Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఆరతులలో జానాబాయి రచించిన అభంగాలే మూడు చోటుచేసుకున్నాయి.
జానాబాయి జీవితమే ఒక దివ్య గాథ. బాలికగా నున్నప్పుడు ఒక కార్తీక మాసంలో (సుమారు నవంబరు నెల) తల్లిదండ్రులతో పండరీపురం పోయి పాండురంగని దర్శిస్తుంది. ఇక ఆమె తిరిగి తన తల్లిదండ్రులతో తన గ్రామం గర్గఖ్డ్ పోలేదు.
పండరీపుర వాసి అయిన నామదేవుని గృహం చేరింది. ఆమె ఆ ఇంటనే పెరిగి పెద్దదయింది. బృందావనంలో తులసి వనంలా ఉండేది.
ఆమెకు నామదేవుడు గురువు. విఠలుడు తల్లి, తండ్రి కూడాను. ఆమె విఠలుని దర్శనం కోసం తహ తహలాడేది. ”ఎందుకు రావు? ఎందులకు దర్శనమీయవు?” అని వ్యాకులత చెందేది.
ఇంకా ఆమెకు నామదేవుని చూడటానికి వచ్చిన వారందరకు దగ్గరయ్యేది. సజ్జన సాంగత్యం ఆమెకు లభించింది.
ఆమె భక్తికి పరవశించిన రంగడు ఆమెకు దర్శన మిచ్చాడు. ఇది తన భక్తికి కీర్తి కిరీటం అనుకోలేదు.
”ఓ దీన జనోద్ధారా! ఓ దయాసింధో! నీకు జయము.
జ్ఞానదేవునికి, నామదేవునికి జయము.
వారి దయవలననే నిన్ను దర్శించగలిగాను” అని పాండురంగనికి మోకరిల్లింది ఆమె.
అసలు ఆమె నామదేవుని ఇంట దాసి. పాండురంగడే దాస్యం చేస్తున్నాడు ఆమెకు. ఆమె చిమ్ముతూ ఉంటే పాండురంగడు బుట్టలో వేసేవాడు.
తిరగలి పిడిపై ఆమెతోపాటే, పిడిపై చేతులు వేసి పాండురంగడు తిప్పేవాడు.
రామావతారంలో శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు సేవించినట్లు, జానాబాయి ఎంగిలి రొట్టెను తిని సంతోషిస్తాడు కృష్ణ రూపాంతరుడైన పాండురంగడు.
ఆమె 340 అభంగాలను రచించింది. వ్రాతకాడు పాండురంగడే! ఆమె ఒక అభంగంలో తాను ఎన్ని జన్మలెత్తినా సరే, ఆ జన్మలన్నింటిలోను పండరీపురంలోనే జన్మించాలని, నామదేవుని సేవిస్తూ ఉండాలనేది తన కోరిక అని పండరీనాథునకు విన్నవించుకుంటుంది.
పండరి దర్శనం, నామదేవునికి సేవ – వీటిముందు ముక్తి ఏపాటిది?
నామదేవుడు పాండురంగనిలో ఐక్యమయిన దినముననే జానాబాయి కూడా రంగనిలో ఐక్యమయింది.
అంతటి భక్తి భావము సాయిపై మనకు కూడా కల్గుగాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దైవలిఖితం…. మహనీయులు – 2020… జూలై 18
- ఉపవాసము…..సాయి@366 అక్టోబర్ 11….Audio
- భక్తి సంపద…..సాయి@366 అక్టోబర్ 29….Audio
- భక్తి శిఖరం .. …. మహనీయులు – 2020… ఆగస్టు 10
- చోఖామేళా …..సాయి@366 మే 28…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments