గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయి సూచనలను ఇచ్చుచునే ఉంటాడు. భక్తితో కూడిన మనసు దానిని గ్రహిస్తుంది.

స్వామీజీ కేశవయ్య గారు సాయి భక్తులందరకు సుపరిచితులే. ఆయన భార్యకు గత రెండు కాన్పులకు శస్త్ర చికిత్స జరిగినది. ఈ మూడవ కాన్పుకైనా శస్త్ర చికిత్స జరుగ కూడదని ఆయన వాంఛ.

ఈసారి ప్రసవము మామూలుగా, సహజంగా ఉండాలని ఆయన సాయినాథుని పూజించాడు.

ఒకనాటి రాత్రి స్వప్నంలో సాయిబాబా దర్శనమిచ్చి తీర్ధమును ప్రసాదించారు. ఇది శుభ సూచకమైన స్వప్నము.

మరొకసారి స్వప్నములో ఆయన భార్య చనిపోయినది. శవమునకు బదులుగా పుష్పములు ఉన్నట్లు ఆయనకు గోచరమయ్యెను.

మరొకసారి సాయి ఆయనకు స్వప్నములో కనిపించి షిరిడీకి పది రూపాయలు పంపమనిరి.

ధోవతుల జత కొత్తది తెప్పించి, పీలికలు చేసి దానము చేయమని సాయి సూచించారు. స్వామీజీ అదే విధముగా చేశారు.

ఈ స్వప్నములన్నియు సాయిబాబా తన భార్యను మృత్యువు బారి నుండి కాపాడగలరని భావించారాయన.

ప్రసవ కాలం సమీపించు చున్నది. ఒక స్వప్నములో తన భార్య చుట్టూ అగ్ని జ్వాలలు ఆవహించినట్లు, సాయి ఆకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆ మంటలను చల్లార్చినట్లు కల వచ్చింది.

ఇంకను మరొక రోజున స్వప్నమున సాయి ప్రత్యక్షమవ్వగా, స్వామీజీ సాయి పాద పద్మములకు నమస్కరించెను. ఇది తన భాగ్యమని స్వామీజీ భావించెను.

ఇక ప్రసవ దినము వచ్చినది. అది ఏప్రిల్‌ 21వ తేదీ, రాత్రి 3 గంటలకు ఆమెకు ప్రసవ వేదన ఆరంభమైనది.

ఆమె వేదనను, ఆవేదనను స్వామీజీ చూడలేక పోయారు. 13 గంటలు ఆమె బాధను అనుభవించింది. ఆ భార్య పడుచున్న వేదనతో ఆయన భక్తికి బీటలు వారినట్లనిపించింది.

సాయి ఏడి? సాయి వడి వడిగా రాడేమి? ఆ గరుడ గమనుడైన సాయి రక్షణలో నత్త వలె నడకను సాగించు చున్నాడేమి? ఇక సాయి సాయము చేయడని ఆయన నిర్ణయానికి వచ్చాడు.

సాయి పటము ముందు నుంచి లేచెను. ఆ క్షణమే ఆమె సుఖముగా ప్రసవించిందన్న వార్త వచ్చినది.

ఇందులో సాయి పొరపాటు, ఆలస్యము లేదు. సాయి సూచనల నిచ్చుచునే ఉన్నారు. తక్షణము సాయము చేయవలయునను కోరికను ప్రక్కకు పెట్టి, సాయి చెప్పిన ‘ఓరిమి’ని పాటించాలి.

ఓరిమిని బట్టే ఆ గరుడ గమనుని వేగము.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles