బాబా వారి సేవ చేసిన భక్తురాలి కుమార్తెకు సాయినాథుని దయతో బ్యాంకు జాబ్ వచ్చుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు దుర్గ, మా వారి పేరు ప్రసాద్. మా సొంత ఊరు రాజమండ్రి. రాజమండ్రి లో మాది చాలా పెద్ద బట్టల వ్యాపారం.

మా చేతికింద 10 మంది పనిచేసేవారు. అంత పెద్ద వ్యాపారము కూడా అయినవాళ్ళ చేతుల్లోనే మోసపోయి సర్వం పోగొట్టుకుని ఇంచు మించు కట్టు బట్టలతో హైదరాబాద్ వనస్థలిపురంలో అడుగుపెట్టాము.

ఏదయినా తిరిగి వ్యాపారం మొదలు పెట్టాలని అలోచించి, ఒక చిన్న హోటల్ మొదలు పెట్టాలని దానికోసం షాప్ వెతుకుతూన్న సమయంలో మాకు రఘుపతి గారన్న ఆయన పరిచయమై

ఆయనకీ తెలిసున్న నరసింహారావు గారింట్లో షాప్ ఖాళీగా ఉందంటూ వారింటికి తీసుకెళ్ళి, మా తరపున రఘుపతి గారే నరసింహారావు గారితో మాట్లాడి షాప్ ఇప్పించారు.

మేము అడ్వాన్సు ఇచ్చి ఎందుకు వెళ్ళాలనిపించిందో తెలియదు. బహుశా నాకు చిన్నపుడు బాబా గుడికి వెళ్ళటం అప్పుడప్పుడు అలవాటు ఉండబట్టో, లేక నరసింహారావు గారింట్లో సాయిబాబా ఫొటోలున్నాయి.

మరి అవి చూసాక మరినాకలా అనిపించిందో కాని మేము మొదటి సారిగా షిరిడి వెళ్ళాము. అదే మొదటి సారి బాబా దర్శనం.  ఆ తర్వాత అన్నిటికి బాబా ఏ మాకన్ని విధాలా సహాయంగా ఉంటూ వచ్చాడు.

ఒకసారి మా హోటల్లో బాండి లో నూనె పోస్తూంటే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జరిగిన పొరపాటు ఏమిటంటే మండుతున్న పొయ్యిమీద ఉన్న బాండి లో నూనె పొయ్యటం జరిగింది.

గ్యాస్ సిలిండర్ పేలి పోకుండా బాబాయే నాకు ఆ హడావిడిలో కూడా సిలిండర్ కనెక్షన్ తీసేయమని ప్రేరణ ఇచ్చి మమ్మల్ని మా షాప్ గల ఇంటినీ కూడా కాపాడాడు బాబా.

ఎన్నో ఒడిదుడుకులకు కోర్చి మా షాప్ ని ఒక కొలిక్కి తెచ్చుకున్నాను.

అటువంటి పరిస్థితుల్లో, మా షాప్ మెయిన్ రోడ్ మీద ఉండటాన నాకు శత్రువులు కూడా బాగానే తయారయ్యారు.

నేనన్ని విషయాలు బాబాకి విన్నవించుకుంటూంటే, నా బాధలన్నీ ఆయన తీర్చడం చేస్తూ వస్తున్నాడు. అసలు ఆయన ఉండబట్టి, మేము ఇంత దైర్యంగా ఉండగలుగుతున్నాము.

కొంతమంది బాబా భక్తులు కలిసి నెలలో ఒకళ్ళింట్లో అఖండంగా ఓవీ to ఓవీ చదువుతూంటారు. ఓసారి మా ఇంట్లో కూడా ఆ పారాయణ పెట్టుకున్నాము. అప్పుడు ఆ అఖండం లో బాబా వచ్చాడు.

మొన్న ఈ మధ్యన బాబావారి కరుణతో కూడిన లీల మా ఇంట్లో జరిగింది.

అది ఏమిటంటే మా అమ్మాయి ప్రియాంకకి ఈ మధ్యనే, బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా బాబా దయతోనే వచ్చింది.

అదెలాగంటే మా షాప్ ఓనర్ గారి చేతే ఈ గ్రంధం రాయబడుతోంది. దీనికి D .T .P వర్క్ కూడా సాయి భక్తులు చేసారు. అందులో మా ప్రియాంక కూడా ఉంది. కొన్ని అధ్యాయాలు చేసిందో లేదో దానికి ఉద్యోగం వచ్చి చేరిపోయింది.

అందులో జేరిన దాదాపు రెండు నెలల తర్వాత ప్రియాంక కు జ్వరం వచ్చింది, రెండు రోజులు మామూలు జ్వరమే అనుకుని ఏవో మందులు వాడాము. ఏమీ గుణం కనపడలేదు.

నాల్గవ రోజున హాస్పిటల్ కి తీసికెళ్ళాము. డాక్టర్ అన్ని టెస్టు చేసి ఇది డెంగ్యూ అని నిర్దారణ చేసారు. ప్లేట్ లెట్స్ 30 వేలకి  పడిపోయింది.

దానికి తోడు అమ్మాయికి అప్పుడే పిరియడ్స్ కూడా వచ్చాయి. అందువల్ల పరిస్థితి మరింత విషమించింది. మేమేమి చేయలేమని డాక్టర్సు చేతులెత్తేశారు.

ప్లేట్ లెట్స్ కోసం రక్తం ఎక్కిస్తూంటే తనకి రక్త స్రావం మరింత పెరిగి పోసాగింది. నాకేమీ పాలు పోవటం లేదు. నా దగ్గర చిల్లిగవ్వ లేదు.

ఏనాడూ చెయ్యి చాచి ఎవ్వరిని ఒక్క నయా పైసా అడగని నేను ఇంక మా అన్నయకి ఫోన్ చేసి “అన్నయ్యా! ప్రియాంక పరిస్థితి ఏమీ బాగా లేదు. హాస్పిటల్ లో జాయిన్ చేశాను. నా దగ్గర నయాపైసా లేదు. అనంగానే మరి బాబాయే వాడి చేత అలా పలికించాడేమో,

లేకపోతే ఈ ఊరు వచ్చి ఇన్నేళ్లు అయ్యి కూడా ఏనాడు నాకు సాయమూ చెయ్యలేదు. అటువంటి అన్నయ్యా నేను ఫోన్ చేయగానే, విషయం తెలిసి తను ఇంచు మించు ఏడుస్తూ

చెల్లీ ఖర్చు గురించి నువ్వు ఆలోచించకు ఎంత ఖర్చు అవుతుందో నేను పెట్టుకుంటాను, ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానంటూ మరునాటికి రాజమండ్రి నుండి వచ్చేసాడు.

ఈ లోపున నాకేం చేయాలో తోచటం లేదు. మా ఇంటిదగ్గరే ఉన్న శమంతకమణిగారు అన్న సాయి భక్తురాలు ఉన్నది. ఆవిడ దగ్గరకి పరిగెత్తాను.

ఆవిడ బాబా పూజలు మొదలు పెడుతోంది. (ఆ రోజు గురువారం) సరిగ్గా ఆ సమయానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్లాను. నేను ఏడుస్తూనే మా ప్రియాంక విషయం చెప్పానావిడకి.

ఆవిడ చాలా గంభీరంగా “దుర్గా ఎందుకేడుస్తావు. వెళ్లి బాబా ముందు దీపాలు వెలిగించు. ఏమీ కాదు మీ అమ్మాయికి మళ్ళీ గురువారం భజనకి రా, ఊదీ తీసికెళ్ళి మీ అమ్మాయికి రాయి ఊ వెళ్ళు” అంటూ నాకు బాబా ఫోటో, ఊదీ ఇచ్చింది.

నేను ఇదేమిటీ ఈవిడ ఇలా మాట్లాడిందేమిటి? అనుకుంటూనే హాస్పిటల్ కి చేరి బాబా ఫోటో ప్రియాంక దగ్గర ఉంచి, పిల్లకి ఊదీ పొట్టకి ఒళ్ళంతా రాస్తూనే ఉన్నాను. బాబా నామం చెపుతూనే ఉన్నాను.

ప్లేట్ లెట్స్ పెరగాలంటే బొప్పాయి ఆకులు రసం తాగిస్తే తొందరగా రికవరీ వస్తుంది. మీ అమ్మాయి చిన్న పిల్లే కాబట్టి తొందరగా గుణం ఉంటుందంటూ ఒక సీనియర్ డాక్టర్ వచ్చి చెప్పాడు. మేమా రసం కూడా పిల్ల చేత తాగించాము.

ఎలాగయితేనేమి మళ్ళీ గురువారం తిరిగేటప్పటికీ పిల్లకి బాబా దయవలన తగ్గిపోయి ఇంటికి తీసుకు వచ్చేసాను.

మా అమ్మకి నేను సేమియా పాయసం చెయ్యమ్మా. ఆ పాయసం గుడికి తీసుకువెల్లాలనుకుని, చెయ్యమని నేను షాప్ దగ్గరకి వచ్చి, పని అయ్యాక ఇంటికి వెడితే అమ్మ పాయసం చెయ్యలేదు.

అప్పుడు హారతి సమయం అయ్యి పోతోందని నేనే రెండు డబ్బాలలో పోసి, ఒకటి బాబా గుడిలోనూ మరొకటి శమంతకమణి గారింట్లోనూ ఇవ్వాలని పట్టుకు వెళ్ళి గుడిలో ఇచ్చేసి, ఆంటీ వాళ్ళింటికి వెళ్లేసరికి,

ఆవిడ పాపం నీరసంగా ఉండటాన బాబా కోసం ప్రతి గురువారం సేమియా తప్పకుండా చేస్తారట. ఆ రోజు నీరసం వల్ల ఆవిడ చెయ్యలేక పోయింది.

ఆ సమయం లో నేను ఆ పాయసం తీసుకెళ్ళే సరికి ఆవిడ ఆశ్చర్య పోయి, విషయం చెప్పింది.

ఈసారి నేను ఆశ్చర్య పోయాను. ఆలోచించగా నాకు అప్పుడు గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే నేనోసారి బాబా కి సేమియా నైవేద్యం పెట్టించాలనుకున్నాను. ఆ విషయం నేను మర్చిపోయాను.

ఈ సందర్భంలో పాయసం విషయం నాకు చెప్పకనే చెప్పి నేననుకున్నది నెరవేర్చి మా అమ్మాయి ప్రాణాలు కాపాడాడు బాబా.

మొత్తం ఖర్చంతా మా అన్నయ భరించాడు. ఈ విధంగా దూరం అయిన బంధం కూడా చేరువైంది. ఇప్పుడు మా అన్నయ్యా రోజూ ఫోన్ చేస్తున్నాడు. అంతా బాబా దయ.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు.

శుభం భవతు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles