సాయి పాదానంద …..సాయి@366 జనవరి 14….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా శ్యామాకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయమని ఆదేశించారు.

విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేస్తూ, సాయిపై నమ్మకాన్ని పెట్టుకోమని బెంగళూరుకు చెందిన సాయి పాదానంద అందరకూ చెబుతుండేవారు.

“విష్ణు సహస్ర నామ పారాయణ దుష్ట శక్తులను పోగొట్టుటయే కాక, ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అడ్డంకులను పోగొడుతుంది.

విష్ణు సహస్ర నామాన్ని ఏ విధమైన నియమాలు లేకుండా చేయవచ్చును” అంటారు అయన.

స్వామీజీ ఒకసారి ఊటీలో ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు.  ఆయనకున్న ఇద్దరు కుమార్తెలకు వివాహము కాలేదని చెప్పాడు. స్వామీజీ ఆ యువతులను కలిశారు.

వారితో 25 రోజులు విష్ణు సహస్రనామ పారాయణ చేయమని చెప్పారు. వారి ఇంటికి  ఎదురుగా ఉన్న తులసి  మొక్కకు ప్రదక్షణలను కూడా చేయమని చెప్పారు.

దిన పత్రికలో తగిన వరులకై ప్రకటనలను ఇమ్మన్నారు. స్వామీజీ చెప్పినట్లే చేశారు వారు.

స్వామీజీ తెలిపిన ప్రకారం ఆ అవివాహితులకు వివాహం జరిగింది. ఇదంతా విష్ణు సహస్రనామ ఫలితమే అన్నారు స్వామీజీ.

స్వామీజీకి సాయి పథాన్ని తెల్పిన మహనీయడు శ్రీ బి. వి. నరసింహ స్వామి. ఆయనంటే స్వామీజీకి ప్రగాఢ భక్తి ప్రవత్తులున్నాయి.

స్వామీజీ కరుణకు మారు పేరు. అయన మనుజుల పైననే కాదు జంతువులపైనను అపార కరుణ కురిపించే వారు.

స్వామీజీ బెంగళూరు వచ్చిన క్రొత్తలో అయన దగ్గరకు ఎవరో చూడి ఆవును తీసుకొని వచ్చారు. అది ప్రసవవేదన పడుతొంది.

అయన దానిని తన చేత్తో దువ్వి సుఖ ప్రసవం అవుతుందని చెప్పారు.

కొద్దీ రోజుల తరువాత ఒకరోజున ఆ ఆవు దానికి పుట్టిన దూడను స్వామీజీ వద్దకు తీసుకు రాగా ఆ ఆవు స్వామిని దూడను మరల మరల చూడగా స్వామీ అందరిని పిలచి “ఈ ఆవు యొక్క కృతజ్ఞత చూడండి” అన్నారు.

“మానవులమైన మనం ఇంత కృతఙ్ఞతలు చూపుతున్నామా?” అని కూడా ప్రశ్నించారు.

స్వామీజీ జనవరి 14,1980న సాయి చరణాలలో ఐక్యమయ్యారు. ఈ రోజు జనవరి 14 మనమందరము విశేషముగా విష్ణు సహస్రనామ పారాయణ చేద్దాం.

వనమాలీ గదీ శార్ జ్ఞీ  శంఖీ చక్రీ చ నన్దకీ!

శ్రీ మాన్నారాయణో విష్ణుః వాసుదేవోఽ భిరక్షతు!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles