మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: MRS. Jeevani


గురుగీత వివిధ రకాల గురువులను గూర్చి ప్రస్తావిస్తుంది. ఉద్దవేశ్‌ బువా అసలు పేరు శ్యామదాస్‌, జూన్‌ 9, 1865లో జన్మించాడు.

బాల్యం నుండి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవాడు. ఆయన సాధు సంతులను దర్శించే వాడు, సేవించే వాడు.

ఒకసారి కాలి నడకన యాత్ర సాగించాడు. షేగాంలో గజానన్‌ మహారాజును దర్శించాడు.

ఆయన ”ఇక్కడ నుండి పశ్చిమం వైపు పో నీ మోక్ష గురువు లభిస్తాడు” అని పలికారాయన.

షిరిడీని గూర్చి, అందుండే సాయినాథుని గూర్చి ఉద్దవేశ్‌ విన్నాడు. షిరిడీ చేరాడు.

ద్వారకామాయిలో సాయిబాబా లేడు. ఎక్కడికో అడవులలోకి వెళ్ళి ఉంటారని అక్కడ ఉన్న ఒక ముసలమ్మ చెప్పింది.

సాయిని వెతుక్కుంటూ అడవులలోని వెళ్ళాడు. అక్కడొక వ్యక్తి కనిపిస్తే, సాయిబాబాను గూర్చి అడిగాడు.

ఆ వ్యక్తి మొరటుగా సమాధానమిచ్చాడు. మరల ద్వారకామాయికి వచ్చాడు. అక్కడ ఉన్న ముసలమ్మకు ఈ విషయం చెప్పాడు.

ఆమె ఆయన సాయిబాబాయే అన్నది. ఆశ్చర్యపోయాడు ఉద్దవేశ్‌ బువా.

ఆ వ్యక్తి ద్వారకామాయిలోనికి రాగానే, పాద సమస్కారం చేశాడు ఉద్దవేశ్‌. ”నా మోక్ష గురువు ఎలా లభ్యమవుతాడు?” అని అడిగాడు ఉద్దవేశ్‌.

”మోక్ష గురువు కోసం 5 సంవత్సరాలు వేచియుండు. రొట్టెనంతా ఒకేసారి ఎలా మింగగలవు? సహనంతో కూడిన నిరీక్షణ సాధకునికి అవసరం” అన్నాడు సాయిబాబా.

అతడు 5 సంవత్సరాలు ఆగాడు. ”5 సంవత్సరాలు గడిచాక (సాయి) నా మోక్ష గురువు అని తెలిసింది” అన్నాడు ఉద్దవేశ్‌.

సాయి ఉద్దవేశ్‌కు అనేక అనుభవాలను ప్రసాదించాడు. ”నీవే అలనాటి ఉద్దవుడవు. నేను కృష్ణుడను” అని అనుభవ పూర్వకంగా సాయి అతనికి తెలిపాడు. సాయి 11 నాణాలు సమర్పించు అన్నారు.

ఉద్దవేశ్‌ సాయిబాబాతో ”బాబా! 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 సమర్పించాను” అన్నాడు.

భక్తుడు సర్వస్య శరణాగతి చేసిన నాడే గురు కటాక్షం లభిస్తుంది.

అంతటి సమర్పణ సాయికి చేయగలిగిన నాడే, సాయి మోక్ష గురువు అవుతాడు సాధకునకు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles