బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మరోసారి మా లలితకి బాగా జ్వరం వచ్చింది.

ఏవో మందులు వేస్తున్నాము కానీ తగ్గుముఖం పట్టలేదు. బాగా ఒళ్ళు కాలిపోతుంది.

మా లలితా మీరు ఎప్పుడు బాబా బాబా అంటూ ఉంటారు, చూడండి ఇప్పుడు నాకెంతటి జ్వరం వచ్చిందో. అసలు తగ్గటం లేదు, అంది విసుగ్గా.

అలా అనకు ఉండు ఊధీ పెడతాను అంటూ ఊధీ తీసుకు రావటానికి పూజా రూమ్ లోకి వెళ్లి, తిరిగి ఇలా వచ్చి అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాను.

మా ఆవిడ ఏమిటండీ! అలా బిగుసుకు పోయారు అంది. నాకు ఏడుపు వస్తోంది. ఏమయిందండీ? ఎందుకేడుస్తున్నారు? అంది.

కంగారుగా ఉండవే బాబా నాకు కనిపిస్తున్నారు అన్నాను. బాబా కనిపిస్తున్నారా? ఎక్కడా? అంది.

ఇదిగో ఇక్కడే మా ఆవిడ పడుకున్న మంచం పక్కన చూపించాను. ఏరీ? అంటూ లలితలేచి కూర్చుంది. ఇదిగో ఇక్కడే చూసాను.

నేను ఊధీ తీసుకుని ఇలా వచ్చేసరికి నిన్ను దీవిస్తూ ఇక్కడ బాబా నిలబడి ఉన్నారు అన్నాను ఏడుస్తూ, అవునా అంటూ తాను ఏడ్చేసింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles