వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


!!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

!!!సద్గురు శ్రీ సాయి నాథుని శరత్ బాబూజీ కీ జై!!!

This audio has been prepared by Mr Sreenivas Murhty

  1. Mir-1-Uma-By-Sreenivas-Murthy 2:06

సాయి బంధువులకి నమస్కారం

నా పేరు ఉమా, హైదరాబాద్.

నాకు బాబా వారు ఇచ్చిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నా ఈ అనుభవం హోళీ పండుగ నాడు ఫోటో రూపంలో హేమాడపంత్  ఇంటికి బాబా  వెళ్లిన లీల వలె ఉండటం,  నాకు చాలా ఆనందం వేసింది. 

పోయిన సంవత్సరం వినాయక చవితి రోజు మా ఇంట్లో కొన్ని సమస్యలతో నేను చాలా బాధ పడ్డాను.

ఎందుకో ఆ రోజు నాకు అనిపించింది మనం వినాయకునికి పెట్టుకోము కదా! అందరు వినాయకునికి పెట్టుకొని పూజలు చేసుకుంటారు కదా!  మన గృహ దేవత మన ఇలవేల్పు బాబా యే కాబట్టి మనం కూడా బాబాని ఇంటి గుమ్మం పైన పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను.

అప్పుడు నా దగ్గర బాబా లామినేషన్ ఫోటో లేదు. సరే బాబా అనేసి నేను మా గురువుగారి ఫోటో గుమ్మం పైన పెట్టుకున్నాను.

కాని బాబా లీలలు ఎంత కరుణ,  దయలతో వుంటాయో నిజంగా బాబా వారు  నాకు  ఇచ్చిన ఈ అనుభం ద్వారా అర్ధం అయింది.

ఉదయం ఆరు గంటలకు లేచి దీపారాధన చేస్తుండగా శ్రీనివాస మూర్తి గారు ఫోన్ చేసి,  అమ్మా last  week  quiz  winner  మీరే, మీకు బాబా photo Prize గా ఇస్తున్నాము అని చెప్పగానే,  నాకు ఎంతో ఆనందమేసింది. ఇది వినిన వెంటనే నేను బాబాకి సాష్టాంగ ప్రణామాలు చేసుకున్నాను.

బాబా మీరు మీ ఇష్టం తో మాత్రమే రాగల్గుతారు కాని,  మేము ఏదో క్విజ్ లో గెలుచుకోవడం అనేది ఒక మిష మాత్రమే.

మేము నిస్సహాయులం ప్రభూ ! మీ మీద ఆధార పడటం, మీ నామ స్మరణ తప్ప మా కింకేమి తెలియదు సాయి. 

మీరు ఎప్పుడూ మా తప్పొప్పులను సవరించి మమ్మల్ని సన్మార్గంలో అంటే “మీ ప్రేమ మార్గంలో నడిపించండి తండ్రీ”!

మీరు నాకు ఇచ్చిన ఈ  అనుభవాన్ని సాయిభక్తులందరితో పంచుకొనే ఒక అద్భుతమైన అవకాశం  ఇచ్చిన వారందరికి నా కృతఙ్ఞతలు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio

Sai Baba

Great Sreenivas Murthy…Good initiative….

Sreenivas Murthy

Thank You Sir… మీరు నాకు confident & encouragement ఇవ్వబట్టే నేను చేయగలిగాను సాయి.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles