఏర్పాట్లు బాబా, గురూజీ దయ వల్ల జరిగాయి. నన్ను చూడటానికి గురుబంధువులందరు వచ్చినారు.
గురువారం 6 గంటలనుండి 9 గంటలవరకు శ్రీ సాయి బాబా నమ సంకీర్తన జరిగింది.
2006 మొదలుకొని ఇప్పటివరకు ఉదయము హారతి, ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతున్నాయి.
అన్ని ప్రాంతాలనుండి ఎంతోమంది గురుబంధువలు పాల్గొంటున్నారు.
గురువుగారిదర్శనము నాకు 2006 లో జరిగింది.
అప్పుడు వారిని సత్సంగము క్రమము తప్పకుండ జరగాలని కోరుకున్నాను.
అప్పటినుంచి అయన అనుగ్రహముతో సత్సంగము క్రమం తప్పకుండ జరుగుతుంది.
సాయి బాబా మరియు గురూజీ కృపవలన మా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచిగా స్థిరబడ్డారు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాధు రూపంలో బాబా వారు వచ్చి పాము బారినుండి కాపాడుట
- సన్నుతించు వేళ…..సాయి@366 జూన్ 12…Audio
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- బాబా కాకి రూపమున వచ్చి కాపాడుట–Audio
- సాయినాథుని కృప సౌరభాలు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments