Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక రోజు మా వారు పని మీద వేరే ఊరు వెళ్లి వస్తున్నారు. ఇంకో అరగంటలో బస్సు దిగిపోతారు.
తెల్లవారుజామున నాలుగు గంటల సమయం చీకటిగా ఉండటం మూలాన తను దిగాల్సిన స్టేజి దాటిపోతుందేమో అని బస్సులో నిలబడి చూస్తున్నారట.
ఆ రోడ్ మీద దిగితే మా ఇంటికి అయిదు నిముషాలు నడక అందుకే అక్కడ దిగాలని నిలబడ్డారట.
ఇంతలో ఏమైందో ఏమో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడుట. ఆయన వెనక్కి పడ్డాడట.
ఈ లోపున దిగాల్సిన స్టేజి వచ్చింది. బస్సు లో మా వారు కొంచెం కూడా కదలలేక పోయారుట. అడుగు వేద్దాం అనుకుంటే వల్లకావటం లేదుట.
బస్సు లో తోటి ప్రయాణికులు సాయంపట్టి క్రిందకి దింపి వాళ్ళ దారిన వాళ్ళు పోయారుట.
ఆయనకి అప్పుడు నెమ్మదిగా అర్ధం అయ్యిందట తన కాలికేమో అయింది. కాలు తుంటి నుంచి వేలాడి పోతున్నట్లుగా, అనిపిస్తోందట.
నెమ్మదిగా నాకు ఫోన్ చేసారు. ‘నేను బస్సు దిగాను. కాని రాలేక పోతున్నాను. ఎవరినైనా పంపు అన్నారు.
రాలేకపోవడం ఏంటి ఇక్కడే కదా సామానుకూడా ఏమి లేదు వచ్చేయవచ్చు కదా అన్నాను నేను.
“నేను పడ్డానని కొంచెం దెబ్బ తగిలింది అని రాలేకపోతున్నానని చెప్పారు.
ఈ సమయం లో ఎవరు వస్తారు, నేనేం చెయ్యను అన్నాను. క్రింద పోర్షన్ లో ఉన్న నారాయణరావు గారికి ఫోన్ చేసి ఆయనను రమ్మనమని చెప్పు అన్నారాయన.
నారాయణరావు గారి భార్య ‘మణి’ గారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడకి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయనను రోడ్ దగ్గరకి పంపమని చెప్పాను.
నారాయణరావు గారు వెళ్ళేటప్పటికి మా వారు రోడ్ మీద పడి ఉన్నారట. ఏమైందో తెలుసుకుని నారాయణరావు గారు మావారిని ఆటో వాళ్ళ సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చూపించారు.
ఈ లోపల నేను మణి గారు హాస్పిటల్ కి వెళ్ళాం. డాక్టర్ చూసి x ray తీసి తుంటి లో బాల్ పక్కకు తప్పుకుందని మా వారు ఇంక నడవటం కష్టమని జీవితకాలం వీల్ చైర్ లోనే వుండాలని,
లేకపోతే రాడ్ వేస్తామని అది కూడా గ్యారెంటీ లేదని ఆ రాడ్ కూడా రెండు, మూడు ఏళ్ళకి ఒకసారి మార్చాలని ఏం చేసినా నడిచేది లేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు.
ఇంక నాకు భూమి కంపించి పోయింది. పిల్లలు చాలా చిన్న వాళ్లు ఇల్లు ఎలా గడుస్తుంది. నేనేం చెయ్యను ,
ఆడ పిల్ల ఉంది. పెళ్లి ఎలా చేయాలి, ఆయన్నలా చూసుకుంటూ నేనెలా బ్రతకాలి. అప్పుడు ఆపరిస్థితిలో ఆ సమయంలో ఇంక నాకు బాబా తప్ప దిక్కు ఇంకెవరు.
“బాబా తండ్రీ! ఏది చేస్తే మావారు లేచి తిరుగుతారో. ఎలా చేస్తే ఆయన్ని మామూలుగా చూడగలుగుతానో ఎలా ఉంటె మా బ్రతుకులు బాగుంటుందో అది చేయి బాబా” అని మనసులోనే బాబా కి ప్రార్ధన చేసుకున్నాను.
ఒక డాక్టర్ ఎక్కడినుండో వచ్చాడు. ఆయన మా వారిని టెస్ట్ చేసి, ఆపరేషన్ చేసి, రెండు స్క్రూలు వేశారు. కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంచి ఇంటికి పంపించారు.
నడిచేది మాత్రం లేదనే అన్నారు. నేను బాబాకి నా దైన్యస్థితిని చెప్పి వేడుకుంటూనే ఉన్నాను.
ఇరవై రోజులపాటు బాగా రెస్ట్ తీసుకున్నారు. ఇరవైఒకటో రోజున మంచం దిగి తానంత తానె అడుగులు వేసి నడిచారు. ఇది జరిగి మూడు ఏళ్ళు అయింది.
బాబా మా పై చూపిన దయవల్ల ఇప్పటి వరకు ఎటువంటి సమస్య ఎదురవ్వలేదు. బాబా దయవల్ల మా వారు బాగానే నడుస్తున్నారు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru
Latest Miracles:
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!
- యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments