Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. కానీ, సాయి మార్గంలో అది సాధ్యమే.
దాదాపు ఒకే సమయంలో, ఒకే ప్రదేశం నుంచి ఒక వైపు శ్రీ బి.వి. నరసింహస్వామి వేరొక వైపు శ్రీ స్వామి కేశవయ్య, సాయి పరిమళాలలను వ్యాప్తి చేస్తున్నారు.
ఒకరంటే ఒకరికి ప్రేమ. ఎందుకంటే ఒకే కొమ్మకు పూచిన రెండు పూలు అని వారు గ్రహించారు.
సాయిబాబా తనపై చూపుతున్న కృపను, తన వద్దకు వచ్చిన ఆర్తులకు, సాయి భక్తావళిపై త్రిప్పే వారు స్వామి కేశవయ్య.
అందరకూ మనశ్శాంతిని, రోగోపశమనాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సాయి భక్తిని కలిగించే వారాయన. సాయి ఊదిని, తీర్ధాన్ని ఇచ్చే వారు. ఆయనకు శిష్యులు, భక్తులు, సందర్శకులు ఉండే వారు.
ప్రతీదీ సాయి మహిమగా చెప్పే వారాయన. సాయి ఆయనను సిద్ధునిగా చేసినా, సాయి కృపయే కారణం అనే వారు. ఆయన మహిమలు అప్పుడప్పుడు అర్థమయ్యేవి, కొన్ని అర్థమయ్యేవి కావు.
ఆయనను గురువుగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి భావించే వారు. తరచుగా కేశవయ్యను దర్శించి, సేవించేవారు.
ఒకసారి కేశవయ్య ఆ శిష్యునితో ”గురువుకు నామం బాగా పెట్టగలవా?” అని ప్రశ్నించారు.
ఆ శిష్యునితో సహా అక్కడున్న వారందరకూ ఏమీ అర్థం కాలేదు. ఆ శిష్యుడు నిలువెత్తు నిజాయితీపరుడు. స్వామీజీ మాటలలోని అర్థం, అంతరార్థం ఎవరికీ అవగతం కాలేదు.
ఆ రోజు ఆగస్టు 9, 1981 – శ్రావణ శుద్ధ దశమి. ఆనాడు స్వామీజీ కొంత అస్వస్థతో ఉన్నారు. ఆయన చుట్టూ ఆ శిష్యుడు, ఇతర శిష్యులు ఉన్నారు.
స్వామీజీ ఊదీ అడిగారు, ఇచ్చారు ఆ శిష్యులు. స్వామీజీ నోటిలో వేసుకుని స్థిరాసనులై ”అల్లా మాలిక్” అని పలికి కన్నులు మూసుకున్నారు. సాయిలో ఐక్యం అయ్యారు.
ఆయనను మహా సమాధి చేసే కార్యక్రమం జరుగుతోంది. సాంప్రదాయ ప్రకారం ఆ పార్ధివ దేహానికి తిరునామం పెట్టాలి. ఎవరికి ఆ పని అప్పగించటమా అని అందరూ ఆలోచించారు.
అందరూ ఆ తిరునామం పెట్టే పనిని ఆ శిష్యునికే అప్పగించారు. తన గురువు పార్ధివ దేహానికి నామం పెట్టాడు ఆ శిష్యుడు.
సద్గురువుల మాట వమ్ము పోదు.
అందరూ భాష్పాంజలి ఘటించారు స్వామీజీకి!
Compiled by: – ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented by: – Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- సాయి పాదానంద …..సాయి@366 జనవరి 14….Audio
- సాయిని సేవించిన తెలుగు వెలుగు…..సాయి@366 ఏప్రిల్ 12…Audio
- ‘చిత్రం’ భలే విచిత్రం…..సాయి@366 జూలై 11…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments