Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి భక్తులలో అగ్ర శ్రేణిలో ఉన్నవారు సాయిని సర్వత్రా చూస్తారు, అనుభవిస్తారు. సాయినాధుని ఛాయలు వారిలో కనిపిస్తాయి.
నేను సాయి భక్తుడిని కాను, సాయి సేవకుడనని పలుమార్లు తెలిపారు శివనేశన్ స్వామీజీ.
జనవరి 1996లో ఒక భక్తుడు షిరిడీకి వచ్చి, సాయినాధుని దర్శనం చేసుకుని స్వామీజీని కలిసారు.
ఆ భక్తుని రాకలోగల ఆంతర్యం తనకున్న కేన్సర్ వ్యాధిని తొలగించుకోవటం. వారం రోజులలో వ్యాధి తగ్గింది. పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు.
స్వామీజీకి అనారోగ్యం వచ్చింది. అది రావటం కాదు, తెచ్చిపెట్టుకోవటమే. డాక్టర్లు స్వామీజీని పరీక్షించి, స్వామీజీకి కాన్సర్ అని నిర్ధారించారు.
ఇక పర్యవసానం చెప్పనక్కరలేదు. స్వామీజీ ఫిబ్రవరి 12, 1996న దేహాన్ని విడిచారు.
ఇది సాయిబాబా తాత్యా కోసం దేహ విసర్జన చేసినట్టుంది. ఆ దినం మాఘ బహుళ సప్తమి, సోమవారం.
సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత అనేకానేక సంఘటనలలో సజీవ రూపంలోను, స్వప్నాలలోను సాక్షాత్కరించారు.
సాయి అడుగుజాడలలో నడచిన స్వామీజీ కూడ అదే పని చేశారు.
స్వామీజీ ఒక భక్తునకు ఫకీరు వేషంలో కనబడి తాను మహారాష్ట్రము నుండి వస్తున్నానని, రూ.5/- దక్షిణ కావాలని అడిగారు.
ఆ యువకుడు తన జేబులో నుండి డబ్బు తీసి ఇవ్వబోగా ”ఇది కాదు, నీ దుకాణంలో నుండి తీసుకువచ్చి ఇవ్వు” అన్నారు.
ఆ యువ భక్తుడు దుకాణం నుండి డబ్బు తెచ్చి ఇవ్వగా దానిని స్వీకరించాడు ఆ ఫకీరు వేషధారి.
ఆ ఫకీరు వేషధారి అయిన స్వామీజీ, ఆ యువకుని ఆశీర్వదించి, కొంత దూరం నడచి చూస్తుండగానే అదృశ్యుడయ్యాడు.
ఈ పరమ పూజ్యుని మహాసమాధి పింపల్వాడి రోడ్డులో (పురాతన శ్రీ సాయి ప్రసాదాలయం నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో) ఉంది.
సాయి మహాసమాధి చెందటం జిత్తులమారితనం అంటారు హేమాడ్పంత్. స్వామీజీ విషయమూ అంతే!
”హరిద్వార, మధురా, కాశీ షిరిడీ మే తీర్థ సారే హై
సాయిబాబాకే చరణోమే చారో ధామ్ హమారే హై”
అని స్వామీజికి ఇష్టమైన గీతంతో ఆయనతో శృతి కలుపుదాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సాయిని సేవించిన తెలుగు వెలుగు…..సాయి@366 ఏప్రిల్ 12…Audio
- సాయి పాదానంద …..సాయి@366 జనవరి 14….Audio
- గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio
- గురువుకే నామం! …..సాయి@366 ఆగస్టు 9….Audio
- సబ్ కా మాలిక్ సాయి …. మహనీయులు – 2020… ఏప్రిల్ 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments