భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఓం సాయి రామ్

గురుభ్యోనమః , అల్లా మాలిక్

నా పేరు అనిత,

2014 లో మేము జాబ్ పరపస్ మీద  మా ఫ్యామిలీ అంత పూణే లో ఉన్నాం .

అప్పుడు నా దగ్గర చిన్న సాయి బాబా మూర్తి ఒకటి ఉండెను , రోజు ఆ విగ్రహానికి పూజ చేసేదాన్ని. అయితే ఎప్పటినుండో నాకు ఒక్క కోరిక ఉండేది యెల్లో కలర్ , మీడియం సైజు బాబా మూర్తి కావాలి అని , కానీ ఈ విషయం నేను ఎవ్వరికి చెప్పలేదు నా మనసులోనే ఉంచాను .

షిరిడికి వెళ్ళాం. బాబా వారి దర్శనం చేసుకొని షాపింగ్ కి వెళ్ళాం. అక్కడ కూడ అసలు నేను ఎవ్వరికి చెప్పాలా నాకు యెల్లో కలర్( అంటే పూర్తిగా ఎల్లోవిష్ ) మూర్తి కావాలి అని ఎక్కడ చుసిన దొరకలేదు నాకు . .. నిరాశ పడ్డాను . బుక్స్  మరియు ప్రసాదాలు కొనుకొన్ని ఇంటికి బయలు దేరాము .

కొన్ని రోజుల తర్వాత అన్నయ్య ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాడు ఒక వారం కొరకు , హైదరాబాద్ లో మా పెద్దమ్మ మరియు పెద్దమ్మ కూతుర్లు ఉంటారు అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాక నా బర్త్ డే వచ్చింది. హైదరాబాద్ నుండి అందరు నాకు కాల్ చేసి విష్ చేసారు . .

మా అన్నయ్య హైదరాబాద్ నుండి పూణే రిటర్న్ అయ్యేటప్పుడు, మా పెద్దమ్మ కూతుర్లు అన్నయ్యకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు నాకు ఇవ్వమని ( బర్త్ డే గిఫ్ట్ ).అన్నయ్య సోమవారం పూణే వచ్చి ఆ గిఫ్ట్ నాకు ఇచ్చాడు , నేను ఆ గిఫ్ట్ ఓపెన్ చేశా సడన్ గా యెంత షాక్ అయ్యాను అంటే చెప్పలేను . ఆ బాక్స్ లో సాయి బాబా మూర్తి వుంది , యెల్లో కలర్డ్ సాయి బాబా.

అసలు నా కోరిక నేను ఎవ్వరితో చెప్పుకోలేదు , బాబా స్వయంగా నా కోరికను తీర్చాడు . అంతర్యామి అయన ఏ విదంగా నన్ను సంతోష పెట్టాడు అది మీకు చెప్పను.

సాయి  శరణం

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట

kishore Babu

Thank you So much Sai Sreenivas Murthy

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles