Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి ఆరతులలో నామదేవుని కీర్తనలు చోటు చేసుకున్నాయి.
నామదేవుడు మహారాష్ట్రకే పరిమితం కాలేదు. సిక్కుల ఐదవ గురువైన అర్జునదేవ్ నామదేవ్ కి పరమేశ్వరునికి తేడా లేదన్నారు.
నామదేవునకు ఆలయం హోషియార్ పూర్ లో కట్టబడింది. ఆ ఆలయంలో ఆయనకు నేటికి పూజలు జరుపుతారు.
రాజస్థాన్ లో నామదేవ్, జ్ఞానదేవ్ లు కలసి పర్యటించారు. ఒకసారి నామదేవ్, జ్ఞానదేవ్ లు నడుస్తుండగా, ఇద్దరికీ దాహం వేసింది.
ఎదురుగా ఒక బావి కనిపించింది. చేద (బొక్కెన) లేద్దక్కడ. జ్ఞానదేవుడు తన యోగ శక్తితో సూక్ష్మ రూపంలో బావిలోనికి పోయి, దాహం తీర్చుకుని వచ్చి నామదేవ్ ను కూడా అలా చేయమన్నాడు.
జ్ఞానేశ్వరుని యోగ శక్తే ఇంత చేస్తే, విఠలుని శక్తి ఇంత కంటే గొప్పది కాదా? అని తలచి “దాహం తీర్చవయ్యా” అంటూ పాండురంగని ప్రార్ధించాడు.
ఒక ఊట నూతి నుండి చిమ్మింది. దాహం తీర్చుకున్న నామదేవుడు పాండురంగనికి కృతఙ్ఞతలు చెప్పాడు.
ఈ సంఘటనకు గుర్తుగా మార్గశిర మాసంలో బికనీర్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలయాత్ లో భక్తులు ఉత్సవాన్ని చేస్తారు.
ఆయనకు విఠలుడే ప్రాణం, స్నేహితుడు కూడా. “మనం కూర్చుని పాడితే విఠలుడు కూర్చుంటాడు. మనం నృత్యం చేస్తే అతడూ నృత్యం చేస్తాడు. కీర్తనలంటే అతడు మురిసిపోతాడు. ఇది కళ్లారా చూసిన దృశ్యం” అంటాడు నామదేవ్ ఒక అభంగంలో.
నామదేవుని భక్తి, అతని గృహస్థ జీవితానికి ఆటంకం కలిగించ లేదు. రాళ్లను పరశు వేదులగా మార్చగల శక్తి ఉన్నా, ఎప్పుడూ ఆ పని చేయలేదు.
పాండురంగని ఆలయం వద్ద ఆయన సమాధి ఉందంటారు.
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంధ సాహెబ్ లో ఆయన 61 శబ్దాలు చేర్చబడ్డాయి. ఆయన గురుదాస్ పూర్ లో కాలధర్మం చెందారు అని సిక్కులు అంటారు.
ఒక అభంగంలో నామదేవుడు “గానం నీ చెంతనే ఉండనీ. నాకు నీ ప్రేమ కావాలి. నిన్నే నేను ప్రేమించాలి” అంటారు నామదేవుడు.
విసోబా నామదేవుని గురువు. నామదేవుడు అన్ని జీవులలోను పాండురంగడినే దర్శించేవాడు.
నామదేవుడు 29.10. 1270లో జన్మించాడు.నేడు 29 అక్టోబరు, నామదేవుని జయంతి.
నామదేవుని స్మరిద్దాం, పాండురంగని మనం కూడా స్నేహితునిగా భావిద్దాం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి సంపద…..సాయి@366 అక్టోబర్ 29….Audio
- ఉపవాసము…..సాయి@366 అక్టోబర్ 11….Audio
- మోక్షం ఎందుకు?…..సాయి@366 నవంబర్ 27….Audio
- చిట్టి చెల్లెలు…. మహనీయులు – 2020… అక్టోబరు 25
- ఏక్ ఓంకార్ …. మహనీయులు – 2020… అక్టోబరు 20
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments