దైవలిఖితం…. మహనీయులు – 2020… జూలై 18



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


జానాబాయి పాండురంగడిని ఒక పురుషుడుగా భావించలేదు. “అమ్మా! రావమ్మా!!” అంటూ పిలిచేది. ‘పండరీబాయి; విఠబాయి’ అని పిలిచేది తన పాండురంగణ్ణి.

నామదేవుని ఇంట్లో బట్టలు ఉతుకుతున్నా, పాత్రలు కడుగుతున్నా కన్నీటి ధారలుకారేవి ఆమెకు, బాధతోనే.

ఆ కన్నీరు పనివలన వచ్చిన కన్నీరు కాదు, తనకు ఇంకా పాండురంగడు భౌతికంగా దర్శనమివ్వలేదనే బాధతో.

ఒకసారి ఆమెకు పాండురంగడు కనిపించాడు, నామదేవుని గృహంలో వాన పడకుండా చేస్తున్నప్పుడు.

అప్పుడు ఆమె రంగనికి వంటచేసి పెట్టింది. ఇంకా పాండురంగడు ఆమె ఉచ్చిష్టాన్ని తిన్నాడు కూడా.  అలా చేయటం రామునకు, సాయిబాబాకు చెల్లింది.

పాండురంగని మనసు ఎంత నవనీతమో అంట కఠినం.ఎంతటి భక్తునకైనా పరీక్షలు తప్పావుకదా?

కావేటి రంగడు తొండరడిప్పొడి ఆళ్వారును పరీక్షించినట్లు, జానాబాయిని పరీక్షించాడు. చిట్టచివరకు రక్షించాడు.

జానాబాయి “భక్తి చాలా కఠినమైనది. నివురు గప్పిన నిప్పు వంటిది.

మహా ప్రవాహంలో దుమకటం, గరళాన్ని త్రాగటంతో సమానం. పదునైన కత్తి వంటిది.

ఐనా సాధు సాంగత్యం వాళ్ళ అన్నిటినీ దాటగలమని తెలుసుకోవాలి” అంటుంది ఒక అభంగంలో.

ఆమెకు తన యజమాని నామదేవుడే గురువు. ఒకసారి ఆమె చేసిన పిడకలను, తన పిడకలని ప్రక్కింటమ్మాయి అన్నది. “కావు, అవి నావే” అంది జానాబాయి.

జనం పోగయ్యారు. “ఎలా నిర్ణయించేది?” అన్నారు జనం. “ఎం లేదు ఈ పిడకలను చెవి దగ్గర పెట్టుకోండి. విఠలనామం వినిపిస్తుంది.

నేను పిడకలు చేస్తూ విఠలనామం జపిస్తాను” అంది. జానాబాయి చెప్పింది నిజమే. పిడకలు జానాబాయికి చెందినవే అని ప్రజలు నిర్ణయించారు.

చూచేవారికి, పిడకలకోసం జానాబాయి అంతగా పట్టుబట్టాలా? అనిపిస్తుంది. ఆ పిడకలు నామదేవునివి, తన యజమానివి. యజమాని ఆస్తిని కాపాడటం సేవకుని ధర్మం.

సాయిబాబా సచ్చరితను వ్రాయలేదు, హేమాడ్ పంత్ చే వ్రాయించుకున్నాడు.

ఐతే పాండురంగడు జానాబాయి చెప్పిన అభంగాలను స్వయంగా వ్రాసేవాడు.

ఒకసారి జ్ఞానదేవుడు పాండురంగడు స్వయంగా జానాబాయి అభంగాలు వ్రాస్తుంటే, కారణం అడిగాడు “జ్ఞానదేవా! జానాబాయి కీర్తనలు గానంచేసి, తదనుగుణంగా జీవించు వారు తప్పక నా పద సన్నిధికి రాగలరు. ఇది నా శాసనము” అన్నాడు పాండురంగడు.

జానాబాయి (1350) పాండురంగనిలో ఐక్యమైంది.

సాయిబాబా అరతులలోని జానాబాయి కీర్తనలను స్మరించి, ధన్యులమవుదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles