Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆ ఇంటికి వెళ్ళాక కొన్నాళ్ళకి మా ఆవిడ గర్భవతి అయ్యింది. నెలలు నిండాక మా ఆవిడ మా అత్తగారింటికి వెళ్ళింది.
రేపు డెలివరీ అవుతుందనగా ఈ రోజు ఆసుపత్రికి తీసుకెళ్ళారు, కూడా మా అత్తగారు ఉంది. నేను మా మామగారింట్లోనే పూజ గదిలో పడుకున్నాను.
బాబాను తలచుకుంటున్నాను. నాకు నిద్రపట్టింది. నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు ఒక చిన్న బాబు కనిపించాడు.
వెంటనే టాటా చెపుతూ చెయ్యి ఊపుతున్నాడు. అదీ కల. టాటా చెపుతున్నాడేంటి? నాకు అర్ధం కాలేదు.
మర్నాడు మా ఆవిడకి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకుని స్వీట్స్ పంచాను.
అంతా బాగానే ఉంది. రెండు రోజులు అయింది. బాబు కి మోషన్ అవ్వలేదు. ఎందుకా? ఎందుకా? బాబుకి అన్ని రకాల టెస్టులు చేసారు.
పిల్లాడిని మరో ఆసుపత్రి లో చేర్చారు. తల్లి ఒక ఆసుపత్రిలో ఉంది. చివరికి బాబుకి మల ద్వారం లేదు అని తెలిసింది. ఆపరేషన్ చేయాలన్నారు. చేశారు.
ఎన్నో మందులు వాడారు. మొత్తానికి 11వ రోజు బాబు చనిపోయాడు. మా ఆవిడ బాబాను ఇంక తిట్టడం మొదలు పెట్టింది.
నీ కోసం నేను ప్రార్ధనలు పూజలు చేస్తుంటే నువ్వు నాకు గర్భశోకం కలిగిస్తావా? అని బాబాను బాగా తిట్టింది.
ముందు గర్భస్రావం, ఆ తరువాత బాబు పుట్టి ఇలా జరగటం ముఖ్యంగా మా ఆవిడ తట్టుకోలేక పోయింది.
బాబాకి పూజలు కూడా మానేసింది. మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంభం ఉంది. ఆవిడ మా ఆవిడతో స్నేహంగా ఉంటుంది.
ఎందుకంటే వారు బాబా భక్తులు. బాబా విషయాలు వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆవిడ మా ఆవిడకి అట్లా బాబాను దూషించకూడదు. బాబాకి పూజ చేయకుండా ఉండకూడదు. ఎం జరిగినా మన మంచికే అనుకోవాలి. మీ బాబు అలా చనిపోవటంలో కూడా బాబా ఉద్దేశ్యం ఏదో ఉండే ఉంటుంది.
అందుకని నువ్వు అలా బాబాకి పూజ చేయకుండా ఉండకూడదు అని ఆవిడ మా ఆవిడ తోటి చెప్పింది.
ఆ బ్రహ్మలావిడకి మొదట్లో మా ఆవిడే శ్రీ సాయిసచ్చరిత్ర పుస్తకం షిరిడి నుండి మరీ తీసుకొచ్చి ఇచ్చింది. అందుకని మా ఆవిడంటే అభిమానం.
ఆవిడ అలా చెప్పేసరికి మా ఆవిడ మళ్ళీ బాబా పూజ మొదలు పెట్టింది. అప్పుడు మా ఆవిడకి ఒక కల వచ్చింది.
ఆ కలలో బాబా కనపడి నువ్వు అనవసరంగా బాబు పోయాడని బాధపడుతున్నావు. అదే బిడ్డని నీ కడుపులోకి తెప్పిస్తాను అని అన్నాడుట.
1989 లో నేను ఆల్విన్ లో ఉద్యోగం లో చేరాను. 1998 లో నేను CRS తీసుకున్నాను. 9 సంవత్సరాలు ఆ ఉద్యోగం చేసాను.
అక్కడ జాబ్ నుండి విరమించే ముందు సంవత్సరమే నేను ఏదో ఒకటి చేయాలని బాగా అలోచించి నేను మళ్ళీ బార్బర్ షాప్ తీసుకున్నాను.
నేను షాపు బాగా డెకరేట్ చేశాను. 3 , 4 చైర్స్ వేసాను. అది ముస్లిం ఏరియా బాబా పేరు కూడా కలసిరావాలని, sainyo అని పేరు పెట్టాను.
మంచి వర్కర్స్ ను పెట్టాను. ఒక సంవత్సరం ముందు ఓపెన్ చేసాను. ముగ్గురు పని వాళ్ళు పని చేస్తున్నారు.
1 సంవత్సరం ఉన్నా ఆ షాపు లో పని వాళ్లకి సరిపడా డబ్బులు మాత్రమే వస్తుండేది.
మరి ఉద్యోగం కూడా లేకుండా రేపటి నుండి నేను ఆ షాప్ మీదే ఆధారపడాలి. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని బాగా ఆలోచించాను.
ఇలా డబ్బులు చాలకుండా నేను షాప్ నడపలేను. తీసేయాలనుకున్నాను. ఆ షాప్ 11 నెలలు మాత్రమే ఉంచాను.
షాపు ఖాళీ చేస్తానని ఓనర్ కి చెప్పి నా అడ్వాన్స్ ఇచ్చేయమన్నాను. ఆ షాపులో సామానంతా తీసేసాను.
నేను ఇంటికి వచ్చే దారిలో ఒక షట్టర్ ఖాళీగా కనపడింది. అది అడిగాను. దాన్ని మాట్లాడాను.
ముందు షాపులో పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా షాప్ ఓపెన్ చేశాను.
దాని పేరు ఈ సారి శ్రీ సాయి అని పెట్టాను. మన పని మనం చేసుకోవడానికి నామోషీ పడితే ఇలాగే ఉంటుంది.
అక్కడ ముస్లిం ఏరియా అని బాబా పేరు కించపరిస్తే ఆయన నడవకుండా చేసి నాకు బుద్ధి చెప్పాడు. అందుకని షాపు కి బాబా పేరు శ్రీ సాయి అని పెట్టాను.
అది బాగా రన్ అయింది. చాలా బావుండేది. ఉదయం 6 గంటలకు షాపు తెరిస్తే రాత్రి 10 గంటల వరకూ బాగా జనం వచ్చేవారు. ఈ లోపు ఉద్యోగం విరమణ అయిపోయింది.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
Latest Miracles:
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
- సాయి మహారాజ్ పై భారం వేసి చేసిన నా భర్త Heart ఆపరేషన్ success అవ్వుట
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- బాబా ఇచ్చిన ఇటుక
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments