Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా కూడా తుకారాంలాగ సంతు (సాధువు). వారి మాటలు ఒకేలా ఉంటాయి. ”షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము” అంటారు సాయి. షిరిడీ అంటే సంతుల గ్రామమే.
సంతుల గ్రామానికి వెళితే ఏం జరుగుతుంది? ఏమి లభిస్తుంది? షిరిడీని గురించి సాయి చెప్పాడు.
తుకారాం కూడ అంతేనా? దీనికి సమాధానం ఆయన అభంగాల్లో స్పష్టంగా చెప్పారు. సంతుల గ్రామానికి ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్ళాలని, ఆళంది, పండరిపురం, దేహు అలాగే షిరిడీ.
తుకారాం ఇలా అంటారు:
ప్రేమతోనే ఉంటుంది సంతుల గ్రామం; కొంచెం కూడా ఉండవక్కడ దుఃఖం, దైన్యం; ఉంటాను యాచకుడనై నేనక్కడ;
పెట్టుబడి ఉండనిదే సంతుల గ్రామం; విఠలుడే అక్కడ విత్తం, ధనం; ఆ అమృతపానమే సంతుల భోజనం; ఉపదేశం అనే పేటలో చేస్తారు; ఇచ్చి పుచ్చుకోవటాలకు పెట్టుబడి అక్కడి ప్రేమ, సుఖాలు తుకారాం అంటున్నాడు – ఇది తప్ప మరో ఉపాయం లేదుగా, అందుకే ఉన్నాను నేను అక్కడ బికారిగా.
సాయికి తుకారాంకు అనేక పోలికలున్నాయి. ఇద్దరి జన్మ దినం కచ్చితంగా తెలియదు. ఆ ఇద్దరూ నిరాడంబరులే. సాయి మాటలలో, తుకారాం అభంగాలలో అక్కడక్కడ కొంత యాస కనిపిస్తుంది, అలగా జనం మాటలు తగుల్తాయి. ఆ ఇద్దరిలో ఆవేశం, ఆలోచన, మార్మికత్వం ఉన్నాయి.
ఆ ఇద్దరి పుణ్య తిథులకు పల్లకీలు వస్తాయి, దేశంలోని వివిధ ప్రదేశాల నుండి.
సాయిబాబా ఆశ్వయుజ శుక్ల ఏకాదశినాడు దేహాన్ని విసర్జించితే, తుకారాం ఫాల్గుణ బహుళ తదియనాడు (మార్చి నెలలో) వైకుంఠవాసుడయ్యాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- ఏకత్వం ….. సాయి@366 ఫిబ్రవరి 27….Audio
- భక్తి శిఖరం .. …. మహనీయులు – 2020… ఆగస్టు 10
- షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio
- పాట పాడుమా! ….. సాయి@366 మార్చి 1…..Audio
- కలయో! వైష్ణవ మాయయో! …..సాయి@366 మార్చి 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments