Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
అక్టోబరు దసరా రోజులలో శ్రీమతి గోఖలే మూడు రోజులు షిరిడీలో ఉపవసించ వలెనన్న కోర్కెతో దాదా కేల్కర్ ఇంట బస చేసింది.
సాయి ఆమెతో ”ఉపవాసము చేయలసిన అవసరమేమి? కేల్కరు ఇంట బొబ్బట్లు వండిపెట్టుము. వాని పిల్లలకు పెట్టి నీవును తినుము” అన్నారు.
ఆ సమయంలో కేల్కరు భార్య ఇంటిలోనికి వచ్చి వంట చేయకూడదు.అందుకే సాయి తనను కేల్కరు ఇంట వంటకు పురమాయించినాడని గ్రహించి సాయి మాటను పాటించింది.
సాయి శ్రీమతి గోఖలేకే కాదు, ఎందరెందరో ఉపవసింతునన్న వలదనెడి వాడు. కారణం ఉపవసించుట ఎట్లో వారికి తెలియదు.
నామదేవుడు పాండురంగని భక్తుడు. ప్రతి ఏకాదశికి ఉపవసించెడి వాడు. ఒక ఏకాదశినాడు నామదేవుని ఉపవసించ వద్దు అన్నాడు పాండురంగడు. కాని నామదేవుడు అంగీకరించలేదు. ఉపవసించెదనన్నాడు.
ఆనాడు ఏకాదశి. నామదేవుడు ఉపవసించు చున్నాడు. ఒక బ్రాహ్మణుడు ఆయన వద్దకు వచ్చి ”నాకు ఆకలిగా ఉన్నది, అన్నము పెట్టు” అని అడిగాడు. ”ఈనాడు వంట చేయము. ఈ ఫలములను తినుము” అని కొన్ని పండ్లనిచ్చాడు.
ఆ బ్రాహ్మణుడు ”అన్నము పెట్టుము. ఆకలిచే నేను మరణించిన నీకు పాపము కల్గును” అన్నాడు. ”పాప, పుణ్యములతో నాకేమీ సంబంధం లేదు. నీ ప్రాణము పోయినచో నా ప్రాణము కూడా పోవును” అన్నాడు నామదేవుడు దృఢంగా.
బ్రాహ్మణుడు మరణించాడు. దానికి నీవే కారణమని నామదేవుని ఆ ఊరి వారు నిందించారు. నామదేవుడు ధుఃఖించ లేదు. శవముతోపాటుగా తాను కూడ చితిపై పరుండి తనను దగ్దము చేయమని కోరాడు.
ఈ సంగతి నామదేవుని భార్యకు తెలిసి, తాను కూడా చితిపై భర్త ప్రక్కనే పరుండి, తనను కూడా దగ్ధము చేయమని కోరినది.
చితికి నిప్పు అంటించారు. అగ్ని వ్యాపించి మండుచున్నది. చూపరులందరు నివ్వెరపోయారు నామదేవుని సత్యనిష్టకు, నామదేవుని భార్య సహగమనమునకు. అగ్ని ఆరిపోయినది.
బ్రాహ్మణుని స్థానమున పాండురంగడున్నాడు. నామదేవుడు, ఆయన భార్య పాండురంగనికి ప్రణమిల్లారు.
ఉపవాసము ఉండుట అనగా ఆ దినమున పండ్లను భుజించుట కాదు, నిరాహారిగా ఉండుట కాదు. తీవ్ర వైరాగ్యంతో, తన ఉపాసన దైవం చెంత, భౌతికంగానైనను, మానసికంగా నైనను వసించటమే.
ఇది తెలిసి చేసిన ఉపవాసమే ఉపవాసము. లేకున్న శరీరమును కష్టపెట్టుటయే పాండురంగడు, సాయి చెప్పు భావమిదే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి సంపద…..సాయి@366 అక్టోబర్ 29….Audio
- దైవంతో స్నేహం …. మహనీయులు – 2020… అక్టోబరు 29
- మోక్షం ఎందుకు?…..సాయి@366 నవంబర్ 27….Audio
- గోఖలేగారి భార్య ఉపవాసము
- బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments