Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక వారంలో ఒక ఫ్లెక్సి బ్యానర్ మీద ఐదు జతల కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. ఒక వారం అయ్యప్ప స్వామి లాగా కూర్చున్నాడు. బాబా మొహంలా కనపడింది.
మా అమ్మాయి పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు మొదట అబ్బాయి నార్మల్ గానే కాన్పు అయింది. పాప అప్పుడు చాలా కష్టం అయింది.
డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అని అన్నారు. మా అమ్మమ్మ బాబా ఎందుకు దానికీ కష్టం మొదటిసారి బాగానే కాన్పు అయింది గా ఎందుకిలా కష్టం అంటున్నారు. అంత కష్టం అయితే నన్ను తీసుకుపోయి దాన్ని బ్రతికించు అని అనుకుంది.
అంతే! మా అమ్మమ్మ పడిపోయింది, చనిపోయింది. నాకు వెంటనే కాన్పు ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే అయిపోయింది. నాకు బహుశా ఆయువు తీరినట్లుంది కానీ మా అమ్మమ్మ అలా కోరుకొంగానే, నన్ను వదిలి మా అమ్మమ్మని పట్టుకు పోయాడా యముడు.
ఒకసారి శిరిడికి మావాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. నేను ఈ సారి ఎలాగైనా నాలుగు హరతలకి వెళ్ళాలి అని అనుకున్నాను.
నేను వెళ్లేసరికి ఉదయం ‘హారతి అయిపోయింది. మధ్యాహ్నం హారతకి టైం సరిపోలేదు. సాయత్రం హారతకి రాత్రి హారతకి వెళ్ళాము. మర్నాడు కాకడ హారతికి వెళ్ళాము.
మేము తిరుగు ప్రయాణానికి బయలుదేరాలంటే నాగర్సోల్ వెళ్ళాలి. మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోవాలి. నాకు ఇంకా మధ్యాహ్నం హారతి బాకీ వుంది.
కానీ సమయం లేదు. సామాన్లు సర్దుకొని ఒకసారి ప్రయత్నం చేద్దామని కనీసం కిటికీలోంచి అయినా హారతిని చూసుకుందాం అని నిలబడి వున్నాను.
అప్పుడే ఎవరో నార్త్ ఇండియన్స్ ని ఆ పక్క నుండి లోపలికి (మందిరంలోకి) సెక్యూరిటీ వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళు ఆరు,ఏడు మంది ఉన్నారు.
పక్కనే ఉన్న నన్ను కూడా వాళ్ళ మనిషే అనికొని నన్ను కూడా లోపలికి పంపించారు. నేను చాలా సంతోషం పడిపోయాను. లోపలికి వెళ్ళి సరిగ్గా సమాధి పక్కనే నిలబడి హారతి చూసాను.
తర్వాత వాళ్ళందరికీ పూజారులు ఒక స్వీట్, ఒక మామడి పండు ఇచ్చారు. నేను వాళ్ళతో ఉండటాన నాకు ఇచ్చారు.
నేనింకా రావటం లేదు అని మా వాళ్ళందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నేను లోపలి నుంచి రావడం చూసి ఆశ్చర్య పోయారు.
అలా నేను నాలుగు హారతులు చూసుకోవాలి అన్న కోరికను ఆయన నెరవేర్చాడు.
నాకు బాబా ఇచ్చిన ప్రసాదం మామిడిపండు తల ఒక ముక్కా పెట్టాను. అందరకీ ఆ ప్రసాదం అందింది.
మా పిన్ని గారి అమ్మాయి పీజీ చేసింది. ఉద్యోగ ప్రయత్నంలో ఒక చోట ఒక కంపెనీలో అప్రెంటిస్ గా చేరింది.
అది మూ డు నెలలు, ఆ మూడు నెలలు కూడా నెలకి 800 రూపాయలు స్టయిఫండ్ ఇస్తామని కంపెనీ చెప్పింది.
మూడు నెలలైన కూడా ఒక్కరూపాయి స్టయిఫండ్ ఇవ్వలేదు. పోనిలే అనుభవం వస్తుంది అని మరో మూడు నెలలు కూడా చేసింది.
దానికి కూడా వాళ్ళేమి ఇవ్వలేదు. కనీసం సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. ఒకరోజు ఉదయమే వీధి వాకిలి ఊడుస్తుంటే మా పిన్నికి కూతురు ఫోన్ చేసి అమ్మా వీళ్ళు (కంపెనీ వాళ్ళు) ఏమి ఇవ్వటం లేదు. ఇంకా ఇక్కడ చెయ్యటం దండగ అందుకని నేను ఈరోజు బయలుదేరి వచ్చేస్తున్నాను అంది.
మా పిన్ని చాలా బాధ పడిపోయింది. ఎందుకంటే ఏదో సర్టిఫికెట్ అన్నా వస్తే అది చూపించి మరో ఉద్యోగం సంపాదించవచ్చు అని అనుకున్నాము.
ఆరు నెలలు అయితే అయిపోయింది, సర్టిఫికెట్ ఇవ్వ లేదు, పైసా దబ్బులు ఇవ్వలేదు,ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఏడ్చుకుంటూ చీపురు అక్కడే పడేసి, బాబా ముందు కుర్చుని చెప్పుకుని ఏడ్చింది.
పది గంటలకి మళ్ళీ మా పిన్ని కూతురు ఫోన్ చేసి అమ్మా! వాళ్ళు డబ్బు ఇచ్చారమ్మా! అని చెప్పింది. అంతే! అది వెంటనే అక్కడి నుండి వచ్చేసి, మరో ఉద్యోగం చూసుకుని అందులో జాయిన్ అయిపోయింది.
మా అమ్మాయికి కూడా జ్యోతి పెట్టుకుంటాను అని అనుకోగానే జాబు వచ్చింది. 49 రోజులు అవ్వగానే H E L లో మంచి ఉద్యోగం దొరికింది,
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
Latest Miracles:
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
- క్షణకాలంలో మనసులోని కోరికను తీర్చిన బాబా వారు—Audio
- నా కోరికను తీర్చిన బాబా.
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments