క్షణకాలంలో మనసులోని కోరికను తీర్చిన బాబా వారు—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా…. సాయి బాబా.

This Audio has been prepared by Mrs Lakshmi Prasanna.

  1. Mir-6-Kishore-By-Lakshmi-Prasanna 3:27

నా పేరు కిషోర్ బాబు కొండవీటి.

నేను గుంటూరులో Post Graduate చదివే రోజులలో మా ఇంటి Owners నన్ను ఒక కుటుంబ సభ్యుడుగా చాలా ప్రేమగా చూసుకొనే వారు.

వారు వయసులో చాలా పెద్ద వారు, వారు నన్ను తన మనవాడిలాగా చూసుకొనే వారు. నేను కూడా వారిని అలాగే అమ్మమ్మ, తాతయ్య అనే వాడిని.

కొన్ని నెలల తరువాత వారి ఇంటిని Rennovation చేస్తూ మా Roommates అందరిని vacate చేయమన్నారు.

కానీ తాతయ్య మాత్రం అమ్మమ్మకు అంతగా ఇష్టం లేకపోయిన తన US లో ఉండే కొడుకు Room లో ఉండమని బలవంతం పెట్టి, మిగిలిన నా Roommates Vacate చేయించాడు.

ఆ Room పక్కనే నేను భోజనం చేసే Mess ఉన్నది. ఆ Mess Aunty చాలా మంచిది.

నన్ను Mess కు వచ్చే అందరి Students లా కాకుండా తన కుటుంబ సభ్యునిలాగా చూసుకొనేది.

నాకు కాఫీ, టీ లు తాగడం అలవాటు లేదన్న , పెద్ద గ్లాసులో పాలు కలిపి ఇచ్చేది. ఇది జరిగి 14 సంవత్సరాలు అయినది. అయినను వారి ప్రేమను( House Owners & Mess Aunty ) ఎప్పటికి నేను మరచి పోలేను.

నేను చాలా కాలంగా బాబాని, వారిని ఒకసారి కలిసేటట్లు చేయి సాయి అని అడుగుతూఉన్నాను.

ఒకసారి నేను శిరిడీలో గురుస్థాన్ ఏదురుగా కూర్చొని వారి గూరించి అలోచిస్తూ ఉంటె, ఒక Aunty, Senior Citizens కు దర్శనం Tokens ఎక్కడ ఇస్తారు అని నా ప్రక్కనున్న ఆయనను అడిగింది.

అయన తెలియదని సమాధానం చెప్పాడు.

వెంటనే ఆ Aunty నా వైపు తిరిగి నన్ను అడుగుతుంది, నేను ఆవిడకి సమాధానం చెప్పుచున్నాను, వెంటనే ఆవిడా నన్ను గుర్తు పట్టింది, నేను కూడా ఆవిడను గుర్తు పట్టాను.

ఆవిడే గుంటూరులో మా Room పక్కన ఉండే Mess Aunty . తాతయ్య గారి విషయం అడుగుదాం అనుకునే లోపు తాతయ్య, అమ్మమ్మ ఇద్దరు చనిపోయారు అని చెప్పింది. నాకు చాలా భాద వేసింది.

బాబా గారు చేసిన లీల ఎంత చిత్రంగా ఉందో చూడండి. నేను గుంటూరు వెళ్లి వారి యోగ క్షేమములు తెలుసుకుందాము అనుకున్నాను.

బాబా సముఖమున (గురుస్థాన్ దగ్గర) వారి గురింఛి అలోచన రావడం ఏమిటి? క్షణకాలంలో నా కోరికను తీర్చడం ఏమిటి?

ఈ అనుభవం నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కళ్ళలో ఆనందభాష్పములు వస్తున్నాయి.

మనము మనః స్ఫూర్తిగా బాబా వారిని నమ్మి అయన పాదాల చెంత కూర్చుంటే మనకు కావలసినవన్నియు మన దగ్గరికి వచ్చెలా చేస్తారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “క్షణకాలంలో మనసులోని కోరికను తీర్చిన బాబా వారు—Audio

KIRAN

SAI BABA NAAKU KALALO DARSHANAM ICHHARU. ELA ANTEY MAA INTLO SAI BABA DINING TABLE MEEDHA KOORCHONI ANNAM THINTUNNATLU. AA ANNAM KOODA ERRAGA UNDHI PACHHADI KALUPOKONI THINTUNNATLUGA ANIPINCHINDHI.IDHI EARLY MORNING4 GANTALU OCHHINDHI. AA SAI BABA NAAKU DARSHAM ICHHARU ILA. ILAA OSTHEY DHAANI ARDHAM EVARAINA CHEPPAGALARAA. OM SRI SAI NATHAYA NAMAHA.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles