సన్నుతించు వేళ…..సాయి@366 జూన్ 12…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


”తానొకడైనా తలకొక రూపై” ఉండెడి వాడు శ్రీకృష్ణుడు అంటారు శ్రీ సముద్రాల రాఘవాచార్య.

సాయిబాబాను ”గణపతి నీవే” అంటాడు కేశవచిదంబర్‌ గాడ్గిల్‌. ”మారుతి నీవే” అంటారు మారుతిగా దర్శనం పొందిన నానా సాహెబ్‌ డేంగ్లే కుమారుడు సోమనాథ శంకర్‌ దేశ్‌పాండే.

”మారుతి నీవే – గణపతి నీవే, సర్వ దేవతల నవ్యాకృతి నీవే’‘ అంటారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె).

విశ్వంభరుడైన ఆ సాయినాథుని ఆ రెండు చరణాలలోనే దర్శింప చేశారు ఆయన.

“నుడులకు అందవు నుతులకు పొంగవు” అంటూనే ”పాపాలు కడిగేసే పావన గంగ’‘గా చేస్తారు సాయిని – సాయి కాదనగలడా?

”నిన్నుగని శరణమని సన్నుతించు వేళ

జన్మ ధన్యమౌతుంది బాబా’‘ అని అంటూనే

”దాతవని తలచుకొని; జోతలిడే వేళ; దైవం తల వూపుతుంది కాదా? మా దైవం తలవూపుతుంది కాదా?” అని అడుగుతారు డాక్టర్‌ సినారె గారు.

సాయి కాదనగలడా?

అంతటితో ఆగరు డాక్టరు రెడ్డి గారు.

”తొలగించినావు వ్యాధులను ఊదితో” అంటారు ఆయన. ఎప్పుడో అలా చేశాను అనటం కాదు, ఇప్పుడు, అప్పుడు అలా చేయాలనే ఆకాంక్షతో సాయిని.

”బాబా చూపే మలయ సమీరం” అనేది డాక్టరు రెడ్డి గారి భావన కాదు. అది పరమ సత్యం.

సమస్యలతో, బాధలతో, దరి కానని వారికి సాయి సన్నిధి సేద తీరుస్తుంది, ఊరట కలిగిస్తుంది – ఇది జరిగిన, జరుగుతున్న అనుభవాలు తెలిపే నిత్య సత్యాలు.

అందుకనే ప్రతి భక్తుడు ”నీ పాద సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం” అంటాడు. ఎందుకంటే ”కలుష భావనలు చొరబడనీయని కవచం నీ ధ్యానం” అని భక్తునకు తెలుసు.

ఇంకా, ”అది భవ జగతికే నావ”

ఇక సాయిని ”శరణ మని సన్నుతించు వేళ” అయింది అని హెచ్చరిస్తారు డా|| సి.నా.రె. గారు.

నేడే డా|| రెడ్డి గారి వర్థంతి జూన్‌ 12.

”ఎంతెంత దయ నీది ఓ సాయి” అంటూ

సాయి దివ్య ప్రేమను మరువకుందుము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles