Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు దుర్గా కుమారి, మాది విజయవాడ. నాకు చిన్నప్పటి నుండి దైవ భక్తి చాలా ఎక్కువ. ఎందుకు అంటే మా తాత తండ్రులు బాగా పూజలు, వ్రతాలు చేస్తూ ఉండే వాళ్ళు.
అన్ని దేవతలను బాగా ఆరాధించే వాళ్ళు, భజనలు, కీర్తనలు, పూజలు, పారాయణాలు బాగా జరుగుతుండేవి.
అలాంటి కుటుంబం లోంచి వచ్చిన దాన్ని కాబట్టి సహజంగానే పూజలు, భజనలు అలవాటు అయ్యాయి.
ప్రతి మనిషిలోనూ దేవుడిని చూడటం, ప్రతి వస్తువులోను దైవ స్వరూపంగా అనుకోవడం చేస్తూ ఉండే దాన్ని.
అందరి జీవితాలలో లాగానే పెళ్ళి, పిల్లలు మామూలుగానే జరిగింది. ఎవరు ఎక్కడ భజన అన్నా, పూజ అన్నా నేను వెళ్ళే దాన్ని. అలా నాకు చాలా మంది పరిచయం అయ్యారు.
అందరం కలిసి సత్సంగమముగా అయ్యాము. అందరం కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. అలా ఒకసారి శ్రీశైలం వెళ్ళాము. అక్కడ ఒక ఆశ్రమం చూడడానికి వెళ్ళాం.
అక్కడ ఆశ్రమం ఎవరు అయితే నడుపుతున్నారో ఆ వ్యక్తి (స్వామిజి) ఆశ్రమ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం నేను కళ్లారా చూసాను.
అప్పటి నుంచి, ఎవ్వరినీ (స్వామిజీలను) అంత తొందరగా నమ్మరాదని, ప్రాపంచిక సుఖాలకి ఏ మనిషి కూడా అతీతుడు కాదని విరక్తి చెందాను.
తుచ్ఛమైన, హేయమైన కోరికలకు ఎంత వారు అయినా దాసోహం అయిపోతారా? సన్యాసం ముసుగులో అరాచకాలకైనా లొంగి, భక్తి కి కాక ”రక్తి” కి లొంగి పోతున్నారే. ఇంతేనా! ఆధ్యాత్మికానందం అంటే అని అలోచించి ఆశ్రమ దర్శనం మానుకున్నాను.
ఇలా బాధ పడుతున్న తరుణంలో హైదరాబాద్, వనస్థలిపురంలో ఉన్న మా తమ్ముడు మల్లిఖార్జున రావు గారు బాబా ఫోటో ఒకటి నా చేతికి ఇచ్చి ”అక్కా! భజన, ఏకాహం జరిపించు, అని ఆదేశించాడు.
ఆయన అప్పటికే బాబా యొక్క పరమ భక్తుడు. నేను వెంటనే ఆ ఫోటో లోని మూర్తి ని చూసి పరమ సంతోషంతో మురిసి పోయాను.
నా మనసు ఆయన్ని చూడంగానే ఆనందంతో గంతులేసింది. నేను అంతకుముందు ఆ మూర్తిని చూసి ఉండలేదు, అదే మొదటిసారి.
తమ్ముడు చెప్పిన రీతిలోనే నేను శ్రీ సాయి బాబా వారి నామ సంకీర్తన జరిపించడం జరిగింది.
ఉదయం నుంచి పూజ, నామం, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పనితో కొంచెం అలిసి నట్లు అయ్యి కొద్ది సేపు అలా నడుము వాల్చాను.
అలా నడుము వాల్చి ”బాబా స్వయంగా నాకు కనపడాలి, నేను ఆయన్ని చూడాలి అని ఆలోచిస్తున్నాను.
రాత్రి ఎనిమిది గంటలకి ఒక దేవాలయ అర్చక బృందం షిరిడి వెళ్తూ దారిలో తినడానికి పదార్ధాలు ఇవ్వమని అడిగి పెట్టించుకుని వెళ్లారు.
అదే రోజు రాత్రి పది గంటలకి ఎవరో ఒక వృద్దుడు భోజనానికి వచ్చాడు. నేను లోపల పనిలో ఉన్నాను, ఎవరో వచ్చి ఒక ముసలాయన భోజనానికి వచ్చాడు అన్నం పెట్టమంటారా? అని నన్ను అడిగితే నేను పెట్టమని చెప్పాను.
నేను ఆయన్ని చూడలేదు, ఆయన రూపం అంతా బాబా లాగే ఉందని, ఆయన బాబానే అయ్యి ఉంటాడని మా వాళ్ళు అన్నారు.
నేను చూడలేక పోయానే అని బాధ పడ్డాను. ఇది జరిగిన సరిగ్గా నెల రోజుల తర్వాత నేను ఉదయం ఇంటి బయట అరుగు మీద కూర్చున్న సమయంలో ఒక స్త్రీ, నేను సాయి బాబాని చూడాలని వచ్చాను అంటూ చొరవగా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది.
నేను ఆమెను ఆపి, ఇలారా నా పక్కన కూర్చోమని, ”లోపల నీకు ఏమి పని” అంటూ నేను ఎంత అడ్డు కోవడానికి ప్రయత్నించినా, ఆమె నన్ను తోసుకుంటూ లోపలికి గుమ్మం దాటి వచ్చేసింది.
నేను ఆమెని చాప వేసి కూర్చోమని చెప్పాను, ఆమె కూర్చుంది. ఆమె గతంలో మాకు జరిగిన సంగతులన్ని చెప్పడం మొదలుపెట్టింది.
నేను పడ్డ బాధలు అన్నీ కూడా చెప్పింది. ఆమె వయసు దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి.
ఆమె సన్నగా, పొడుగ్గా మహారాష్ట్రా కట్టుతో ఉంది. నేను నా మనవడు పుట్టిన తర్వాత వాడిని, కొడుకుని అందర్నీ షిరిడి తీసుకుని వెళ్లాలని అనుకున్నాను.
కానీ, పిల్లవాడికి ఐదవ నెల వచ్చినా కూడా షిరిడి వెళ్ళడానికి ఏవో ఆటంకాలు, అవాంతరాలు ఎదురు అవుతున్నాయి.
ఆ వచ్చినావిడ మనవడిని షిరిడి ఎప్పుడు తీసుకువస్తావు? నేను ఎదురు చూస్తువున్నాను. ఎన్ని రోజులు చేస్తావు? అని అంది.
దక్షిణ త్వరగా ఇవ్వు, నేను వెళ్ళాలి అంది. నేను పది రూపాయలు ఇస్తే, నేను ఏమైనా బిచ్చగత్తె లాగా కనపడుతున్ననా? అంది కోపంగా.
నేను ఎంత ఇవ్వమంటావు? అని అడిగాను. ఎంత ఇవ్వాలో నీకు తెలియదా? అందరికి ఎప్పుడు ఇస్తూనే ఉంటావుగా అంది.
అప్పుడు నేను మరో పది రూపాయలు తీసి ఇచ్చాను. అది తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది.
నేను బాబాను స్వయంగా చూడాలి అనుకున్నాను. పూజ జరిగిన రోజు రాత్రి ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళితే నేను ఆయన్ని చూడలేక పోయానే అని బాధపడ్డాననే అని కాబోలు
ఇంట్లో ఎవరూ లేని సమయాన నాకు ఆయన ఆడ మనిషిగా దర్శనం ఇచ్చి, మేము తీర్చకుండా జాప్యం చేస్తున్న మొక్కును గుర్తు చేసి, నా చేత ఇరవై రూపాయలు దక్షిణ ఇప్పించుకుని వెళ్లారు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
- మా ఆవిడా రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అని మరాఠీ వాని రూపములో వచ్చిన ఆయన అన్నారు.
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- జీవితంలో నా భర్త నడవటం కష్టం అని చెప్పిన డాక్టర్ మాటలను, అసత్యం చేసి, త్వరలోనే మామూలు మనిషిని చేసిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments