భక్తి శిఖరం .. …. మహనీయులు – 2020… ఆగస్టు 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పాండురంగడు నామదేవునితో ఆడుకున్నట్లు తుకారాంతో ఆడుకోలేదు. జానాబాయి ఇల్లు ఊడ్చినప్పుడు, చెత్తను పాండురంగడు ఎత్తినట్లు తుకారాంకు చేయలేదు.

“తల్లి పిల్ల వానిని గుండెలకు హత్తుకున్నట్లు నన్ను ఎందుకు అక్కున చేర్చుకోవు? నేను నడవలేను. నన్నెత్తుకోవా? నీవు నిజంగా తల్లివేనా?” అని అభంగాలలో తన వ్యాకులతను వెలిబుచ్చుతాడు తుకారాం.

ఒకసారి కొందరు భక్తులు పండరీపురం పోతుంటే, వారికి క్రింద లేఖ వ్రాసి ఇచ్చి, పాండురంగని ముందు చదవమంటాడు వారిని…..

“ఓ దేవా,

“నీ కన్న అన్య  దైవమును ఏనాడు స్మరించలేదు. నీ మహోత్సవము దర్శించేందుకు వీలులేని వ్యాధి నాకు వచ్చింది. నన్నెందుకిలా వదిలేశావు? నా యోగక్షేమాలు  విచారించి రమ్మని నీ దాసులలో ఒక్కరినీ పంపలేదు. నీ బిడ్డను బ్రోచుట నీకు కష్టమా? నా మొర వినకుంటే సాటి భక్త జనులకు ఈ సంగతి చెప్పి, వారు నీకు చెల్లించే భక్తి అనే వేతనమును నిలిపివేస్తాను. నీ వియోగము భరించలేకున్నాను, నీ దగ్గర నుండి  ప్రత్యుత్తరం వచ్చేవరకు సాష్టాంగ దండ ప్రణామము చేసి లేవకుండా భూమిపై పడి ఉండెదను.

                                                                                                             ఇట్లు

నీ దాసానుదాస పాద ధూళి రేణువు

                                                                                                              తుకారాం”

భక్తులు ఆ ఉత్తరాన్ని చదువుతారు. “నీవు ఈ గరుడుని మూపున కూర్చుండి వెంటనే రావలయును” అని పాండురంగడు గరుత్మంతుని పంపాడు.

తుకారాం గరుత్మంతునకు నమస్కరించాడు. పాండురంగని సన్నిధి చేరిన తుకారాం ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు?

బహినాబాయి అనే పేరు గల తుకారాముని భక్తురాలు “భక్తి అనే ఆలయానికి పునాది వేసింది, ఆలయ నిర్మాత జ్ఞానదేవుడు.

అతని శిష్యుడైన నామదేవుడు దానికి ప్రాకారం కట్టాడు. జనార్దనుని శిష్యుడైన ఏకనాథుడు భాగవత పురాణ వ్యాఖ్యానమనే ధ్వజ స్తంభాన్ని నిలబెట్టిన వాడు. ఆలయ శిఖర నిర్మాత తుకారాం” అని వ్రాసింది.

ఇతరుల కష్ట సుఖాలు పట్టించుకున్న వాడే నిజమైన సాధువు అంటారు తుకారాం.

ఒక మృత శిశువును తెచ్చి తుకారాం పాదాల వద్ద ఉంచి ఒక మాతృమూర్తి విలపిస్తుంటే, దయతో కంపించిపోయిన తుకారాం మహిమచే మృత శిశువుకు జీవం వచ్చింది.

తుకారాం గాథను సాయి వీక్షిస్తున్న చిత్రం ఉంది. సాయికి ఇచ్చే హారతులు తుకారాం ఆరతితో ఉదయం ప్రారంభమై, రాత్రి తుకారాం హారతితో ముగుస్తుంది.

భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ వారు  10 – 08 – 2002న స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

నేడు ఆగస్టు 10, తుకారాంను స్మరిద్దాం. “అంతా విఠలమయం”గా చూద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles